iDreamPost
android-app
ios-app

Megastar Chiranjeevi: చిరంజీవిగారితో మళ్ళీ మరో హిట్‌ ఇస్తా: డైరెక్టర్ బాబీ

  • Published Jan 10, 2024 | 7:32 PM Updated Updated Jan 10, 2024 | 7:40 PM

వాల్తేర్ వీరయ్య 365 రోజుల సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్భంగా ఒక స్పెషల్ మెసేజ్ ని విడుదల చేశారు.

వాల్తేర్ వీరయ్య 365 రోజుల సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్భంగా ఒక స్పెషల్ మెసేజ్ ని విడుదల చేశారు.

  • Published Jan 10, 2024 | 7:32 PMUpdated Jan 10, 2024 | 7:40 PM
Megastar Chiranjeevi: చిరంజీవిగారితో మళ్ళీ మరో హిట్‌ ఇస్తా: డైరెక్టర్ బాబీ

అభిమానిగా మాత్రమే కొనసాగుతూ, దర్శకత్వశాఖలో అపారమైన అనుభవాన్ని, అవగాహనని సాధించిన దర్శకుడు బాబీ, తన అభిమాన కథానాయకుడు మెగాస్టార్‌  చిరంజీవితో చేసిన వాల్తేర్‌ వీరయ్య గత ఏడాది జనవరి 13న ప్రపంచమంతా విడుదలై, ప్రపంచమంత సంచలనం సృష్టించింది. రికార్డులను తిరగరాసింది. మెగాస్టామినాను మరోసారి రుచి చూపించిన చిత్రంగా దర్శకుడు బాబీ జీవితంలో ఓ చిరస్మరణీయమైన అధ్యాయంగా నిలిచి వెలిగింది. విడుదలైన మూడు రోజులకే ప్రపంచవ్యాప్తంగా 108 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేసి, మెగాస్టార్‌కి తిరుగులేదని ఢంకా బజాయించి మరీ చాటి చెప్పింది. ఇదిలా ఉండగా, మొత్తం వసూళ్లు చూసుకుంటే కళ్ళు తిరిగేలా రూ.236 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన సినిమాగా, ప్రేక్షకలోకంపైన చిరంజీవి చెరగని సంతకంగా వాల్తేర్‌ వీరయ్య ఏకంగా ఓ సరికొత్త అధ్యాయాన్నే నెలకొల్పింది.

గత సంవత్సరం సంక్రాంతి మొదలుకొని ఈ సంవత్సరం సంక్రాంతి వరకూ కూడా నిరాఘాటంగా ఏపీలోని అవనిగడ్డ రామకృష్ణా థియేటర్‌లో వరుసగా రోజుకు నాలుగు షోలతో కొనసాగి ఇటీవలి రోజుల్లో ఓ వినూత్నమైన రికార్డుకు నాంది పలికింది వాల్తేర్‌ వీరయ్య. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మెగాస్టార్‌ చిరంజీవి ఓ వాయిస్‌ నోట్‌ విడుదల చేయడం విశేషం. వాల్తేర్‌ వీరయ్య ఇంతటి ఘనవిజయం సాధించడానికి కారణాలు దర్శకుడు బాబీ, సంగీత దర్శకుడు డీఎస్పీ, రచయిత కోన వెంకట్‌లతో పాటుగా తన తమ్ముడు రవితేజ, చిత్రనిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్.. వీరేనని చిరంజీవి తెలియజేయడం కేవలం ఆయన ఉన్నత సంస్కారానికి నిదర్శనం.

అవనిగడ్డ రామకృష్ణా థియేటర్‌లో ఏడాదిపాటు నిర్విరామంగా వాల్తేర్‌ వీరయ్య కొనసాగడం సందర్భంగా మెగా అభిమానులు నిర్వహించిన ఉత్సవ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు బాబీ ఎనలేని ఆనందాన్ని వ్యక్తం చేశారు. అబిమానిగా తన అభిమాన కథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవితో సినిమాని డైరెక్ట్‌ చేయడం జీవితంలో మరచిపోలేని ఓ మధురాతి మధురమైన ఘట్టంగా అభివర్ణించారు. త్వరలో చిరంజీవితో మళ్లీ సినిమా చేసి మరో హిట్ ఇస్తానని అభిమానులకు బాబీ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వాల్తేర్ వీరయ్య చిత్రాన్ని రచనను అందించిన ప్రముఖ రచయిత కోన వెంకట్‌ మాట్లాడుతూ తామందరం చిరంజీవిని అభిమానించే ఓ టీంగా ఆయనకు హిట్‌ ఇవ్వాలనే ఒకే ఒక్క దృష్టితో, సంకల్పంతో పని చేశామని, అందరి పట్టుదల, దీక్షే వాల్తేర్‌ వీరయ్య సినిమా అంతటి సంచలన విజయం సాదించడానికి ప్రధానమైన కారణమని అన్నారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet