iDreamPost
android-app
ios-app

KCRకు భద్రత కుదిస్తూ తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కొత్త సర్కార్ ఇటీవల కీలక నిర్ణయాలు చేస్తోంది. ఐఏఏస్ బదిలీలు, కార్పొరేషన్ చైర్మన్ల పోస్టులను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. కార్పొరేషన్ చైర్మన్లకు భద్రత కూడా తొలగించింది.

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కొత్త సర్కార్ ఇటీవల కీలక నిర్ణయాలు చేస్తోంది. ఐఏఏస్ బదిలీలు, కార్పొరేషన్ చైర్మన్ల పోస్టులను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. కార్పొరేషన్ చైర్మన్లకు భద్రత కూడా తొలగించింది.

KCRకు భద్రత కుదిస్తూ తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం

తెలంగాణలో అధికారం మారింది. కాంగ్రెస్ చేతికి పగ్గాలు అందించారు తెలంగాణ ప్రజలు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు రేవంత్ రెడ్డి. ఈ క్రమంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్న సంగతి విదితమే. ప్రగతి భవన్.. ప్రజా భవన్‌గా మారింది. అలాగే ఐఏఎస్‌లు బదిలీలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ సర్కార్. కార్పొరేషన్ చైర్మన్ల పదవులు రద్దు చేస్తూ, వారికి గన్ మెన్లను తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు సెక్యూరిటీని తొలగించింది. ఈ మేరకు పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే. ఇక ఎవరికీ గన్ మెన్స్ అవసరమైన దానిపై ఇంటెలిజెన్స్ అధికారులు సమీక్షించనున్నారు. ఆ తర్వాత వారికే గన్ మెన్స్ కేటాయించే అవకాశాలున్నాయి.

తాజాగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కూడా భద్రత కుదిస్తూ డెసిషన్ తీసుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుండి దాదాపు తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగారు కేసీఆర్. రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఈయన భద్రత విషయంలో కాంగ్రెస్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేసీఆర్‌కు భద్రత కుదించింది. గతంలో కేసీఆర్‌కు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉండేది. ఇప్పుడు దీన్ని వై కేటగిరీకి తగ్గించారు. వై కేటగిరీలో ఆయనకు 4+4 గన్ మెన్లతో పాటు ఎస్కార్ట్ వాహనం అందుబాటులో ఉంటుంది. అలాగే ఇంటి ముందు సెంట్రీ ఇవ్వాలని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న మాజీ మంత్రులకు 2+2 గన్ మెన్లను కేటాయించింది.

ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల భద్రతకు సంబంధించి.. ఎవరికి అవసరమో అన్నదానిపైన పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఇంటలిజెన్స్ అధికారుల సూచనల మేరకు వారికి గన్ మెన్లను పోలీసు శాఖ కేటాయించనుంది. అలాగే ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్, రాజా సింగ్ భద్రతకు సంబంధించి..గతంలో ఏర్పాటు చేసిన భద్రతను యధావిధిగా కొనసాగిస్తోంది. ఇటీవల మాజీ సీఎం కేసీఆర్.. ఇంట్లో కాలి జారి పడిన సంగతి విదితమే. ఎడమ కాలి తుంటి విరగడంతో శస్త్ర చికిత్స అందించారు వైద్యులు. ప్రస్తుతం ఆయన గత వారం రోజుల నుండి సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించారు. కేసీఆర్‌కు భద్రత తగ్గించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.