iDreamPost
android-app
ios-app

2025 థియేటర్లలో మాస్ జాతరే.. రిలీజ్ కాబోయో చిత్రాలు ఇవే!

  • Published Jan 16, 2024 | 8:19 PM Updated Updated Jan 16, 2024 | 8:44 PM

2025 Tollywood Movies List: 2024 టాలీవుడ్ లో బిగ్గెస్ట్ చిత్రాలు అయితే క్యూ కట్టాయి. వాటికంటే కూడా 2025 లిస్ట్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

2025 Tollywood Movies List: 2024 టాలీవుడ్ లో బిగ్గెస్ట్ చిత్రాలు అయితే క్యూ కట్టాయి. వాటికంటే కూడా 2025 లిస్ట్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

  • Published Jan 16, 2024 | 8:19 PMUpdated Jan 16, 2024 | 8:44 PM
2025 థియేటర్లలో మాస్ జాతరే.. రిలీజ్ కాబోయో చిత్రాలు ఇవే!

టాలీవుడ్ సినిమాలకు ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియన్ సినిమా అంటే గతంలో బాలీవుడ్ అనేవాళ్లు. కానీ, ప్రస్తుతం ఇండియన్ సినిమా అనగానే టాలీవుడ్ అనే పరిస్థితి వచ్చేసింది. తెలుగు ఇండస్ట్రీ నుంచి సినిమా వస్తోంది అంటే దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంటోంది. మన సినిమాలు నార్త్ లో కూడా అద్బుతంగా రాణించడమే కాకుండా.. కలెక్షెన్స్ వర్షం కురిపిస్తూ ఉంటాయి. 2024లో కూడా ఆ లెక్క ఏమాత్రం మారదనే చెప్పాలి. అంతేకాకుండా ఆ స్ట్రీక్ 2025లో కూడా కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతానికి 2025కి సంబంధించిన రిలీజెస్ మినీ లిస్ట్ ఒకటి వచ్చింది. అందులో బ్లాక్ బస్టర్ మూవీస్ సీక్వెల్స్ కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం.

ప్రస్తుతానికి టాలీవుడ్ నుంచి 2025లో విడుదల కానున్న మూవీస్ లిస్ట్ చూస్తే.. మెగాస్టార్ చిరు చిత్రం ఆసక్తి రేపుతోంది. చిరంజీవి కెరీర్ లో 156వ చిత్రంగా విశ్వంభర తెరకెక్కుతోంది. బింభిసార వంటి బ్లాక్ బస్టర్ అందించిన వశిష్ట ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతి కానుగా టైటిల్ రిలీజ్ చేస్తూ ఒక కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఆ వీడియో చూస్తే చిత్రం మాత్రం సోషియో ఫాంటసీ చిత్రమని అర్థమైపోతోంది. ఇప్పటికే ఇలాంటి కాన్సెప్ట్ ని హ్యాండిల్ చేయగలనని వశిష్ఠ బింభిసారతో ప్రూవ్ చేసుకున్నాడు. ఇలాంటి పాత్రల్లో ఏ స్థాయిలో నటిస్తారో మెగాస్టార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కాబట్టే ఈ మూవీపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. 2025లో టాలీవుడ్ లోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ సరికొత్త రికార్డులు బద్దలు కొడుతుందని ఇప్పటి నుంచే అంచనాలు వేస్తున్నారు.

నెక్ట్స్ సినిమా చూస్తే.. బోయపాటి- బాలయ్య కాంబోలోో బ్లాక్ బస్టర్ గా నిలిచిన అఖండ 2 సినిమా 2025లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి. అఖండలో బాలయ్య అఘోరగా కనిపించి మెప్పించారు. ముఖ్యంగా బోయపాటి డైరెక్షన్ లో బాలయ్య చేసే మాస్ జాతర గురించి అందరికీ తెలిసిందే. ఈ మూవీ తెలుగులో ఎంత హిట్టో అందరికీ తెలిసిందే. శివుడు, అఘోరా కాన్సెప్ట్ కాబట్టి నార్త్ ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ కథను రెడీ చేసి పనిలో బోయపాటి ఉన్నాడు. ఇప్పటికే ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అఖండ కథ ఎక్కడ ముగిసిందో.. సీక్వెల్ అక్కడి నుంచే ప్రారంభం అవుతుందని బోయపాటి వెల్లడించారు. ఈ నేపథ్యంలో అఖండ్ 2పై మరింతగా అంచనాలు పెరిగిపోయాయి.

అలాగే మరో రెండు చిత్రాలు కూడా ఉన్నాయి. శతమానం భవతి చిత్రం టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్ ని రెడీ చేస్తున్నారు. వచ్చే సంక్రాంతి బరిలో నిలుస్తామని అధికారికంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే సంక్రాంతి బరిలో నిలిచే సినిమాల గురించి చర్చ మొదలైపోయింది. మరో చిత్రం ఏదంటే.. బంగ్గార్రాజు ఫ్రాంచైజ్ నుంచి ఒక చిత్రం రాబోతోంది. సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు తర్వాత బంగార్రాజు-3 రాబోతోంది. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఇందులో అఖిల్ అక్కినేని ఉండే అవకాశంపై చర్చలు జరగుతున్నాయి. తాతా, తండ్రి, కొడుకు అంటూ నాగార్జున, నాగచైతన్య నటించారు. ఇప్పుడు ఈ జనరేషన్స్ చిత్రంలో అఖిల్ అక్కినేని కూడా భాగం కాబోతున్నాడు అనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతానికి 2025 రిలీజ్ లిస్ట్ అయితే ఇలా ఉంది.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş