iDreamPost
android-app
ios-app

ప్రేమ పేరుతో యువతికి వేధింపులు.. లవ్ చేయకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తానంటూ..

  • Published Nov 16, 2024 | 3:30 PM Updated Updated Nov 16, 2024 | 3:30 PM

ప్రేమ పేరుతో ఓ యువకుడు యువతిపై వేధింపులకు పాల్పడ్డాడు. తనను లవ్ చేయకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తానంటూ భయబ్రాంక్తులకు గురిచేశాడు. ఈ ఘటన హయత్ నగర్ లో చోటుచేసుకుంది.

ప్రేమ పేరుతో ఓ యువకుడు యువతిపై వేధింపులకు పాల్పడ్డాడు. తనను లవ్ చేయకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తానంటూ భయబ్రాంక్తులకు గురిచేశాడు. ఈ ఘటన హయత్ నగర్ లో చోటుచేసుకుంది.

  • Published Nov 16, 2024 | 3:30 PMUpdated Nov 16, 2024 | 3:30 PM
ప్రేమ పేరుతో యువతికి వేధింపులు.. లవ్ చేయకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తానంటూ..

ప్రేమ ఓ మధురమైన అనుభూతి. ప్రేమకు కులమతాలు, ధనిక, పేద అనే తేడాలేమీ ఉండవు. ఎల్లలు లేనిది ప్రేమ. ప్రేమను దక్కించుకునేందుకు ఎంతటి సాహసానికైనా సిద్ధపడతారు. చివరకు ప్రేమించిన వారి కోసం ప్రాణాలు ఇచ్చేందుకు కూడా వెనకాడరు. కానీ కొందరు మాత్రం ప్రేమించిన వారు దక్కలేదని ప్రేయసిని చంపేస్తున్నారు. ఆమె కుటుంబ సభ్యులపై దాడులకు పాల్పడుతున్నారు. ప్రేమ పేరుతో యువతులను, మహిళలను వంచిస్తున్నారు. ప్రేమించమని వెంటపడి వేధిస్తున్నారు. ప్రేమోన్మాదుల అరాచకాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. కత్తులు, బ్లేడులతో దాడులకు తెగబడుతున్నారు. ఫోటోలు వీడియోలతో బెదిరింపులకు పాల్పడుతున్నారు.

బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలను తీసుకొచ్చి అమలు చేస్తున్నప్పటికీ ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట పడడం లేదు. ఇటీవల హైదరాబాద్ లో ఓ యువకుడు తను ప్రేమించిన అమ్మాయిని విదేశాలకు పంపించాడని ఆమే తండ్రిపై కాల్పులకు తెగబడ్డాడు. ఎయిర్ గన్ తో కాల్పులు జరపగా ఆ యువతి తండ్రి గాయపడ్డాడు. ఈ సంఘటన మరువక ముందే మరో సంఘటన కలకలం రేపుతోంది. ఓ యువకుడు ప్రేమ పేరుతో బెదిరింపులకు దిగిన ఘటన వెలుగు చూసింది. తనను ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తానంటూ అమ్మాయిని బెదిరింపులకు గురిచేశాడు. ఈ ఘటన హయత్ నగర్ లో చోటుచేసుకుంది.

ఆ యువకుడి వేధింపులు తాళలేక యువతి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. బాధిత యువతి మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ కు చెందిన విజయ్ కుమార్ అనే యువకుడు నన్ను ట్రాప్ చేశాడు. స్నేహంగా ఉన్న రోజుల్లో దిగిన ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేశాడని తెలిపింది. తన వెంట పడుతూ కాలేజీ వద్ద, బస్సులో వెళ్తున్న క్రమంలో వేధింపులకు పాల్పడుతున్నాడని బాధిత యువతి వెల్లడించింది. తనను లవ్ చేయకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తానని బెదిరిస్తున్నాడని వాపోయింది. అమ్మనాన్నలను చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని తెలిపింది. విజయ్ ఇంటి చుట్టూ చెక్కర్లు కొడుతూ తనను వేధిస్తున్నాడని తెలిపింది.

వెంటపడుతూ లైంగికంగా వేధిస్తున్నాడని తెలిపింది. ఎప్పుడు ఏం చేస్తాడో అని భయంగా ఉందని బాధిత యువతి చెప్పింది. తల్లిదండ్రులు లేకుండా బయటకు వెళ్లలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. చదువుకోలేక డిప్రెషన్ కి గురవుతున్నట్లు వెల్లడించింది. విజయ్ చేతిలో మరో ముగ్గురు యువతులు మోసపోయినట్లు బాధిత యువతి తెలిపింది. అతడి నుంచి తనకు, కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు. మరి ప్రేమ పేరుతో యువతిని వేధించిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş