iDreamPost
android-app
ios-app

Chiranjeevi: చిరంజీవిని కలిసి గిఫ్ట్‌ ఇచ్చిన టీమిండియా క్రికెటర్‌!

  • Published Jan 29, 2024 | 5:38 PM Updated Updated Jan 29, 2024 | 5:44 PM

మెగాస్టార్​ చిరంజీవిని ఓ టీమిండియా క్రికెటర్ కలిశాడు. అంతేగాక చిరుకు అతడు ఓ గిఫ్ట్​ కూడా ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మెగాస్టార్​ చిరంజీవిని ఓ టీమిండియా క్రికెటర్ కలిశాడు. అంతేగాక చిరుకు అతడు ఓ గిఫ్ట్​ కూడా ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

  • Published Jan 29, 2024 | 5:38 PMUpdated Jan 29, 2024 | 5:44 PM
Chiranjeevi: చిరంజీవిని కలిసి గిఫ్ట్‌ ఇచ్చిన టీమిండియా క్రికెటర్‌!

మెగాస్టార్ చిరంజీవి సాధించని ఘనత లేదు.. అందుకోని రికార్డు లేదు. ఎన్నో బ్లాక్​బస్టర్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన ఆయన.. తన యాక్టింగ్​తో కోట్లాది మంది ప్రజలకు చేరువయ్యారు. అద్భుతమైన నటనతో పాటు మానవతా దృక్పథంతో చేస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా అభిమానులతో పాటు సామాన్య ప్రజానీకానికి కూడా ఆయన దార్శనికుడు అయ్యారు. ఫిల్మ్ ఇండస్ట్రీకే కాదు ప్రజలకు ఏ కష్టాలు వచ్చినా ఆయన నిలబడతారు. వరదలు, తుఫానులు లాంటి ప్రకృతి వైపరీత్యాలతో పాటు కరోనా లాంటి మహమ్మారి భయపెట్టినప్పుడు కూడా ఆయన తనవంతు సాయం అందించారు. అలాంటి మెగాస్టార్​ ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. అయితే ఇటీవలే ఆయన దేశంలోని రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్​కు ఎంపికయ్యారు. దీంతో ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఓ టీమిండియా స్టార్ కూడా ఆయన్ను కలిసి విషెస్ తెలిపారు.

సినీ ప్రముఖులతో పాటు రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా చిరంజీవిని కలిసి అభినందిస్తున్నారు. చిరు ఇంటికెళ్లి మరీ ఆయనకు విషెస్ చెబుతున్నారు. తాజాగా భారత జట్టు వికెట్ కీపర్, తెలుగు తేజం కేఎస్ భరత్ మెగాస్టార్​ను కలిశాడు. సోమవారం చిరు ఇంటికెళ్లిన భరత్ ఆయనకు విషెస్ చెప్పాడు. అలాగే తన టెస్ట్ జెర్సీని టాలీవుడ్ స్టార్​కు గిఫ్ట్​గా అందించి అభినందనలు తెలిపాడు. చిరును భరత్ కలసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంగ్లండ్​తో ఆడిన మొదటి టెస్ట్​ హైదరాబాద్​లోనే జరగడంతో ఈ మ్యాచ్ తర్వాత చిరును భరత్ వెళ్లి కలిశాడు. ఇక, ఇంగ్లీష్ టీమ్​తో ఫస్ట్ టెస్ట్​లో రోహిత్ సేన ఓడిపోయింది. కానీ ఈ మ్యాచ్​లో తొలి ఇన్నింగ్స్​లో 41 పరుగులు చేసిన భరత్.. రెండో ఇన్నింగ్స్​లోనూ 28 రన్స్​తో ఫర్వాలేదనిపించాడు. అతడు గనుక చివరి వరకు ఉండి గెలిపించి ఉంటే హీరోగా నిలిచేవాడు. రెండో టెస్ట్​లో అతడు బ్యాట్​తో మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి.