iDreamPost
android-app
ios-app

Nani: నానికి అగ్నిపరీక్ష.. మెగాస్టారే స్ఫూర్తిగా దాటేయాలి!

  • Published Sep 01, 2024 | 11:08 AM Updated Updated Sep 01, 2024 | 11:08 AM

Nani, Saripodhaa Sanivaaram Movie, Megastar Chiranjeevi: న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నారు. అయితే అతడికి ధైర్యం ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన స్ఫూర్తిగా చెలరేగితే నాని ఈ పరీక్షను దాటేయడం ఖాయం.

Nani, Saripodhaa Sanivaaram Movie, Megastar Chiranjeevi: న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నారు. అయితే అతడికి ధైర్యం ఇస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన స్ఫూర్తిగా చెలరేగితే నాని ఈ పరీక్షను దాటేయడం ఖాయం.

  • Published Sep 01, 2024 | 11:08 AMUpdated Sep 01, 2024 | 11:08 AM
Nani: నానికి అగ్నిపరీక్ష.. మెగాస్టారే స్ఫూర్తిగా దాటేయాలి!

విభిన్నమైన సినిమాలతో ఆడియెన్స్​కు థ్రిల్లింగ్ ఎక్స్​పీరియెన్స్ ఇస్తుంటారు న్యాచురల్ స్టార్ నాని. వైవిధ్యమైన కథలను ఎంపిక చేసుకొని ప్రతి చిత్రాన్ని డిఫరెంట్​గా ఉండేలా చూసుకుంటారు. భిన్నమైన కథలకు సహజత్వం ఒట్టిపడే నటనతో ప్రాణం పోసే ఈ స్టార్ నుంచి ఇటీవలే కొత్త మూవీ వచ్చింది. ఆయన యాక్ట్ చేసిన ‘సరిపోదా శనివారం’ గురువారం బిగ్ స్క్రీన్స్​లో రిలీజ్ అయింది. మార్నింగ్ షో నుంచే పాజిటిట్ టాక్ తెచ్చుకుందీ ఫిల్మ్. నాని, ఎస్​జే సూర్య యాక్టింగ్​కు అంతా ఫిదా అవుతున్నారు. తొలి ఆట నుంచే వసూళ్లలో దుమ్మురేపుతోందీ మూవీ. ఈ సినిమా సక్సెస్​తో జోష్​లో ఉన్న న్యాచురల్ స్టార్​ ఇప్పుడు అగ్నిపరీక్షను ఎదుర్కొంటున్నారు. అయితే భయపడాల్సిందేమీ లేదు. మెగాస్టార్ చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుంటే చాలు.. ఈ సవాల్​ను ఆయన దాటేయడం ఖాయం. ఇంతకీ నాని ఫేస్ చేస్తున్న ఆ ఛాలెంజ్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం..

‘సరిపోదా శనివారం’ బాక్సాఫీస్ వద్ద సక్సెస్​ఫుల్​గా రన్ అవుతోంది. లాంగ్ వీకెండ్ ఉండటం, మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకు లాంగ్ రన్ పక్కా అని అంతా అనుకుంటున్నారు. అయితే సరిగ్గా ఈ సమయంలోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు మొదలయ్యాయి. ఏకధాటిన వానలు కురుస్తున్నాయి. దీంతో ‘సరిపోదా శనివారం’ కలెక్షన్స్​పై ప్రభావం పడుతుందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. అయితే ఈ గండాన్ని దాటాలంటే మెగాస్టార్​ను నాని ఇన్​స్పిరేషన్​గా తీసుకుంటే చాలని ఎక్స్​పర్ట్స్ సూచిస్తున్నారు. అప్పట్లో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా రిలీజ్ టైమ్​లో జోరుగా వానలు పడ్డాయి. రెయిన్ ఎఫెక్ట్​ మూవీపై ఉంటుందని, కలెక్షన్ల మీద భారీగా దెబ్బపడుతుందని అంతా అనుకున్నారు. ఇక సినిమా పనైపోయిందని ఆశలు వదిలేసుకున్నారు. కానీ జోరువానల్లో వసూళ్ల వరద సృష్టించింది మెగాస్టార్ మూవీ.

తుఫాన్​ ఉధృతిని దాటి మెగా సక్సెస్ సాధించింది ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ మూవీ. ఇప్పుడు న్యాచురల్ స్టార్ నాని కూడా దాదాపుగా ఇదే సిచ్యువేషన్​ను ఫేస్ చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న ఆయన కొత్త చిత్రం ‘సరిపోదా శనివారం’కు వాన ముప్పు పొంచి ఉంది. వర్షాలు ఏకధాటిగా కురుస్తుండటంతో ఆ సినిమా కలెక్షన్స్​పై ప్రభావం పడే అవకాశం ఉందని అంటున్నారు. అయితే ఎక్స్​పర్ట్స్ మాత్రం మెగాస్టార్​లాగే నాని కూడా ఈ అగ్నిపరీక్షను అలవోకగా దాటుతాడని అంటున్నారు. ఆల్రెడీ మౌత్ పబ్లిసిటీ, పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి వసూళ్లకు ఢోకా ఉండదని చెబుతున్నారు. చిత్రాన్ని మరింత ప్రమోట్ చేస్తే బెటర్ అని.. రీచ్ మరింత పెరగడానికి హెల్ప్ అవుతుందని సూచిస్తున్నారు. బ్రేక్ ఈవెన్ టార్గెట్​కు దగ్గరవుతున్న ‘సరిపోదా శనివారం’.. వరుణుడి పరీక్షను దాటితే మెమరబుల్​ సూపర్​ హిట్​గా నిలిచిపోతుందని చెబుతున్నారు. మరి.. అప్పుడు మెగాస్టార్​లాగే ఇప్పుడు న్యాచురల్ స్టార్ రెయిన్ టెస్ట్​లో పాస్ అవుతారా? మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.