Dharani
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. నేడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. నేడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..
Dharani
తెలంగాణ ఎన్నికల్లో ముచ్చటగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావించిన బీఆర్ఎస్ పార్టీకి ఓటర్లు భారీ షాక్ ఇచ్చారు. 39 సీట్లకే పరిమితం చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది. తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా నేడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు ఎల్బీ స్టేడియంలో రేవంత్ తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రంలో ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడనేలేదు.. అప్పుడే దాన్ని కూలగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా స్టేషన్ ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు చూస్తే ఇది నిజమే అనిపిస్తుంది. ఏడాదిలోగా గులాబీ పార్టీ అధికారంలోకి వస్తుందని లెక్కలతో సహా చెప్పారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన మరుసటి రోజే.. ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేయగా.. తాజాగా మరోసారి అదే విధంగా వ్యాఖ్యానించారు కడియం. బీఆర్‌ఎస్ కార్యకర్తలంతా ఏడాది వరకు ఓపిక పట్టాలని.. ఆ తర్వాత తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. జనగామ మండలం యశ్వంతాపూర్‌లోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి సంతాప సభలో మాట్లాడుతూ కడియం ఈ వ్యాఖ్యలు చేశారు. పైగా లెక్కలతో సహా వివరించారు.
ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ సింహం రెండడుగులు వెనక్కి వేసిందంటే లక్ష్యాన్ని గురి చేసుకొని లంఘించటానికే అన్నారు. కేసీఆర్ కూడా అలాగే తిరిగి వస్తారని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఏడాదిలోగా కేసీఆర్ తిరిగి వస్తారని.. కొన్ని లెక్కల్ని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీకి 39 సీట్లు ఉన్నాయని.. మిత్రపక్షమైన ఎంఐఎంకు 7 సీట్లు వచ్చాయని.. అలానే కాంగ్రెస్ పార్టీపై బీజేపీ వ్యతిరేకంగా ఉంది.. కాబట్టి వాటితో కలిపితే మొత్తం 56 సీట్లు అవుతాయి. మరికొంత మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం కష్టమేమీ కాదంటూ కడియం సంచలన వ్యాఖ్యలు చేశారు.
అంతేకాక కాంగ్రెస్ పార్టీకి అవస్థలు తప్పవని.. ఆ పార్టీ ఉసిరికాయల మూట వంటిదన్నారు కడియం. ఆ మూట విప్పితే ఏ ఉసిరికాయ ఎటు ఉరుకుతుందో తెలియదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి సెటైర్లు పేల్చారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అందరం సమష్టిగా ఉంటామన్నారు. ఏడాది వరకు ఓపిక పడితే పరిణామాలు ఎలా ఉంటాయో చూస్తారన్నారు. సింహం తిరిగి వస్తుంది.. బీఆర్ఎస్‌కు మంచి రోజులు వస్తాయన్నారు. ఎవరూ ఆందోళన చెందవద్దని.. ప్రతిపక్షంలో ఉన్నందున తగాదాలు కొని తెచ్చుకోవద్దని కార్యకర్తలకు సూచించారు.
పార్టీ అధికారంలోకి రాలేదని ఎవరూ భయపడనవసరం లేదని, ఆరు నెలలా.. సంవత్సరమా, రెండేళ్లా, మూడేళ్లా.. ‘మళ్లీ ప్రభుత్వం మనదే.. మన ముఖ్యమంత్రి కేసీఆరేనని’ వ్యాఖ్యానించారు కడియం. కాంగ్రెస్ పార్టీకి బొటాబొటి మెజారిటీ వచ్చిందని, దానిని కాపాడుకుంటారా.. లేదా.. అన్నది చూడాలన్నారు కడియం శ్రీహరి. ఆయన చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. మరి కాంగ్రెస్ నేతలు కడియం వ్యాఖ్యలు నిజం చేస్తారా.. లేదంటే కలిసి కట్టుగా ఉండి ఐదేళ్ల పాటు అధికారంలో కొనసాగుతారా చూడాలి అంటున్నారు జనాలు. మరి కడియం చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజయండి.