iDreamPost
android-app
ios-app

విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

School holiday: విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్తను అందించింది. రేపు ఈ జిల్లాలోని పాఠశాలలకు సెలవును ప్రకటించింది. వర్షాలు, వరదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. భారీ వర్షాల కారణంగా వరద రావడంతో వాగులు, కాలువలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు ప్రాంతాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. వరదల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఇక ముందస్తు చర్యల్లో భాగంగా పాఠశాలలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం. రేపు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లాలో స్కూళ్లకు సెలవు ప్రకటించింది. ఈ జిల్లాలో వర్షాలు, వరదల తీవ్రత దృష్ట్యా రేపు అనగా బుధవారం స్కూళ్లకు సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖధికారి సుబ్బారావు తెలిపారు.

అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవు ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఇంకా పలు ప్రాంతాలు వరదనీటిలో చిక్కుకోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. వర్షాల కారణంగా ఏ విధమైన ప్రమాదాలు చోటు చేసుకోకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఏపీ ప్రజలు వర్షాలు, వరదల నుంచి తేరుకోకముందే మరో అల్పపీడనం భయపెడుతున్నది. ఈ నెల 5న అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.