iDreamPost
android-app
ios-app

విశ్వంభర సినిమాకి కీలకంగా మారిన గ్రాఫిక్స్

  • Published Feb 05, 2024 | 6:04 PM Updated Updated Feb 05, 2024 | 6:04 PM

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా విశ్వంభర. అయితే ఈ సినిమాకు నాణ్యమైన వీఎఫ్ఎక్స్ తో ప్రపంచ స్థాయి విజువల్స్ అందించే సవాలును ఈ బృందం ఎదుర్కొంటోంది. అదేలా అంటే..

మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా విశ్వంభర. అయితే ఈ సినిమాకు నాణ్యమైన వీఎఫ్ఎక్స్ తో ప్రపంచ స్థాయి విజువల్స్ అందించే సవాలును ఈ బృందం ఎదుర్కొంటోంది. అదేలా అంటే..

  • Published Feb 05, 2024 | 6:04 PMUpdated Feb 05, 2024 | 6:04 PM
విశ్వంభర సినిమాకి కీలకంగా మారిన గ్రాఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే భారీ సినిమాకు పని చేస్తున్న సంగతి తెలిసిందే. మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా యొక్క టైటిల్ టీజర్ ఇటీవలే విడుదలై ఉత్సాహపరిచింది. హైదరాబాద్ లో 13 భారీ సెట్స్ తో ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. కాగా, ఇటీవలే చిరంజీవి షూటింగ్ లో జాయిన్ అయ్యారు. అంతే కాకుండా ఫిట్ గా ఉండడం కోసం క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నారు. బింబిసార దర్శకుడు మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్న విశ్వంభర భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఇది చిరంజీవి కెరీర్ లోనే అత్యంత ఖరీదైన చిత్రం అవడం మరో విశేషం. 2025 సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల చేస్తామని నిర్మాతలు ఇటీవలే ప్రకటించారు.

2025 జనవరిలో విడుదల చేయాలనే లక్ష్యంతో టైట్ షెడ్యూల్లో నాణ్యమైన వీఎఫ్ఎక్స్ తో ప్రపంచ స్థాయి విజువల్స్ అందించే సవాలును ఈ బృందం ఎదుర్కొంటోంది. వీఎఫ్ఎక్స్ ఎక్కువ అవసరం ఉంటే ఆ సన్నివేశాల్లో నాణ్యత కోసం కాస్త ఎక్కువ సమయమే పడుతుంది. ఈ మధ్య ఎన్టీఆర్ దేవర విషయంలో ఇలానే వీఎఫ్ఎక్స్ వల్ల అనుకోని జాప్యం జరగడం మనం చూశాం. అయితే వశిష్ట గత చిత్రం బింబిసారలో చూసినట్లుగా అసాధారణ విజువల్స్ కు ప్రాధాన్యమిచ్చి తగినంత సమయం తీసుకుంటారా లేక విఎఫ్ ఎక్స్ తో రాజీ పడతారా అనేదే అందరిలోనూ ఉన్న ప్రశ్న.

అయితే సినిమా మేకింగ్ లో ఎంతటి కష్టం వచ్చినా 2025 జనవరి 10నే సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వారి నమ్మకం చూసి ఈ ఎపిక్ ఫాంటసీ అడ్వెంచర్ పై అంచనాలు మరింత పెరిగాయి. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రం, విశ్వంభర యొక్క ఓవర్సీస్ రైట్స్ చిరంజీవి కెరీర్ లోనే రికార్డ్ ధరకు అమ్ముడయ్యాయి. ఈ సినిమాకి ఏం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. కాగా ఈరోజే హీరోయిన్ త్రిష సెట్స్ లోకి అడుగు పెట్టారు.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet