iDreamPost
android-app
ios-app

విశ్వంభరపై హైప్ పెంచేస్తున్న డైరెక్టర్ వశిష్ఠ.. చిరు కెరీర్లో టాప్ 3లో అంటూ..

  • Published Jan 16, 2024 | 9:51 PM Updated Updated Jan 16, 2024 | 9:51 PM

Vasishta On Vishwambhara Movie: మెగా 156 చిత్రం టైటిల్ విశ్వంభరగా ఫిక్స్ చేశారు. ఈ మూవీపై డైరెక్టర్ వశిష్ఠ అంచనాలు పెంచేస్తున్నారు.

Vasishta On Vishwambhara Movie: మెగా 156 చిత్రం టైటిల్ విశ్వంభరగా ఫిక్స్ చేశారు. ఈ మూవీపై డైరెక్టర్ వశిష్ఠ అంచనాలు పెంచేస్తున్నారు.

  • Published Jan 16, 2024 | 9:51 PMUpdated Jan 16, 2024 | 9:51 PM
విశ్వంభరపై హైప్ పెంచేస్తున్న డైరెక్టర్ వశిష్ఠ.. చిరు కెరీర్లో టాప్ 3లో అంటూ..

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి రేంజ్, క్రేజ్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకానొక సమయంలో ఇండియన్ సినిమాలో ‘బిగ్గర్ ద్యాన్ బిగ్ బీ’ అంటూ బిరుదును అందుకున్నారు. అలాంటి మెగాస్టార్ తో ఒక్క ఫొటో దిగినా చాలు అని చాలామంది అభిమానలు అనుకుంటారు. ఇంక సినిమా అంటే అది ఆలోచించడం కూడా కష్టమే. కానీ, ఒకే ఒక్క సినిమా చేసిన అనుభవంతో ఈ డైరెక్టర్ ఏకంగా మెగాస్టార్ చిరుని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. అతను మరెవరో కాదు.. బింభిసార డైరెక్టర వశిష్ఠ. ఐడ్రీమ్ మీడియాకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో మూవీ గురించి చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ మాటలు వింటే మెగా ఫ్యాన్స్ కు రోమాలు నిక్కబొడుచుకుంటాయి.. పూనకాలు కూడా వచ్చేస్తాయి.

మెగాస్టార్ తో సినిమా చేసే అవకాశం దక్కడంపై డైరెక్టర్ వశిష్ఠ ఆందం వ్యక్తం చేశాడు. అలాగే రామ్ చరణ్, తాను క్లాస్ మేట్స్ అనే విషయాన్ని వెల్లడించాడు. అలాగే శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీకి అప్రెంటిస్ గా కూడా పని చేసిన పరిచయం ఉందని చెప్పాడు. ఇలా మెగాస్టార్ కి కథ చెప్పడం పెద్ద కష్టంగా అనిపించలేదని చెప్పాడు. అలాగే వశిష్ఠకు బింభిసార అనేది మెగా ప్రాజెక్టు అందుకోవడానికి మార్గాన్ని మరింత సులభతరం చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మెగాస్టార్ తో సినిమా అనౌన్స్ చేసిన తర్వాత వశిష్ఠ ఇచ్చిన తొలి ఇంటర్వ్యూ ఇదే కావడం విశేషం. ఈ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో మూవీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. అలాగే వశిష్ఠ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశాడు.

“విశ్వంభర అనేది ఒక చిన్న ఎంటర్ టైన్మెంట్ తో స్టార్ట్ అయ్యి డిఫరెంట్ ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆ తర్వాత అంతా ఎమోషనల్ గా సాగుతుంది. ఈ మూవీ మొత్తం మరో ప్రపంచంలో ఉన్నట్లు ఉంటుంది. ఈ సినిమా కోసం భారీగా సెట్స్ వేశాం. అంతా ఎంతో డిఫరెంట్ గా ఉంటుంది. డిస్నీ వరల్డ్ తరహాలో ప్రేక్షకులను మరో ప్రచానికి తీసుకెళ్తాం. ఈ సినిమా చాలా పెద్ద కాన్సెప్ట్. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటుంది. ఈ సినిమా గురించి ఒక అంచనాకి రావాలి అంటే మెగాస్టార్ చిరంజీవి గారి కెరీర్ లో టాప్ 10 చిత్రాలు ఉంటే.. అందులో టాప్ 3లో ఈ సినిమా ఉంటుంది. ఆ స్థాయిలో ఈ మూవీ గురించి మాట్లాడుకోవాలి, మాట్లాడుకుంటారు కూడా” అంటూ వశిష్ఠ విశ్వంభర సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

డైరెక్టర్ వశిష్ఠ కామెంట్స్ విన్న తర్వాత మెగా ఫ్యాన్స్ లో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మెగాస్టార్ కెరీర్ లో 156వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. టైటిల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా ఒక కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో చూస్తే ఈ మూవీపై ఓ క్లారిటీ అయితే వస్తుంది. ఈ సోషియో ఫాంటసీ చిత్రంపై ఇప్పటికే ఉన్న అంచనాలు డైరెక్టర్ వశిష్ఠ చేసిన వ్యాఖ్యలతో మరో స్థాయికి చేరాయి. మరి.. విశ్వంభర మెగాస్టార్ కెరీర్ లో టాప్ 3లో ఉంటుందని చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantHoliganbetHoliganbetHoliganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss