Dharani
తెలంగాణ ఎన్నికల్లో భాగంగా పోటీ చేయబోయే అభ్యర్థులు.. తమ ఆస్తులు, అప్పుల గురించి అఫిడవిట్‌లో వెల్లడించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామికి సంబంధించి ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి. అవి ఏంటంటే..
తెలంగాణ ఎన్నికల్లో భాగంగా పోటీ చేయబోయే అభ్యర్థులు.. తమ ఆస్తులు, అప్పుల గురించి అఫిడవిట్‌లో వెల్లడించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామికి సంబంధించి ఆసక్తికర వివరాలు వెలుగులోకి వచ్చాయి. అవి ఏంటంటే..
Dharani
తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. పార్టీలన్ని గెలుపు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ప్రస్తుతం అభ్యర్థులందరూ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇక ఎన్నికల్లో భాగంగా.. బరిలో దిగిన అభ్యర్థులు.. నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం అనగా నవంబర్ 15న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఇక అభ్యర్థులు నామినేషన్ల దాఖలు పూరైన తర్వాత.. వారు సమర్పించిన అఫిడవిట్లలో ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. దీనిలో భాగంగా రాష్ట్రంలో అత్యధిక ఆస్తులు, అప్పులు, కేసులున్న నేతలు ఎవరో వెల్లడయ్యింది. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లా చెన్నూరు అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎంపీ వివేక్‌కు సంబంధించి ఆసక్తికర వివరాలు వెల్లడయ్యాయి. ఆయన వెల్లడించిన దాని ప్రకారం.. రాష్ట్రంలోనే అత్యధిక ఆస్తులున్న నేతగా వివేక్ నిలిచారు. అంతేకాక మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.
వివేక్ సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. ఆయన సీఎం కేసీఆర్‌కు రూ.కోటి అప్పు ఇచ్చినట్టుగా పేర్కొన్నారు. అదేవిధంగా రామలింగారెడ్డికి రూ.10లక్షలు, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రూ.1.50కోట్లు అప్పుగా ఇచ్చినట్లుగా వివేక్.. తన అఫిడవిట్‌లో వెల్లడించారు. ఇక తన అఫిడవిట్‌లో వెల్లడించిన దాని ప్రకారం.. వివేక్ మొత్తంగా రూ.23.99 కోట్లను వ్యక్తిగత అప్పులుగా ఇచ్చినట్లుగా పేర్కొన్నారు.
ఇక వివేక్ తనకు రూ. 600 కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఆస్తుల విషయంలో పోల్చుకుంటే.. వివేక్ రాష్ట్రంలోనే అత్యధిక ఆస్తులున్న రాజకీయ నాయకుడిగా ఉన్నారు. ఆయన సతీమణి జి.సరోజ పేరుతో రూ.377కోట్లు ఉండగా, విశాఖ కంపెనీతో సహా పలు కంపెనీలు, మీడియా సంస్థల్లో పెట్టుబడులు ఉన్నట్లు వివేక్ తన అఫిడవిట్‌లో వెల్లడించారు.
ఆస్తుల విషయంలో వివేక్ ప్రథమ స్థానంలో ఉండగా.. తర్వాత ప్లేస్‌లో పాలేరు స్థానానికి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకే చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. ఆయన తన అఫిడవిట్‌లో వెల్లడించిన దాని ప్రకారం.. రూ.460కోట్ల ఆస్తులతో.. రాష్ట్రంలో అత్యధిక ధనవంతుడైన అభ్యర్థుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్ అధినేత సీఎ కేసీఆర్ తన అఫిడవిట్‌లో తన కుటుంబ ఆస్తులు రూ.59కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. అంతేకాక ఆయన తన సొంత కారు కూడా లేదని పేర్కొన్నారు.
వివేక్ ఇచ్చిన అప్పు గురించి కేసీఆర్ కూడా తన అఫిడవిట్‌లో చెప్పుకొచ్చారు. తాను మాజీ ఎంపీ వివేక్‌కు రూ.1.06కోట్లు అప్పు ఉన్నట్లు కేసీఆర్ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు మాజీ ఎంపీ వివేక్ సీఎం కేసీఆర్‌కు మధ్య ఈ లావాదేవీలు జరిగినట్లు తెలిసింది. గతంలో టీఆర్‌ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా ఈ డబ్బులు ఇచ్చినట్లు.. పార్టీ నాయకులు అనుకుంటున్నారు.