iDreamPost
android-app
ios-app

తెలుగు తమ్ముళ్ళ కొట్లాట.. ఎస్సైకి తీవ్ర గాయాలు

  • Published Jan 04, 2024 | 12:01 PM Updated Updated Jan 04, 2024 | 12:07 PM

ఏపీలో త్వరలో ఎన్నికల జరగబోతున్నాయి.. అధికార, ప్రతిపక్ష నేతలు వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించాలని తమ తమ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీలో కొన్ని ప్రాంతాల్లో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.

ఏపీలో త్వరలో ఎన్నికల జరగబోతున్నాయి.. అధికార, ప్రతిపక్ష నేతలు వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించాలని తమ తమ వ్యూహాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీ టీడీపీలో కొన్ని ప్రాంతాల్లో వర్గపోరు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.

  • Published Jan 04, 2024 | 12:01 PMUpdated Jan 04, 2024 | 12:07 PM
తెలుగు తమ్ముళ్ళ కొట్లాట.. ఎస్సైకి తీవ్ర గాయాలు

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించి తాము అధికారంలోకి రావాలని ప్రతిపక్ష పార్టీ నేతలు రక రకాల ప్రయాత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ వైసీపీ మాత్రం తాము చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకు వెళ్లి మరోసారి ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికే ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి మంచి స్పందన కూడా వస్తుంది. సీఎం జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత విద్యా, వైద్య, వ్యవసాయ, మహిళా సంక్షేమాలపై దృష్టి పెట్టారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కోసం కృషి చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. టీడీపీలో కొన్ని ప్రాంతాల్లో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నారు. తాజాగా టీడీపీ కార్యాలయంలో తెలుగు తుమ్ముళ్లు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఈ గొడవలో డ్యూటీలో ఉన్న ఎస్సైకి గాయాలు అయ్యాయి. ఈ ఘటన తిరువూరు నియోజకవర్గంలో జరిగింది.  పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆంధ్రప్రదేశ్ టీడీపీలో వర్గ పోరు భగ్గుమంటున్నాయి. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బుధవారం తరువూరు నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్న వర్గీయుల మధ్య తీవ్ర స్థాయిలో కొట్లాట జరిగింది. ఈ నెల 7న టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరు రానున్నారు.. ఈ సందర్భంగా ఏర్పాట్ల విషయంలో నాయకుల మధ్య ఫ్లెక్సీ వివాదం మొదలైంది. కేశినేని నాని.. ఎమ్మెల్యే గద్దె రాంమోహన్, జిల్లా ప్రెసిడెంట్ నెట్టెం రఘురాం, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణతో కలిసి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి దేవదత్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ నాని ఫోటో లేకపోవడంపై గొడవ నడుస్తుంది. దేవదత్ పై నాని వర్గీయులు ఫైర్ కావడమే కాదు.. స్థానిక నేతలు దేవదత్ ని ఒక గదిలో ఉంచి తలుపులు వేశారు. అదే సమయానికి నాని సోదరుడు చిన్ని పార్టీ కార్యాలయానికి విచ్చేశారు. చిన్ని గో బ్యాక్ అంటూ నానీ వర్గీయులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

ఈ నేపథ్యంలో వర్గీయుల మధ్య గొడవకు జరిగింది. మొదట మాటల యుద్దం నడిచింది.. తర్వాత ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. అక్కడ వాతావరణం రణరంగాన్ని తలపించింది. ఎంపీ కేశినేని నాని, ఆయన సోదరుడు చిన్న వర్గీయులు దాడులకు తెగబడి కుర్చీలు, చెప్పులు, పిడుగద్దులు గుద్దుకుంట నానా రచ్చ చేశారు. పరిస్థితి అదుపు చేయడానికి శాంతి భద్రతలను పరిరక్షించడానికి సీఐ అబ్దుల్ నబీ ఆధ్వర్యంలో ఇరు వర్గాలను చెదరగొట్టినప్పటికీ గొడవ మరింత ఉధృతం చేశారు. చేతికందిన వస్తువులను విసురుకున్నారు. పోలీసులు ఎంతగా నచ్చజెప్పినా రెచ్చిపోయి కొట్టుకున్నారు. టీడీపీ కార్యాలయంలో ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేశారు. ఈ గొడవ చూసి కొంతమంది పార్టీ నేతలు, కార్యకర్తలు భయంతో అక్కడ నుంచి పలాయనం చిత్తగించారు.

ఇక ఇరు వర్గాలను చెదరొట్టేందుకు రంగంలోకి దిగారు పోలీసులు. అదే సమయంలో స్థానిక ఎస్సై సతీష్ తలకు తీవ్ర గాయం అయ్యింది. వెంటనే ఆయనను దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు పోలీసులు. తోపులాటలో ఓ మహిళకు కూడా గాయం అయినట్లు తెలుస్తుంది. మొత్తానికి తెలుగు తమ్ముళ్ళు చేసిన ఘనకార్యానికి చంద్రబాబు పర్యటన పై సమీక్షంచకుండానే నేతలు వెను తిరిగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.  ఈ ఘటనపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.