మాస్ చిత్రాల దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ ఏర్పరుచుకున్న వివి వినాయక్ గత కొంత కాలంగా పెద్ద యాక్టివ్ గా లేరు. బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ఛత్రపతి హిందీ రీమేక్ బాధ్యత తీసుకున్నాక దాని షూటింగ్ అయితే చేశారు కానీ అదసలు ఎప్పుడు విడుదల అవుతుందో ఎవరికీ తెలియనంత అయోమయం నెలకొంది. దీని సంగతలా ఉంచితే త్వరలో చిరంజీవితో ఓ సినిమా ఓకే కావొచ్చనే వార్త ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఆ మధ్య వచ్చిన అజిత్ […]
మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన అంచనాలున్నాయి. ఇది దశాబ్దాలుగా జరుగుతున్నదే. రాజకీయాల్లోకి వెళ్లి ఎనిమిదేళ్ల గ్యాప్ తీసుకుని తిరిగి ఎంట్రీ ఇచ్చాక ఖైదీ నెంబర్ 150 సక్సెస్ తో మంచి వెల్కమ్ ఇచ్చిన అభిమానులు పూర్తిగా సంతృప్తి చెందేలా గత మూడు చిత్రాలు సైరా, ఆచార్య, గాడ్ ఫాదర్ ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయాయి. అందుకే వాల్తేరు వీరయ్య మీద ప్రత్యేక అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టే దర్శకుడు బాబీ ఒక అభిమానిగా తీశానని పదే […]
మెగాస్టార్ చిరంజీవి కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. గోవాలో జరిగిన అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో ఇండియన్ పర్సనాలిటీ అఫ్ ది ఇయర్ 2022 పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సత్కరించడం అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్, బిగ్ బి అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండ్స్ అందుకున్న ఈ గౌరవాన్ని ఆలస్యంగా అయినా సరే చిరుకి ఇవ్వడం మంచి పనే. నలభై ఏళ్ళకు పైగా నట ప్రస్థానంలో నూటా యాభైకి పైగా సినిమాల్లో నటించి […]
గరికపాటి, చిరంజీవ మధ్య నెలకొన్న వివాదం గురించి తెలిసిందే. తాజాగా గరికపాటిపై ఓ వేదికపై చిరు వేసిన సెటైర్లు.. వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, గరికపాటి నరసింహా రావు మధ్య నెలకొన్న వివాదం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఇటీవలే ప్రముఖ అవధాని, ఉపన్యాసకుడు అయిన గరికపాటి చిరంజీవిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. హైదరాబాద్ లో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమానికి అతిథులుగా చిరంజీవి, గరికపాటి నరసింహా రావు హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా […]
నాలుగేళ్ల పసిబిడ్డ పై స్కూల్ లో జరిగిన అత్యాచారం, అఘాయిత్యం నన్ను బాగా కలచివేసింది.. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ట్వీట్ సారాంశం.. ఆటవిక సంస్కృతి నుండి ఆనవాళ్లు మోసుకొస్తున్న కొందరు మృగాళ్ల వికృత చేష్టలకు కఠినాతి కఠినమైన శిక్షలు వేగవంతంగా విధించడమే కాకుండా, ప్రభుత్వాలు అన్ని విద్యాసంస్థల్లో సి.సి. టీవీ కెమెరాల ఏర్పాట్లకు యుద్ధప్రాతిపదికన తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. భావితరాలకు భరోసా కల్పించడం మనందరి సమిష్టి బాధ్యతగా భావిస్తున్నాను.. మీ చిరంజీవి
నూటా యాభైకి పైగా సినిమాల సుదీర్ఘ ప్రస్థానంలో చిరంజీవి చూడని ఎత్తుపల్లాలు హిట్లు ఫ్లాపులు లేకపోయినా ఆచార్య ప్రభావమో మరో కారణమో చెప్పలేం కానీ మొత్తానికి గాడ్ ఫాదర్ మీద ముందు నుంచి ఉండాల్సిన స్థాయిలో హైప్ లేదన్నది వాస్తవం. దానికి తోడు నిర్మాణ సంస్థ నిదానంగా చేసిన ప్రమోషన్లు ఫ్యాన్స్ ని ఇబ్బంది పెట్టగా, మలయాళం లూసిఫర్ రీమేకనే ప్రచారం దీనికి మేలు కంటే చెడే చేసిందన్న మాట వాస్తవం. ఇన్నేసి విభిన్న అంచనాల మధ్య […]
రెండు నెలల క్రితమే లీకైనప్పటికీ మళ్ళీ ఉంటుందో లేదో అనే అనుమానాల మధ్య వాల్తేర్ వీరయ్యలో రవితేజ క్యారెక్టర్ కన్ఫర్మ్ అయ్యింది. ఈ మేరకు అఫీషియల్ గా మాస్ రాజా సెట్ లోకి వచ్చి క్యారవాన్ లో ఉన్న చిరంజీవికి షేక్ హ్యాండ్ ఇచ్చి లోపలి వెళ్లే వీడియోని ఇందాక విడుదల చేశారు. బాబీ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ మాస్ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందిన గాడ్ ఫాదర్ విజయదశమి విడుదలకు రెడీ అవుతోంది. మొన్న వచ్చిన టీజర్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. మలయాళం బ్లాక్ బస్టర్ లూసిఫర్ రీమేక్ గా రూపొందిన ఈ పొలిటికల్ డ్రామాలో సత్యదేవ్, నయనతార భార్యభర్తలుగా నటిస్తుండగా సునీల్, పూరి జగన్నాధ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆచార్య దారుణంగా డిజాస్టర్ కావడంతో మెగా ఫ్యాన్స్ బాగా నిరాశలో ఉన్నారు.ఆ గాయాన్ని మాన్పాల్సింది గాడ్ […]
భారీ అంచనాలతో బాలీవుడ్ నుంచి రాబోతున్న ప్యాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర. హిందీతో పాటు తెలుగు తమిళ మలయాళం కన్నడ ఇలా ఇతర భాషల్లోనూ భారీ ఎత్తున సెప్టెంబర్ 9న విడుదల చేయబోతున్నారు. ఇటీవలే నిజ జీవితంలో భార్యాభర్తలైన రన్బీర్ కపూర్, అలియా భట్ లు హీరో హీరోయిన్లు కావడం దీనికి ప్రధాన ఆకర్షణ. అమితాబ్ బచ్చన్ తో పాటు అక్కినేని నాగార్జున ఇందులో కీలక పాత్రలు పోషించారు. తెలుగు వెర్షన్ కి ప్రత్యేకంగా మెగాస్టార్ చిరంజీవితో […]