iDreamPost
android-app
ios-app

Vishwambhara: ‘విశ్వంభర’లో త్రిష స్పెషల్ ట్రీట్!

  • Published Mar 10, 2024 | 2:12 PM Updated Updated Mar 10, 2024 | 2:12 PM

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ హీరోయిన్ త్రిష చాన్నాళ్ల తర్వాత కలసి నటిస్తున్నారు. ‘విశ్వంభర’లో వీళ్లిద్దరూ జంటగా యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో త్రిష నుంచి స్పెషల్ ట్రీట్ ఉండనుందని తెలుస్తోంది.

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ హీరోయిన్ త్రిష చాన్నాళ్ల తర్వాత కలసి నటిస్తున్నారు. ‘విశ్వంభర’లో వీళ్లిద్దరూ జంటగా యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీలో త్రిష నుంచి స్పెషల్ ట్రీట్ ఉండనుందని తెలుస్తోంది.

  • Published Mar 10, 2024 | 2:12 PMUpdated Mar 10, 2024 | 2:12 PM
Vishwambhara: ‘విశ్వంభర’లో త్రిష స్పెషల్ ట్రీట్!

మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట మల్లిడి కాంబినేషన్ లో వస్తున్న తొలి చిత్రం ‘విశ్వంభర’. ప్రస్తుతం ఈ బిగ్ బడ్జెట్ ఫాంటసీ ప్రాజెక్ట్ షూటింగ్ హైదరాబాద్ శివార్లలో జరుగుతోంది. ఇలాంటి జానర్ లో మెగాస్టార్ సినిమా చేయడం ఇదే తొలిసారి. కాబట్టి ఇప్పటికే ‘విశ్వంభర’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా, ఈ సినిమాకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. ‘విశ్వంభర’లో హీరోయిన్ గా నటిస్తున్న త్రిష కృష్ణన్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీని మీద చిత్ర నిర్మాతల నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. చిరంజీవితో పాటు ఇతర నటీనటులతో కలిసి త్రిష ఈ రోజు సెట్స్ లో జాయిన్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి త్రిష డబుల్ యాక్షన్ అనేది కేవలం రూమర్ అయినప్పటికీ త్రిష ఫ్యాన్స్ మాత్రం తమ అభిమాన తారను రెండు పాత్రల్లో చూడవచ్చని తెగ సంతోష పడిపోతున్నారు. సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో సురభి, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా, ఆశ్రిత వేముగంటి నండూరి తదితరులు ముఖ్యపాత్రలు పోషించనున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందిస్తున్న ఈ ఫిల్మ్ 2025 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

నిజానికి త్రిష-చిరంజీవి ఇది వరకే ‘స్టాలిన్’ సినిమాలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొరటాల శివ కాంబినేషన్​లో వచ్చిన ‘ఆచార్య’లో త్రిష నటించాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ‘విశ్వంభర’లో కలిసి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా కథ గురించి ఆసక్తికరమైన వార్తలు వస్తుండగా.. ఇప్పుడు త్రిష ద్విపాత్రాభినయం చేయనున్నారనే టాక్ ‘విశ్వంభర’పై మరిన్ని అంచనాలు పెంచడం ఖాయమనే చెప్పాలి. మరి.. త్రిష డ్యూయల్ రోల్​లో కనిపిస్తే చూడాలని అనుకుంటున్నారా? మీ ఒపీనియన్​ను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సైతాన్: మరోసారి ఆకట్టుకున్న మాధవన్

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom