iDreamPost
android-app
ios-app

KCR ఆస్పత్రి ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది.. వైద్యారోగ్య శాఖ మంత్రి కీలక ప్రకటన

  • Published Dec 15, 2023 | 9:37 AM Updated Updated Dec 15, 2023 | 9:37 AM

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రమాదవశాత్తు జారీ పడటంతో ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. నేడు ఆయనను డిశ్చార్జ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రమాదవశాత్తు జారీ పడటంతో ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. నేడు ఆయనను డిశ్చార్జ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైద్యారోగ్య శాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..

  • Published Dec 15, 2023 | 9:37 AMUpdated Dec 15, 2023 | 9:37 AM
KCR ఆస్పత్రి ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది.. వైద్యారోగ్య శాఖ మంత్రి కీలక ప్రకటన

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌ రావు.. కొన్ని రోజుల క్రితం ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో కాలు జారి కింద పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన కు సోమాజీగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.  కింద పడటంతో ఆయనకు సర్జరీ చేశారు. ఈ కారణంగా గత ఎనిమిది రోజులుగా కేసీఆర్‌ ఆస్పత్రిలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనను పరామర్శించారు. జనాలు కూడా పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు తరలి వస్తుండటంతో.. వారిని రావద్దని కోరారు.
అంతేకాక ప్రస్తుతం కేసీఆర్‌ ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు వైద్యులు. కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంనే నేడు అనగా శుక్రవారం నాడు.. కేసీఆర్ డిశ్ఛార్జ్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో.. కేసీఆర్‌ ఆస్పత్రి ఖర్చులపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..
The government will bear all the expenses of KCR Hospital
ఈ సందర్భంగా దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ.. కేసీఆర్‌కు వైద్య ఖర్చులన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే చెల్లిస్తుందని  పేర్కొన్నారు. గురువారం రోజున అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠిలో ముచ్చటించిన ఆయన.. కేసీఆర్ అనారోగ్యం పాలవడం దురదృష్టకరమంటూ సానుభూతి వ్యక్తం చేశారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక అధికారిని కూడా నియమించినట్టు తెలిపారు. అంతేకాక. కేసీఆర్ చికిత్సకు సంబంధించిన బిల్లులన్ని తమ ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు రాజనర్సింహ.
కేసీఆర్‌ ప్రమాదవశాత్తు జారిపడగా.. ఆయన తుంటి ఎముకకు గాయం అయ్యింది. దాంతో వైద్యులు ఆయనకు హిప్ రిప్లేస్ మెంట్ సర్జరీ చేశారు. అయితే.. కేసీఆర్ పూర్తిగా కోలుకోవటానికి సుమారు 6 నుంచి 8 వారాలు పడుతుందని వైద్యులు తెలిపారు. కాగా.. ఆస్పత్రిలో ఉన్న ఈ ఎనిమిది రోజులు నిష్ణాతులైన వైద్యులు.. కేసీఆర్‌ను 24 గంటల పాటు జాగ్రత్తగా పర్యవేక్షించారు. కేసీఆర్ చాలా తొందరగా కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగుండటంతో.. ఈరోజు కేసీఆర్‌ను ఇంటికి పంపిస్తున్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన తర్వాత కేసీఆర్‌ నందినగర్‌లో ఉన్నవవపాత ఇంటికి వెళ్లనున్నారు.
ఇదిలా ఉంటే.. వైద్యారోగ్యశాఖలోని లాంగ్ స్టాండింగ్ ఆఫీసర్లను మార్చుతామని మంత్రి దామోదర రాజనర్సింహా తెలిపారు. వైద్యారోగ్యశాఖ ప్రక్షాళనకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వైద్యారోగ్యశాఖ ఉద్యోగులకు మేలు చేస్తూనే.. ప్రజలకు రక్షణగా నిలుస్తామన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇందులో భాగంగానే ఆరోగ్య శ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచామని పేర్కొన్నారు రాజనర్సింహా.