Dharani
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. నేడు హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరమార్శించారు. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. నేడు హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరమార్శించారు. ఆ వివరాలు..
Dharani
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు అనగా గురువారం నాడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు. కొన్ని రోజుల క్రితం అనగా.. డిసెంబర్ 7వ తేదీన ఎర్రవెల్లిలోని తన ఫాం హౌజ్‌లో కిందపడడంతో కేసీఆర్ తుంటి ఎముకకు గాయమైన విషయం తెలిసిందే. దాంతో వైద్యులు ఆయనకు హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేశారు. సుమారు వారం రోజుల పాటు కేసీఆర్ హాస్పిట్‌లో ఉన్న తర్వాత హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న ఆయన నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఏపీ సీఎం జగన్.. కేసీఆర్ ను పరామర్శించడం కోసం ఆయన ఇంటికి వచ్చారు. కేసీఆర్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
సీఎం జగన్ వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు.. ఆయనకు స్వాగతం పలికారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చారు. ఉదయం 10.30 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.15 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో ఉన్న కేసీఆర్ ఇంటికి వెళ్లారు. కేసీఆర్ ఇంట్లో జగన్ లంచ్ చేయనున్నారని సమాచారం. వీరిద్దరు గంటపాటు సమావేశం కానున్నారని తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ రావడం ఇదే తొలిసారి. ఇక కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇరు రాష్ట్రాల సీఎంల మధ్య మంచి సంబంధాలే ఉండేవి. ఇక తాజాగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలిచి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జగన్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి.. ఇరు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలని ఆకాంక్షించారు. ఇందుకు రేవంత్ రెడ్డి రిప్లై ఇస్తూ.. ఆయన కూడా అదే కోరుకున్నారు. వీరిద్దరి ట్వీట్లు కూడా తెగ వైరల్ అయ్యాయి. ఇక ప్రస్తుతం కేసీఆర్ నందినగర్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. లోక్ సభ ఎన్నికల నాటికి కోలుకుని.. తిరిగి రాజకీయాల్లో యాక్టీవ్ కానున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
మాజీ సీఎం కేసీఆర్‌ను తన నివాసంలో పరామర్శించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ pic.twitter.com/BKSNS2eteV
— Telugu Scribe (@TeluguScribe) January 4, 2024