Dharani
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించారు. ఆ వివరాలు..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించారు. ఆ వివరాలు..
Dharani
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. రెండు రోజుల క్రితం ఫామ్ హౌజ్ లో జారి పడిన సంగతి తెలిసిందే. దాంతో ఆయనను సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడే ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఆదివారం మధ్యాహ్నం కేసీఆర్ ను పరమార్శించారు. సోమాజీగూడ యశోద ఆస్పత్రికి వెళ్లి.. కేసీఆర్ ను పలకరించారు. కేటీఆర్ ను కలిసి.. కేసీఆర్ కు అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు. ఫామ్ హౌజ్ లో జారిపడ్డ కేసీఆర్ కు.. యశోద ఆస్పత్రిలో తుంటి మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ యశోద ఆస్పత్రికి చేరుకున్నారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఆస్పత్రికి వచ్చారు. ఆయనతో పాటు మంత్రులు సీతక్క, షబ్బీర్ అలీ కూడా యశోద ఆస్పత్రికి వెళ్లారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. తెలంగాణ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫాంహౌస్ కి వెళ్లారు. అక్కడే ఆయన జారి పడ్డారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చేరిన కేసీఆర్ కు.. శుక్రవారం నాడు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో 20 మంది వైద్యుల టీమ్ తుంటి మార్పిడి సర్జరీ చేశారు. ఆ ఆపరేషన్ సక్సెస్ అయిందని వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.
కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ బులెటిన్‌ను సోమాజీగూడలోని యశోద ఆస్పత్రి డాక్టర్లు కూడా విడుదల చేశారు. మల్టీ డిసిప్లినరీ డాక్టర్ల బృందం కేసీఆర్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. అంతర్జాతీయ అంబులేషన్ మార్గదర్శకాల ప్రకారం హిప్ రీప్లేస్ సర్జరీ చేసుకున్న వ్యక్తిని 12గంటల లోపు నడిపించాలని.. దానిలో భాగంగానే వైద్యులు శనివారం నాడు కేసీఆర్ ని కాసేపు నడిపించారు. ఆర్థోపెడిక్ సర్జన్ ఫిజియోథెరపీ బృందం పర్యవేక్షణలో కేసీఆర్ వాకర్ పట్టుకుని నడిచారు. ఇక కేసీఆర్ 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారు. కేసీఆర్ ను నడిపిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అలానే చినజీయర్ స్వామి కూడా ఆస్పత్రికి వచ్చి కేసీఆర్ ను పరామర్శించారు.
#TelanganaCm #RevanthReddy reached #Yashodahospital to know the health condition of ExCm #Kcr..Minister #seethakka and Shabirali were along with #Revanthreddy..#Telangana#Revanthreddy#Kcr pic.twitter.com/2MikJegEnS
— SHRA.1 JOURNALIST✍ (@shravanreporter) December 10, 2023
CM Revanth Reddy accompanied by KTR visits BRS Chief KCR at Yashoda hospital pic.twitter.com/8rKeZUpPJH
— Naveena (@TheNaveena) December 10, 2023