మనుషుల్లో నేర ప్రవృత్తి రోజురోజుకు పెరిగిపోతోందని చెప్పేందుకు వరుసగా జరుగుతున్న సంఘటనలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్ లో జరిగిన మరో సంఘటన అందిరినీ షాక్ కు గురి చేసింది. ప్రేమించి పెళ్ళి చేసుకున్న రెండో భార్యని డంబెల్ తో కొట్టి, ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి డ్రమ్ములో కుక్కాడు ఓ నీచుడు. మాల్ లో పనిచేసే సరోజకు పూల అలంకరణ పని చేసే అనిల్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా […]
విదేశాల్లో చాలా వరకు మద్యం డోర్ డెలివరీ చేసే దేశాలు చాలానే ఉన్నాయి. ఇక మన దేశంలో కూడా ఢిల్లీ లాంటి కొన్ని నగరాల్లో మద్యాన్ని డోర్ డెలివరీ ఇప్పటికే చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కి చెందిన ‘బూజీ’ ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కోల్‌కతాలో పది నిమిషాల్లోనే మద్యం డోర్ డెలివరీ చేస్తామని ప్రకటించి ప్రచారం చేస్తుంది. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ఎక్సైజ్ శాఖ నుంచి అనుమతులు తీసుకున్న ఈ సంస్థ కోల్‌కతాలో […]
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో మహిళా వర్సిటీని స్థాపించగా దాని కార్యకలాపాలన్నీ కోఠి ఉమెన్స్ కాలేజీ నుంచే చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంగణాన్ని మహిళా వర్సిటీగా మార్చి తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయంగా నామకరణం చేశారు. ఈ విషయాన్ని కోఠి మహిళా కళాశాల ప్రిన్సిపల్ ప్రొ.విజ్జులత తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. 98 సంవత్సరాలుగా ఓయూకు అనుబంధంగా సాగిన, ఎంతో చరిత్ర కలిగిన కోఠి మహిళా కాలేజీ ఈ విద్యా సంవత్సరం (2022–23) నుండి తెలంగాణ మహిళా యూనివర్సిటీ(TMU)గా మారనుంది. […]
నిరుద్యోగులకు ఉద్యోగం ఆశ చూపించి వారి దగ్గర సాఫ్ట్ వేర్ జాబ్ అంటూ డబ్బులు తీసుకొని రెండు నెలలు మంచిగా మెయింటైన్ చేసినట్లు నటించి సడెన్ గా రాత్రికి రాత్రే బోర్డు తిప్పేసింది ఓ సాఫ్ట్ వేర్ సంస్థ. హైదరాబాద్ మాదాపూర్‌లో ఇన్నోహబ్ టెక్నాలజీస్ అనే సంస్థ సాఫ్ట్వేర్ జాబ్ పేరిట ఒక్కో నిరుద్యోగి నుంచి 2 లక్షల వరకు వసూలు చేసింది. ఇలా వసూలు చేసిన వారికి రెండు నెలల పాటు ట్రైనింగ్ ఇచ్చి జీతాలు […]
హైదరాబాద్ కొండాపూర్ లో గాయత్రి అనే మహిళ ఓ యువతిపై పథకం ప్రకారం నలుగురు యువకులతో దాడి చేయించి, అత్యాచారం కూడా చేయించింది. ఈ సంఘటన బయటకి రావడంతో సంచలనంగా మారింది. శ్రీకాంత్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి కొండాపూర్ లో ఉంటున్నాడు. బాధితురాలు కూడా కొండాపూర్‌లోని అదే కాలనిలో వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది. వీరిద్దరూ సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి స్నేహంగా మారింది. వీరి స్నేహంతో […]
ఒకపక్కన ఎండాకాలం అని ఎండలు మండిపోతున్నాయి. మరో పక్కన సడెన్ గా తుఫానులంటూ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవలే తుఫానుతో మండే ఎండల్లో భీభత్సమైన వర్షాలు కురిశాయి. తాజాగా మరోసారి వర్షాలు పడుతున్నాయి. ఇవాళ(మే 26) ఉదయం నుంచి హైదరాబాద్ లో ఎండ ఎక్కువగానే ఉంది. ఇక మధ్యాహ్నం ఎండ దంచి కొట్టింది. కానీ సాయంత్రానికి ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. హైదరాబాద్ నగరంలో గురువారం సాయంత్రం అకస్మాత్తుగా వర్షం కురిసింది. నగరంలోని జీడిమెట్ల, షాపూర్ నగర్, సూరారం, […]
కొంతమంది హిజ్రాలు పనులు చేసుకుంటూ బ్రతుకుతుంటే మరి కొంతమంది మాత్రం ఇంకా రోడ్డు మీద జనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తూనే ఉన్నారు. కొంతమంది డబ్బులు ఇవ్వడానికి వ్యతిరేకిస్తే హిజ్రాలు దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ యువకుడి నుంచి డబ్బులు లాక్కొని దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. గత రాత్రి సయ్యద్ షాబాజ్ అనే ఓ యువకుడు కృష్ణానగర్ వైపు నుంచి ఇందిరానగర్ వైపు బైక్‌పై వస్తుండగా ఇద్దరు హిజ్రాలు ఆ […]
తమ కూతురు వేరే మతాంతర వివాహం చేసుకుందని ఆ యువకుడిని వెంటాడి చంపిన సంఘటన హైదరాబాద్ లో జరిగింది. రంగారెడ్డి జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి అక్కడే దగ్గర్లో ఉన్న ఘనాపూర్‌కి చెందిన ఆశ్రిన్ కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమని పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంట్లోంచి బయటకి వచ్చి పెళ్లి చేసుకొని హైదరాబాద్ లో జీవనం సాగిస్తున్నారు. ఇది జరిగి రెండు నెలలు కాగా హైదరాబాద్ లోని ఓ కార్ల షోరూమ్‌లో సేల్స్‌మెన్‌గా పని […]
ఏపీ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికల నిర్వహణకు తెగ ఉత్సాహం చూపుతున్నారు. కరోనా ఇంకా పూర్తి స్తాయిలో తొలగిపోలేదు కాబట్టి ఇప్పట్లో సరికాదని ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయమై ఇరుపక్షాలు కోర్టుకు వెళ్లాయి. ఆ కేసుల వాదనలు అలా ఉంచితే.. ఏపీ స్థానిక ఎన్నికలను ఇప్పట్లో నిర్వహిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని ప్రభుత్వం చెప్పిన ప్రతిసారీ నిమ్మగడ్డ తెలంగాణలో జరిగిన జీహెచ్ ఎంసీ ఎన్నికలను ఉదాహరణగా చూపుతున్నారు. అక్కడ ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఎన్నికలు […]
అధికారం కోసం జీహెచ్ఎంసీ పరిధిలోని 150 డివిజన్లలోనూ అన్ని పార్టీల అభ్యర్థులూ హోరాహోరీగా పోరాడారు. కొందరు ఓడారు.. మరికొందరు గెలిచారు. ఓడిన అభ్యర్థుల సంగతి సరే.. గెలిచిన అభ్యర్థుల పరిస్థితి ప్రస్తుతం విచిత్రంగా ఉంది. తాము కార్పొరేటర్లం అని చెప్పుకోవడమే తప్పా అధికారం అనుభవించలేకపోతున్నారు. దాని కోసం సమావేశాలు పెట్టి మరీ డిమాండ్ చేస్తున్నారు. కొత్త పాలక మండలి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తాజాగా బీజేపీ కార్పొరేటర్లు ఎన్నికల సంఘానికి సైతం వినతిపత్రం […]