ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరోసారి భేటీ అయ్యారు. ఇందుకోసం ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ లోని ప్రగతి భవన్కు వచ్చారు. ఈ సందర్భంగా జగన్ కు కేసీఆర్ పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు. జగన్ వెంట వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, ఎంపి మిదున్ రెడ్డి, వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. తాజా రాజకీయ అంశాలతోపాటు, విభజన సమస్యలు, గోదావరి జలాల తరలింపు వంటి అంశాలపై వీరిద్దరూ చర్చించినట్టు […]