iDreamPost
android-app
ios-app

తెలంగాణా అబ్బాయి.. ఆంధ్ర ట్రాన్స్ జెండర్.. ఇద్దరూ కలిసి..

ప్రేమకు అర్థం ఏదంటే.. నిన్ను నన్నే చూపిస్తా అంటున్నాడు ఈ కుర్రాడు. పెద్దలు ఒద్దంటున్నా.. ఎదురించి మరీ పెళ్లి చేసుకున్నాడు. ప్రేమకు కుల, మతాలు, వయస్సు వ్యత్యాసమే కాదూ.. లింగ బేధం కూడా అడ్డురాదని నిరూపిస్తున్నారు ఈ జంట.

ప్రేమకు అర్థం ఏదంటే.. నిన్ను నన్నే చూపిస్తా అంటున్నాడు ఈ కుర్రాడు. పెద్దలు ఒద్దంటున్నా.. ఎదురించి మరీ పెళ్లి చేసుకున్నాడు. ప్రేమకు కుల, మతాలు, వయస్సు వ్యత్యాసమే కాదూ.. లింగ బేధం కూడా అడ్డురాదని నిరూపిస్తున్నారు ఈ జంట.

తెలంగాణా అబ్బాయి.. ఆంధ్ర ట్రాన్స్ జెండర్.. ఇద్దరూ కలిసి..

ప్రేమకు కుల మతాలే కాదూ, వయస్సు వ్యత్యాసం కూడా సమస్యే కాదని నిరూపిస్తున్నాయి కొన్ని ప్రేమ జంటలు. తమకు నచ్చిన వ్యక్తితో జీవితాంతం కలిసి నడవాలని భావించి పెళ్లి పీటలు ఎక్కుతున్నారు లవర్స్. అలాగే ప్రేమించడానికి లింగ బేధం కూడా అడ్డుకాదని నిరూపిస్తున్నాయి మరికొన్ని లవ్ బర్డ్స్. ఇటీవల కాలంలో ట్రాన్స్ జెండర్, లెస్బియన్స్ పెళ్లిళ్లు చేసుకుంటున్న సంగతి విదితమే. అయితే ఏ ప్రేమకు అడ్డు ఆస్తులు, అంతస్థులు కాకపోయినా.. తల్లిదండ్రులు మాత్రం విలన్స్ పాత్ర పోషిస్తుంటారు. తాము ఇష్టపడుతున్నాం..  మీరు పెళ్లి చేయొద్దు.. మేమే చేసుకుంటాం. కనీసం ఆశీర్వదించండీ అంటే.. అడ్డు పుల్లలు వేస్తున్నారు.

పరువు, సమాజం అంటూ పాత పాటలే పాడుతున్నారు. పెద్దలు వద్దని చెప్పినా.. తాను మనస్సు పడ్డ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని తెగేసి చెప్పాడు. అయినప్పటికీ అంగీకరించకపోవడంతో పెళ్లి చేసుకున్నాడు. ఇంతకు వారు పెళ్లికి వద్దనడానికి కారణం ఆమె ట్రాన్స్ జెండర్ కావడమే. ఈ ఘటన ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విషయం వెలుగులోకి వచ్చింది. తెలంగాణకు చెందిన గణేష్.. జిల్లాలోని నందిగామకు చెందిన దీపు అనే ట్రాన్స్ జెండర్ ప్రేమించుకున్నారు. అతడి ప్రేమను ఇంట్లో చెబితే ఒప్పుకోవడంతో.. ప్రియురాలితో కలిసి ఆమె స్వస్థలైన నందిగామకు వచ్చారు. అక్కడే పెళ్లి చేసుకున్నారు.

తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారిని పిలిపించి మాట్లాడారు. తాము ఇద్దరం ఇష్టప్రకారమే పెళ్లి చేసుకున్నామని చెప్పే సరికి పోలీసులు వారిని పంపించేశారు. అయితే తమ ప్రేమ, పెళ్లి ఈ సమాజానికి కనువిప్పు కలిగించేవేనని గణేష్, దీపు జంట చెబుతున్నారు. ఓ ట్రాన్స్ జెండర్ తో జీవితాన్ని పంచుకోవడం తప్పేమీ కాదని గణేష్ చెబుతున్నాడు. కేరళలో ఇద్దరు ట్రాన్స్ జెండర్స్ పెళ్లిళ్లు చేసుకుని వార్తల్లో నిలిచిన సంగతి విదితమే.  ఇలాంటి పెళ్లిళ్లు చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.  బిడ్డలను కూడా దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. సమాజపు ఈసడింపుల నుండి తమ కోసం బ్రతుకుతున్నారు. కష్టపడి పనిచేస్తూ గుర్తింపు కోసం పోరాడుతున్నారు.  ఈ వైవిధ్యమైన పెళ్లిళ్లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.