iDreamPost
android-app
ios-app

VIDEO: షారుక్ పాటకు చరణ్​తో కలసి స్టెప్పులేసిన చిరు.. గ్రేస్ తగ్గలేదు!

  • Author singhj Published - 08:56 PM, Tue - 14 November 23

కింగ్ ఖాన్ షారుక్ నటించిన రీసెంట్​ హిట్ మూవీలోని ఒక పాటకు మెగాస్టార్ చిరంజీవి స్టెప్స్ వేశారు. కుమారుడు రామ్ చరణ్​తో కలసి చిరు డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

కింగ్ ఖాన్ షారుక్ నటించిన రీసెంట్​ హిట్ మూవీలోని ఒక పాటకు మెగాస్టార్ చిరంజీవి స్టెప్స్ వేశారు. కుమారుడు రామ్ చరణ్​తో కలసి చిరు డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

  • Author singhj Published - 08:56 PM, Tue - 14 November 23
VIDEO: షారుక్ పాటకు చరణ్​తో కలసి స్టెప్పులేసిన చిరు.. గ్రేస్ తగ్గలేదు!

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో డ్యాన్స్ అనగానే అందరికీ మొదటగా గుర్తుకొచ్చే పేరు మెగాస్టార్ చిరంజీవిదే. అంతగా డ్యాన్సులతో పేరు తెచ్చుకున్నారాయన. చిరు సినిమాల్లో సాంగ్స్, డ్యాన్సులు లేవంటే ఆయన ఫ్యాన్సే కాదు మామూలు ఆడియెన్స్ కూడా ఒప్పుకోరంటే అతిశయోక్తి కాదు. తెలుగు సినిమాల్లో డ్యాన్సులకు క్రేజ్ తీసుకొచ్చింది మెగాస్టార్. ఆయన స్టెప్ వేస్తే అప్పట్లో యువత ఊగిపోయేవారు. చిరులా డ్యాన్సులు ప్రాక్టీస్ చేస్తూ ఇళ్లలో పిల్లలు చేసే సందడి అంతా ఇంతా కాదు. ఏడు పదుల వయసుకు దగ్గరగా ఉన్నా ఇప్పటికీ చిరంజీవి డ్యాన్సుల్లో తగ్గేదేలే అంటున్నారు. రీఎంట్రీలో వచ్చిన సినిమాల్లో హుషారుగా స్పెప్స్ వేస్తూ ఇప్పటి హీరోలకు ఛాలెంజ్ విసురుతున్నారు మెగాస్టార్.

ఈ మధ్య కాలంలో ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చిరంజీవి వేసిన స్టెప్స్ బాగా పాపులర్ అయ్యాయి. రవితేజతో కలసి ఆ మూవీలో ఆయన చేసిన సందడిని ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు. తన ఏజ్​తో సంబంధం లేకుండా ఫుల్ ఎనర్జీతో ఆ ఫిల్మ్​లో ఆయన చేసిన ఫైట్లు, డ్యాన్సులు సూపర్ అనే చెప్పాలి. ఫైట్లు, డ్యాన్సులకు తోడు నటనలో ఇరగదీసిన మెగాస్టార్.. ‘వాల్తేరు వీరయ్య’తో బిగ్ హిట్​ను తన అకౌంట్​లో వేసుకున్నారు. అయితే ఈ చిత్రం తర్వాత ‘భోళా శంకర్’ రూపంలో భారీ ప్లాప్​ను ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. మెగాస్టార్ కెరీర్​లో వసూళ్లలో తీవ్రంగా నిరాశపర్చిన సినిమాల్లో ఒకటిగా ‘భోళా’ నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన షాక్​ నుంచి బయటపడిన చిరంజీవి మళ్లీ స్పీడ్ పెంచారు.

నెక్స్ట్ మూవీ కోసం ‘బింబిసార’ లాంటి సూపర్ హిట్​ను తీసిన దర్శకుడు వశిష్టకు ఛాన్స్ ఇచ్చారు మెగాస్టార్. వీళ్లిద్దరి అరుదైన కాంబోలో వస్తున్న సినిమానే ‘మెగా 156’. ప్రస్తుతానికి ఇదే వర్కింగ్ టైటిల్​తో సినిమాను తీస్తున్నారు. చిరు 156వ మూవీకి టైటిల్‌ ఇంకా ఫిక్స్ కాలేదు. ఫాంటసీ ఫిల్మ్​గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘విశ్వంభర’ అనే టైటిల్​ను ఖరారు చేశారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దైవ, మానవ, పాతాళలోకాల్లో ఒక చిన్న పాప చుట్టూ తిరిగే స్టోరీతో ఈ మూవీని వశిష్ట తీస్తున్నట్లు ఫిల్మ్​ నగర్​ టాక్. ఈ ప్రతిష్టాత్మక సినిమాలో హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటిని విలన్​గా సెలెక్ట్ చేశారని సమాచారం. చిరు పక్కన హీరోయిన్లుగా అనుష్క శెట్టి, మృణాల్ ఠాకూర్ పేర్లు వినిపిస్తున్నాయి.

చిరంజీవి-వశిష్ట కలయికలో వస్తున్న సినిమాను 2025 సంక్రాంతి బరిలో దింపేందుకు ప్రొడ్యూసర్ సన్నాహాలు చేస్తున్నారట. ఈ మూవీకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి ఒక సాంగ్​ను కూడా రికార్డింగ్ చేశారని అంటున్నారు. ఇదిలా ఉంటే.. మెగాస్టార్ ఇంట్లో దీపావళి పండుగను పురస్కరించుకొని ఓ పార్టీని ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు, హీరోయిన్లు తమ ఫ్యామిలీతో కలసి అటెండ్ అయ్యారు. అయితే ఈ ఈవెంట్​లో భాగంగా కింగ్ ఖాన్ షారుక్ నటించిన ‘జవాన్’ సినిమాలోని టైటిల్ ట్రాక్​ను సింగర్ పాడారు. దీనికి తనయుడు రామ్ చరణ్​తో కలసి చిరంజీవి స్టెప్స్ వేయడం విశేషం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసిన నెటిజన్స్ మెగాస్టార్​లో ఏమాత్రం గ్రేస్ తగ్గలేదని అంటున్నారు. మరి.. చిరు డ్యాన్స్ వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఈ కమెడియన్ చావు అంచుల దాకా వెళ్లి వచ్చాడని తెలుసా..?

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet