iDreamPost
android-app
ios-app

ఎస్సై మంచి మనస్సు..రోడ్డుపై చెప్పులు కుట్టే వ్యక్తికి షాపు ఏర్పాటు!

ప్రజలను రక్షించడం పోలీసుల విధి. ఈ క్రమంలోనే వారు కాస్తా కాఠిన్యతను చూపిస్తుంటారు. అందుకే చాలా మంది పోలీసులపై నెగిటీవ్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. ఎంతో మంది పోలీసులు నిజాయితీతో పని చేస్తూ ప్రజల గుండెల్లో దేవుళ్లుగా ఉంటారు.

ప్రజలను రక్షించడం పోలీసుల విధి. ఈ క్రమంలోనే వారు కాస్తా కాఠిన్యతను చూపిస్తుంటారు. అందుకే చాలా మంది పోలీసులపై నెగిటీవ్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. ఎంతో మంది పోలీసులు నిజాయితీతో పని చేస్తూ ప్రజల గుండెల్లో దేవుళ్లుగా ఉంటారు.

ఎస్సై మంచి మనస్సు..రోడ్డుపై చెప్పులు కుట్టే వ్యక్తికి షాపు ఏర్పాటు!

సమాజంలో జరిగే అన్యాయాలను, నేరాలను అరికడుతూ ప్రజలను రక్షించడం పోలీసుల విధి. ఈ క్రమంలోనే వారు కాస్తా కాఠిన్యతను చూపిస్తుంటారు. అందుకే చాలా మంది పోలీసులపై నెగిటీవ్ అభిప్రాయంతో ఉంటారు. ఎంతో మంది పోలీసులు నిజాయతీతో పని చేస్తూ ప్రజల గుండెల్లో దేవుళ్లుగా ఉంటారు. అలానే తమ మంచి మనస్సు చాటుకుంటూ ప్రజల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వర్షంలో తడుస్తూనే రోడ్డు పక్కన చెప్పులు కుట్టుకుంటున్న వ్యక్తికి తాజాగా ఓ ఎస్సై చేయుతనిచ్చారు. ఆయన చేసిన సాయంకి స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ ఎస్సై చేసిన పని ఏమిటో ఇప్పుడు చూద్దాం…

ఎన్టీఆర్ జిల్లా వత్సాయి ప్రాంతానికి చెందిన ఉప్పర కృష్ణ..తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. వత్సవాయి జెడ్పీ సెంటర్ రోడ్డు పక్కన నాలుగు తాటాకుల కట్టుకుని చెప్పులు కుడుతుండే వారు. అలా చెప్పులు కుడుతూ వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఎండైనా, వానైనా ఆ తాటాకుల కిందనే చెప్పులు కుడుతుండేవారు. ఆయనకు చెప్పులు కుట్టడమే జీవనోపాధి. ఈ క్రమంలోనే గత ఆదివారం వర్షంలో కూడా తడుస్తూ.. చెప్పులు కుడుతూ ఉండటాన్ని వత్సాయి ఎస్సై అభిమాన్యు చూశారు. జోరువానలో తడిచిపోతూ కూడా పని చేసుకోవడాన్ని చూసి.. ఎస్సై అభిమన్యు..కృష్ణకు సాయం చేయాలని భావించారు.

ఇక తన సిబ్బందిని కలిసి కృష్ణకు ఏదైనా సెట్టర్ ఏర్పాటు చేయాలని సూచించారు. అది నిర్మించేందుకు అయ్యే ఖర్చును తాను భరిస్తాని చెప్పాడు. దీంతో వత్సాయి పోలీస్ స్టేషన్ సిబ్బంది ఐరన్ ఫ్రేమ్ లతో చిన్న షెల్టర్ ను ఏర్పాటు చేశారు. దానికి పాదరక్షల ఆస్పత్రి అని బోర్డు పెట్టించారు. కృష్ణ పాదరక్షల ఆస్పత్రి అని పేరు పెట్టి.. ఆయనకు బహుకరించారు. సోమవారం చెప్పులు కుట్టే కృష్ణతో కలిసి ఎస్సై అభిమన్యు దుకాణాన్ని ప్రారంభించారు. ఎస్సై  చేసిన మంచిపనిపై స్థానికులు ప్రశంసలు కురిపించారు. కృష్ణ పడుతున్న ఇబ్బంది చూసి తక్షణమే స్పందించి షెల్టర్ ఏర్పాటు చేసినందుకు వత్సవాయి గ్రామస్తులు, ఇతర గ్రామాల ప్రజలు ఎస్సై అభిమన్యుకు అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్‌ జిల్లాలోని వత్సవాయి పోలీస్ స్టేషన్ లో ఎస్సై అభిమన్యు పనిచేస్తున్నారు.

ఇలా పోలీసులు చాలా సందర్భాల్లో తమ మంచి మనస్సును చాటుకున్నారు. పోలీసులు అంటే కేవలం కాఠిన్యంగా భావించే చాలా మందికి.. ఇలాంటి ఘటనలతో అయినా ఖాకీ డ్రెస్  వెనుక ఉన్న మంచి మనస్సు తెలుస్తుందని పలువురు అభిప్రాయా పడుతున్నారు. ఇటీవలే ఓ లేడీ ఎస్సై కూడా కాఠిన్యంతో పాటు అమ్మ ప్రేమను చూపించారు. బైక్ పై వెళ్తున్న ముగ్గురు యువకులను ఆపి ఫైన్ వేశారు. అయితే అవి కాలేజీ ఫీజు కోసం అంటూ వారిలోని ఓయువకుడు కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో ఆ లేడీ ఎస్సై..అమ్మలా ఆ యువకుడుని దగ్గరు తీసుకుని ఓదార్చింది. డబ్బులు ఇచ్చేసి..మరోసారి ఇలా చేయవద్దంటూ అక్కడి నుంచి పంపించేసింది. ఇలా తరచూ అనేక ఘటనలతో పోలీసులపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.