Arjun Suravaram
ఎంతో మంది జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. ఈ క్రమంలోనే వివిధ ప్రమాాదాల్లో చిక్కుకుని నరకయాతన అనుభవిస్తారు. అలానే బిహార్ కి చెందిన ఓ వ్యక్తి తారు డబ్బాలో ఇరుక్కుని మూడు రోజుల పాటు నరకం అనుభవించాడు. చివరకు...
ఎంతో మంది జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్తుంటారు. ఈ క్రమంలోనే వివిధ ప్రమాాదాల్లో చిక్కుకుని నరకయాతన అనుభవిస్తారు. అలానే బిహార్ కి చెందిన ఓ వ్యక్తి తారు డబ్బాలో ఇరుక్కుని మూడు రోజుల పాటు నరకం అనుభవించాడు. చివరకు...
Arjun Suravaram
జీవితం అంటేనే నిత్యం పోరాటం. తన వివిధ అవసరాల కోసం మనిషి అనేక పోరాటలు చేస్తుంటారు. కొందరు మాత్రం మూడు పూటల అన్నం దొరకడం కోసమే నిత్య పోరాటం చేస్తుంటారు. తమ కుటుంబాల కోసం ఎంతో మంది ఇతర ప్రాంతాలకు వెళ్లి..కూలీ పనులు చేస్తుంటారు. ఈక్రమంలోనే కొందరు అనుకోని ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతుంటారు. తమతోటి వారు ఇలా ప్రాణాలు కోల్పోతున్నా..తమ వారి కోసం దూర ప్రాంతాల్లోనే ఉంటున్నారు. ఈక్రమంలోనే కొన్ని కొన్ని ప్రమాదాల్లో చిక్కుకుని నరకం అనుభవిస్తుంటారు. ఇటీవల జరిగిన ఉత్తరాఖండ్ టన్నెల్ ఘటనే అందుకు ఉదాహరణ. తాజాగా ఓ వ్యక్తి అనుకోకుండా తారు డబ్బాలో ఇరుక్కుపోయాడు. మూడు రోజుల పాటు నరకం అనుభవించాడు. చివరకు ఏమైందో తెలుసుకోవాలంటే.. అసలు స్టోరీలోకి వెళ్లాల్సిందే..
ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో షాకింగ్ ఘటన జరిగింది. బిహార్ కు చెందిన ఓ వ్యక్తి పనుల నిమిత్తం విజయవాడకు వచ్చాడు. ఇక్కడే స్థానికంగా పని చేసుకుంటూ తోటి వారితో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే మూడు రోజు క్రితం అనుకోకుండా తారు డబ్బాలో ఇరుక్కుపోయాడు. అతడి సగం శరీరం మొత్తం తారులో బిగుసుకుపోయింది. అతడిని గమనించని మిగతా కూలీలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయం మూడు రోజులు గడిచిన ఎవరికీ తెలియలేదు. మూడు రోజుల తరువాత.. ఆ డ్రంబ్ నుంచి పెద్ద ఎత్తున కేకలు రావడంతో అటుగా వెళ్తున్న స్థానికులు విన్నారు. అక్కడి వెళ్లి చూడగా ఓ వ్యక్తి సగంపైగా తారులో బిగుసుకుపోయి ఉన్నాడు. దీంతో అతడిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు రెస్క్యూ టీంకి సమాచారం ఇవ్వడంతో వారు కూడా అక్కడి చేరుకున్నారు. చాలా సేపు మాములుగా ప్రయత్నిస్తే ఫలితం లేకుండా పోయింది. దీంతో రెస్క్యూ టీం తో కలిసి పోలీసులు ఆ డబ్బాను కట్ చేసి వ్యక్తిని బయటకు తీశారు. అనంతరం వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అతడు ఎలా అందులో ఇరుక్కున్నాడు అనే విషయంపై మాత్రం పూర్తి క్లారిటీ లేదు. ఇలా వలస కూలీలుగా ఇతర ప్రాంతాలకు వెళ్తున్న వారు ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవలే ఉత్తరాఖండ్ లో ఓ టన్నెల్ కూలిన ప్రమాద ఘటనలో దాదాపు 41 మంది చిక్కుకుపోయారు. దాదాపు 18 రోజుల పాటు శ్రమించి.. వారిని బయటకు తీసుకొచ్చారు. ఇలా కొందరు ప్రమాదాలన నుంచి బయటపడగా.. మరికొన్ని సందర్భాల్లో మాత్రం ప్రాణాలు పోతుంటాయి. మరి.. ఇలాంటి ఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మూడు రోజులుగా తారు డబ్బాలో ఇరుక్కుపోయిన కూలి
ఎన్టీఆర్ జిల్లా – బిహార్‌కు చెందిన ఓ వలస కూలి తారు డబ్బాలో ఇరుక్కుపోయాడు. సగం శరీరం మొత్తం తారులో బిగుసుకుపోయింది. మూడు రోజుల తర్వాత గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
వారు రెస్క్యూ టీంతో కలిసి డబ్బాను కట్ చేసి… pic.twitter.com/T6jGj1j2we
— Telugu Scribe (@TeluguScribe) February 7, 2024