iDreamPost
android-app
ios-app

హనుమాన్ ప్రమోషన్స్ లో చిరు స్టెప్స్..! సినిమాలో కూడా ఉన్నాడా?

  • Published Jan 02, 2024 | 10:10 PM Updated Updated Jan 02, 2024 | 10:10 PM

హనుమాన్ చిత్రంలో హనుమంతుడి పాత్రలో చిరంజీవి ఉన్నారంటూ వస్తున్న టాక్ కు మరింత ఊతమిచ్చేలా చిత్ర యూనిట్ చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా మూవీ బృందం చిరు పాటకు స్టెప్స్ వేశారు. దీంతో సినిమాలో చిరు ఉన్నారా అంటూ చర్చ మొదలైంది.

హనుమాన్ చిత్రంలో హనుమంతుడి పాత్రలో చిరంజీవి ఉన్నారంటూ వస్తున్న టాక్ కు మరింత ఊతమిచ్చేలా చిత్ర యూనిట్ చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా మూవీ బృందం చిరు పాటకు స్టెప్స్ వేశారు. దీంతో సినిమాలో చిరు ఉన్నారా అంటూ చర్చ మొదలైంది.

  • Published Jan 02, 2024 | 10:10 PMUpdated Jan 02, 2024 | 10:10 PM
హనుమాన్ ప్రమోషన్స్ లో చిరు స్టెప్స్..! సినిమాలో కూడా ఉన్నాడా?

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన తాజా చిత్రం హనుమాన్. తేజ సజ్జ హీరోగా చేసిన ఈ సినిమా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్, టీజర్లకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. దీంతో హనుమాన్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. జనవరి 12న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది. తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమాలో హనుమాన్ పాత్రపై ఓ వార్త సోషల్ మీడియాలో తెగ హల్ చేస్తోంది. హనుమాన్ చిత్రంలో టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి హనుమంతుడిగా కనిపించనున్నారని టాక్ వినిపిస్తోంది.

కాగా హనుమాన్ చిత్రంలో చిరంజీవి హనుమంతుడిగా కనిపించనున్నారనే విషయంపై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న సందర్బంగా ప్రశాంత్ వర్మ యాంకర్ అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చిరంజీవి హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నారనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. అయితే తాజాగా మూవీ టీమ్ ప్రమోషన్స్ ప్రారంభించింది. దీనిలో భాగంగా చిత్ర యూనిట్ ప్రముఖ యంకర్ సుమ చేస్తున్న సుమ అడ్డ షోకి డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జ, హీరోయిన్, గెటప్ శ్రీను షోలో పాల్గొన్నారు. అయితే తాజాగా విడుదలైన సుమ అడ్డ ప్రోమోలో చిత్ర యూనిట్ మెగాస్టార్ చిరు పాటకు స్టెప్స్ వేశారు. ఇంద్ర సినిమాలోని పాటకు వీణ స్టెప్పులతో అదరగొట్టారు. దీంతో హనుమాన్ సినిమాలో చిరంజీవి ఉన్నారంటూ మరోసారి హింట్ ఇచ్చారని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.

Hanuman

దీనికి గల కారణం చిరంజీవికి ఆంజనేయ స్వామి భక్తుడు. హనుమంతుడు అంటే ఎంతో అభిమానం. గతంలో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో కొంచెంసేపు హనుమంతుడిగా కనిపించాడు. అలాగే హనుమాన్ అనే బాలాల సినిమాకి హనుమంతుడి మీద వాయిస్ ఓవర్ ని కూడా ఇచ్చారు. అందుకే ఇప్పుడు ఈ సినిమాలో హనుమంతుడి వేషాధారణలో చిరు కనిపించబోతున్నారని మెగా ఫ్యాన్స్ హంగామ చేస్తున్నారు. కాగా, ఈ విషయం పై అటూ చిరు కానీ, ఇటు మూవీ మేకర్స్ కానీ ఎటువంటి సమాచారం అధికారికంగా వెల్లడించ లేదు. మరి దీనిలో నిజమెంతో తెలియాలంటే సినిమా విడుదలయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet