iDreamPost
android-app
ios-app

‘ఫ్యామిలీ మ్యాన్’ ముందు చిరంజీవిదేనట! ఎలా మిస్ అయ్యిందో తెలుసా?

  • Author ajaykrishna Updated - 01:09 PM, Wed - 30 August 23
  • Author ajaykrishna Updated - 01:09 PM, Wed - 30 August 23
‘ఫ్యామిలీ మ్యాన్’ ముందు చిరంజీవిదేనట! ఎలా మిస్ అయ్యిందో తెలుసా?

ఇండస్ట్రీలో కొన్నిసార్లు కొన్ని కథలు అనుకోకుండా ఒక హీరో నుండి ఇంకో వద్దకు వెళ్తుంటాయి. అలా ఒకరికి వినిపించిన కథ.. మరో హీరోని చేరడానికి చాలా కారణాలు ఉంటాయి. మొదటి హీరో రిజెక్ట్ చేసి ఉండొచ్చు.. కథ నచ్చినా డేట్స్ సెట్ అవ్వకపోవచ్చు.. లేదా హీరో చెప్పిన చేంజెస్ నచ్చక కూడా కథ వేరే హీరోని చేరవచ్చు. ఇలా ఏది జరిగినా.. ఒక కథ ముందు అనుకున్న హీరోతో కాకుండా వేరే వాళ్ళతో ఎలాగైనా తెరపైకి వస్తుంది. ఆ కథ ప్లాప్ అయితే వేరు.. కానీ, బ్లాక్ బస్టర్ అయితే.. ముందు మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసుకోవాలని అనిపిస్తుంది. ఆ విషయం కూడా మేకర్స్ చెబితేనో లేక ముందు కథ విన్నవారిలో ఎవరైనా బయటపెడితే తెలుస్తుంది.

ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి సంబంధించి అలాంటి ఓ విషయం బయటికి వచ్చింది. అదేంటంటే.. ఇండియాలో ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ లలో ‘ఫ్యామిలీ మ్యాన్’ ఎప్పుడూ టాప్ లోనే ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ని మన తెలుగు వారైనా డైరెక్టర్స్ రాజ్, డీకే తెరకెక్కించారు. ఫస్ట్ సీజన్ సక్సెస్ తో సెకండ్ సీజన్ ని మరింత గ్రాండ్ గా ప్లాన్ చేసి తీశారు. ఓవైపు సినీ కెరీర్ అలా అలా సాగుతున్న టైమ్ లో నటుడు మనోజ్ బాజపేయ్.. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో ఒక్కసారిగా మోస్ట్ వాంటెడ్ అయిపోయాడు. ఈ సిరీస్ తర్వాత మనోజ్ బాలీవుడ్ లో చాలా బిజీ అయిపోయాడు. అయితే.. ఈ సిరీస్ కి, మెగాస్టార్ కి లింక్ ఏంటి అనుకుంటున్నారా.. ఆ వివరాల్లోకి వెళ్దాం.

ఫ్యామిలీ మ్యాన్ కథను ముందుగా సినిమా తీయాలని అనుకున్నారట డైరెక్టర్స్ రాజ్, డీకే. స్టోరీ స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకొని.. నిర్మాత అశ్వినిదత్ ని కలిసి సబ్జెక్టు వినిపించారట. ఆ స్క్రిప్ట్ విపరీతంగా నచ్చడంతో.. వెంటనే కథను చిరంజీవికి వినిపించడం జరిగిందట. అప్పటికి ఖైదీ నెం.150 మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న చిరు.. స్టోరీ బాగుంది కానీ ఇద్దరు పిల్లల తండ్రిగా, అందులోనూ భార్య క్యారెక్టర్ అలా ఉంది.. ఆడియన్స్ తనని ఈ స్టోరీలో యాక్సెప్ట్ చేయకపోవచ్చు అన్నారట. లేదంటే కొంచం మారుద్దాం అని కొన్ని మార్పులు సూచించారట. అలా ఇన్ని సందేహాలు, అభిప్రాయాల మధ్య ఫ్యామిలీ మ్యాన్.. కార్యరూపం దాల్చలేకపోయిందని.. నిర్మాత అశ్వినిదత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు సమాచారం. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో చెప్పక్కర్లేదు. ఒకవేళ చిరంజీవి చేసుంటే ఎలా ఉండేదో గానీ.. ఖచ్చితంగా మెగా ఫ్యాన్స్ కి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే కలిగేది. ఇప్పటికైనా చిరు ప్రయోగాలు చేస్తారేమో చూడాలి. మరి ఫ్యామిలీ మ్యాన్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Giriş