Nagendra Kumar
మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సారి అభిమానులు వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు.ఏదైనా జరిగితే గనక అది సామాజికంగా గుర్తింపు పొందాలి, అది పదిమందికి ఉపయోగపడాలనే అవుట్ లుక్కున్న హీరో రామ్ చరణ్.
మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సారి అభిమానులు వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు.ఏదైనా జరిగితే గనక అది సామాజికంగా గుర్తింపు పొందాలి, అది పదిమందికి ఉపయోగపడాలనే అవుట్ లుక్కున్న హీరో రామ్ చరణ్.
Nagendra Kumar
మార్చి 27న రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈ సారి అభిమానులు వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. సాధారణంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు జరుగుతుంటాయి. కటౌట్లకి పాలాభిషేకాలు వంటి హంగామాలను రామ్ చరణ్ ఎప్పుడూ ఎంకరేజ్ చేయలేదు. ఏదైనా జరిగితే గనక అది సామాజికంగా గుర్తింపు పొందాలి, అది పదిమందికి ఉపయోగపడాలనే అవుట్ లుక్కున్న హీరో రామ్ చరణ్.
అయితే ఈ సారి అన్నిటికీ విభిన్నంగా పుట్టినరోజు వేడుకలను జరుపుకోవాలని అభిమానులు పిలుపునిచ్చారు. అదేంటంటే….అందరికీ తెలిసిన విషయమే. మెగాస్టార్ కుటుంబం మొత్తం రామభక్త హనుమాన్లువారి మహాభక్తులు. మొన్నీ మధ్యన హనుమాన్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో కూడా మెగాస్టార్ హనుమంతులవారికి తనకూ ఉన్న అనుబంధం గురించి చాలా శ్రద్ధగా చెప్పుకున్నారు. నిజంగా ఆయన మాటలు విన్నవారు వెంటనే హనుమంతులవారి మహిమలకి భక్తులయిపోతారు. చిరంజీవి అనేపేరే ఆయనకు భగవానుడు కలలోకి వచ్చి చెప్పారన్నది మునుపు మెగాస్టార్ వివరించిన సంగతి అందరికీ తెలిసిందే. దేవుళ్ళలో హనుమంతులవారు మెగాగాడ్ అయితే, హీరోల్లో ఆయన పేరు పెట్టుకుని చిరంజీవి మెగాస్టార్ అయ్యారు. రామ్ చరణ్ అన్నపేరు కూడా హనుమంతులవారిదే. మద్రాసులో పోరూర్ సుందరం స్ట్రీట్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఇంటి పేరు కూడా రామ్ చరణ్ నివాస్. ఇక్కడ హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని మెగాస్టార్ ఇంటికి వెళ్తే ప్రధాన ద్వారం నుంచి లోపల ప్రతీ చోట అయితే హనుమంతులవారి విగ్రహాలు చిన్నవీ పెద్దవీ ప్రత్యక్షమవుతాయి. లేదా ఆయన వర్ణచిత్రాలు దర్శనమిస్తాయి. పవన్ కళ్యాణ్ లోని పవన్ కూడా హనుమంతులవారి నామావళిలోనేదే.
ఇలా అడుగడుగునా హనుమంతులవారితో అనుబంధాన్ని పెనవేసుకున్న మెగా కుటుంబం ప్రతినిధి రామ్ చరణ్ కూడా ఆయన పరమవీర భక్తుడే. అందుకే ఈ సారి రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా హనుమాన్ చాలీసా పఠనాన్ని ప్రపంచవ్యాప్త అభిమానులందరూ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వారు సోషల్ మీడియా వేదికగా అందరికీ ఈ విషయాన్ని షేర్ చేస్తున్నారు. అబిమానుల పిలుపుకి పెద్ద ఎత్తున స్పందన వస్తోందని, ఇది చాలా అనందాన్నిస్తోందని అఖిలభారత చిరంజీవి యువత నిర్వాహకుడు రవణం స్వామినాయుడు తెలిపారు. ఇటీవలే అయోధ్యలో రాములవారి విగ్రహప్రాణప్రతిష్ట కార్యక్రమానికి కూడా మెగా దంపతులతో పాటు రామ్ చరణ్ కూడా ప్రధాని అహ్వానం మేరకు వెళ్ళిని సంగతి తెలిసిందే. సనాతన ధర్మాన్ని ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమ నిర్వహణ ద్వారానే రక్షించుకోగలుగుతామని ఆయన చెప్పారు.