iDreamPost
android-app
ios-app

40 సీట్లు వచ్చినా తమదే అధికారం అంటున్న BRS నేతలు.. వారి ధీమా ఇదేనా..

  • Published Dec 03, 2023 | 8:58 AM Updated Updated Dec 03, 2023 | 8:58 AM

TS Elections 2023 Results:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో తేలనున్నాయి. గెలుపుపై అన్నీ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో పోలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. 40 సీట్లు వచ్చినా కారు పార్టీదే అధికారం అంటున్నారు. ఆ వివరాలు..

TS Elections 2023 Results:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరి కొన్ని గంటల్లో తేలనున్నాయి. గెలుపుపై అన్నీ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో పోలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. 40 సీట్లు వచ్చినా కారు పార్టీదే అధికారం అంటున్నారు. ఆ వివరాలు..

  • Published Dec 03, 2023 | 8:58 AMUpdated Dec 03, 2023 | 8:58 AM
40 సీట్లు వచ్చినా తమదే అధికారం అంటున్న BRS నేతలు.. వారి ధీమా ఇదేనా..

తెలంగాణలో మరికొద్ది గంటల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవనున్నాయి. ఇప్పిటికే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కిస్తున్నారు. ఈసారి రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది అనే దాని మీద తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది. ఇలా ఉండగా.. ఎగ్జిట్ పోల్స్ అన్ని ఈసారి కాంగ్రెస్ పార్టీనే అధికారం చేపట్టనుందని చెబుతున్నాయి. కానీ కారు పార్టీ నేతలు మాత్రం.. ముచ్చటగా మూడోసారి కూడా తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో అధికారంలోకి రావాలంటే.. మ్యాజిక్ ఫిగర్ 60 సీట్లు కాగా.. చాలా వరకు ఎగ్జిట్ పోల్స్.. బీఆర్ఎస్‌కు 30 నుంచి 40 సీట్లే వస్తాయని పేర్కొనటం గమనార్హం. అయినా సరే తమదే అధికారం అంటున్నారు గులాబీ పార్టీ నేతలు.  మరి 40 సీట్లు మాత్రమే వస్తే.. బీఆర్ఎస్ అధికారం ఎలా చేపట్టనుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే.. ఇదే అంశంపై రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు..

ఈసారి కేవలం 40 సీట్లు వస్తే చాలు.. బీఆర్ఎస్ సర్కార్ వస్తుందని కేసీఆర్ ధీమాతో ఉన్నారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అందుకు గల కారణాలను కూడా వివరిస్తున్నారు. 40 సీట్లు వస్తే.. మిగతా వారిని ఇతర పార్టీల నుంచి కలుపుకోవచ్చినే ధైర్యంతో ఉన్నారని.. ఒక్క బీఆర్ఎస్ మాత్రమే కాదని.. మిగతా అన్ని పార్టీలు కూడా ఇదే తరహా ఆలోచనలో ఉన్నాయని అంటున్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే.. 60 సీట్లు అవసరం ఉండగా.. బీఆర్ఎస్‌కు 40 సీట్లొస్తే కూడా అధికారం చేపట్టే ఛాన్స్ ఉందన్నది పలువురి విశ్లేషణ.

బీఆర్ఎస్ స్ట్రాటజీ ఇదే..

బీఆర్ఎస్‌కు 40 సీట్లు వస్తే.. ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 20 సీట్లు అవసరం ఉంటుంది. అందులో.. బీఆర్ఎస్ మిత్రపక్షమైన ఎంఐఎం ఎలాగూ 6 సీట్లు గెలుస్తుంది.. అలానే వారు కారుకు మద్దతిస్తారు. దాంతో ఎంఐఎం సీట్లు.. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో చేరిపోనున్నాయి. దీంతో.. కారు పార్టీ స్థానాల సంఖ్య 46కు చేరుతుంది. అలానే ఈ ఎన్నికల్లో బీజేపీకి 8 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. వారు ఎలాను కాంగ్రెస్ కు మద్దతివ్వరు వారిని కూడా కలుపుకుంటే 54 అవుతాయి.

ఇక.. కామ్రేడ్లు కూడా ఒక సీటు గెలిచే అవకాశం ఉండగా.. దాన్ని కూడా గులాబీ పార్టీ కలుపుకునే ఛాన్స్ ఉంది. ఇక మిగిలింది 5 సీట్లే. కాంగ్రెస్ పార్టీలో అటూ ఇటూగా ఉన్న ఆ ఐదుగురిని కూడా కారులో ఎక్కిస్తే.. అధికారం చేపట్టటం ఖాయమే అన్న విశ్లేషణ చేస్తున్నారు కొందరు. మరి ఈసారి స్పష్టమైన అధిక్యం వస్తుందా.. లేదా హంగ్ ఏర్పడనుందా అన్నది మరి కొన్ని గంటల్లో తేలనుంది.