P Venkatesh
తెలుగు సినిమా ఇండస్ట్రీ అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి హనుమాన్ సినిమాలో హనుమంతుడుగా కనిపిస్తున్నాడనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఇందులో నిజమెంత?
తెలుగు సినిమా ఇండస్ట్రీ అగ్రకథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి హనుమాన్ సినిమాలో హనుమంతుడుగా కనిపిస్తున్నాడనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. ఇందులో నిజమెంత?
P Venkatesh
యంగ్ హీరో తేజ సజ్జ గురించి అందరికి తెలిసిందే. ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన ఇతను నేడు సోలో హీరోగా ఎదిగాడు. ఈ క్రమంలోనే టాలివుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘జాంబీరెడ్డి’ సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా.. తన అద్భుతమైన నటనతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక సినిమాల పరంగా మంచి కంటెంట్ ఉన్న కథలను మాత్రమే ఎంపిక చేసుకుంటున్నాడు. తాజాగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ మరోసారి సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ సినిమా ‘హనుమాన్’. అయితే.. పాన్ ఇండియా ప్రాజెక్టుగా తెరకెక్కబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12న భారీ అంచనాలతో విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..
దేశవ్యాప్తంగా విడుదల అవుతున్న హనుమాన్ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాకి సంబధించి హనుమాన్ పాత్రపై ఓ ఆసక్తికరమైన వార్త ట్రెండ్ అవుతోంది. అదేమిటంటే.. ఈ హనుమాన్ సినిమాలో మెగస్టార్ చిరంజీవి హనుమంతుడుగా కనిపిస్తున్నాడనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. అందుకు కారణం చిరంజీవికి ఆంజనేయ స్వామి అంటే ఎంతో అభిమానం. గతంలో జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాలో కొంచెంసేపు హనుమంతుడిగా కనిపించాడు.
అలాగే హనుమాన్ అనే బాలాల సినిమాకి హనుమంతుడి మీద వాయిస్ ఓవర్ ని కూడా ఇచ్చారు. అందుకే ఇప్పుడు ఈ సినిమాలో హనుమంతుడి వేషాధారణలో చిరు కనిపించబోతున్నారని మెగా ఫ్యాన్స్ హంగామ చేస్తున్నారు. కాగా, ఈ విషయం పై అటూ చిరు కానీ, ఇటు మూవీ మేకర్స్ కానీ ఎటువంటి సమాచారం అధికారికంగా వెల్లడించ లేదు. దీని బట్టి చిరు హనుమంతుడి పాత్ర చేస్తున్నారనడంలో వాస్తవం లేదు. చాలామంది ఇది ఒక పుకారు మాత్రమే అంటున్నారు.
ఇటీవలే హనుమాన్ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో విజువల్స్ మామూలుగా లేవు. ముఖ్యంగా ట్రైలర్ ప్రారంభంలోనే ”యతో దర్శస్తతో హనుమాన్, యతో హనుమాన్ తతో జయహ’.. అనే బేస్ వాయిస్ అయితే ఆద్భుతంగా ఉంటుంది. ఇక ఎండింగ్ లో ఆంజనేయ స్వామి ఎంట్రీ షాట్ ఓ రేంజ్ లో ఉంది. అందులో హనుమంతుడు కళ్ళు తెరిచే సన్నివేశం చూస్తే ఒక్కసారిగా ఒళ్ళు గగుర్పాటు పుట్టించేలా ఉంటుంది. కాగా, దర్శకుడు ప్రశాంత్ వర్మ మాత్రం ఈ సినిమాలో హనుమంతుడిగా ఎవరు చేశారనేది సస్పెన్స్ గా ఉంచారు. మరి, హనుమాన్ సినిమాలో చిరంజీవి హనుమంతుడుగా కనిపించబోతున్నరనే వార్త పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.