iDreamPost
android-app
ios-app

అన్ని హంగులతో అఘోరీ కొత్త కారు..! స్టైల్ మార్చేసింది..

  • Published Nov 21, 2024 | 4:47 PM Updated Updated Nov 21, 2024 | 4:47 PM

Lady Aghori: లేడీ అఘోరి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తెగ హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ముత్యాల‌మ్మ గుడిలో పూజలు చేసిన తర్వాత అఘోరీ హఠాత్తుగా ఫేమస్ అయ్యింది. అప్పటి నుంచి ఆమెకు సంబంధించిన న్యూస్ తెగ వైరల్ అవుతున్నాయి.

Lady Aghori: లేడీ అఘోరి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తెగ హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ముత్యాల‌మ్మ గుడిలో పూజలు చేసిన తర్వాత అఘోరీ హఠాత్తుగా ఫేమస్ అయ్యింది. అప్పటి నుంచి ఆమెకు సంబంధించిన న్యూస్ తెగ వైరల్ అవుతున్నాయి.

  • Published Nov 21, 2024 | 4:47 PMUpdated Nov 21, 2024 | 4:47 PM
అన్ని హంగులతో అఘోరీ కొత్త కారు..! స్టైల్ మార్చేసింది..

ఓ లేడీ అఘోరి ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో తెగ హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. సికింద్రబాద్ పరిధిలోని మోండా మార్కెట్ లో కుమ్మరిగూడలో ముత్యాలమ్మ తల్లి ఆలయంలో పూజలు జరుగుతున్న సమయంలో ఆలయంలోకి ఓ మహిళా అఘోరి (నాగసాధు) వచ్చింది. నగ్నంగా ఉన్న లేడీ అఘోరి హూమంలో పాల్గొని, ఒంటి కాలిపై నిలబడి పూజలు చేసింది. సనాతన ధర్మాన్ని కాపాడాలని, మహిళలపై అత్యాచారాలు, లోకకళ్యాణం కోసం పాటుపడతానని లేడీ అఘోరీ తెగ హల్ చల్ చేస్తుంది. బ్యాక్ టూ బ్యాక్ ఇంటర్వ్యూలతో సెలబ్రెటీగా మారిపోయింది. యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు అఘోరికి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని అంతరాయాలు ఎదురైనా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది.

ఈ మధ్యనే ఏపీలోని శ్రీకాళ‌హ‌స్తికి చేరుకున్న అఘోరిని పోలీసులు ఆపారు. దీంతో కోపంతో ఊగిపోతూ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటా అంటూ హల్ చల్ చేసింది.దీంతో పోలీసులుకు ఆమెకు దర్శన ఏర్పాటు చేశారు. దర్శనం అనంతరం కర్నూల్ నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో డివైడర్ గుద్దుకోవడంతో కారు లైట్లు, ముందు భాగం మొత్తం డ్యామేజ్ అయ్యింది. ఈ క్రమంలోనే అఘోరీ తన కారును హుండాయ్ షోరూం కి అప్పగించింది. షో రూమ్ నుంచి బయటకు వచ్చిన కారు న్యూ లుక్ తో కనిపిస్తుంది.దీంతో అఘోరీ కొత్త కారు కొన్నదంటూ వార్తలు వచ్చాయి. అసలు వాస్తవం ఏంటంటే.. అది పాత కారు అని తేలింది. డ్యామేజ్ అయిన కారుకు సరికొత్త పార్ట్స్ వేసి లేటెస్ట్ టెక్నాలజీ జత చేసి రూపురేఖలు మార్చినట్లు హుండాయ్ సిబ్బంది తెలిపారు. అంతకు ముందు కొంతమంది భక్తులు తమ కారులో ఆలయాల దర్శనానికి రావాల్సిందిగా కోరారు. కానీ అఘోరి మాత్రం తన కారు బాగా అయ్యే వరకు ఎక్కడికి వెళ్లినా పాదయాత్రే అని లేల్చి చెప్పింది.

మొత్తానికి హుండాయ్ షోరూం అఘోరీ పాత కారును రెన్నోవేషన్ చేసి కొత్త కారుగా తీర్చిదిద్దారు.ఈ కారులోనే ఆమె హైదరాబాద్ బయలుదేరి వచ్చింది. ఇదిలా ఉంటే.. అఘోరీ తన స్టైల్ కూడా మార్చింది. అంతకు ముందు నగ్నంగా ఉన్నప్పటికీ శ్రీకాళ‌హస్తి లో జరిగిన సంఘటన తర్వాత బట్టలు వేసుకొని కనిపిస్తుంది. ఒకసారి ఎరుపు మరోసారి నలుపు ఇలా వస్త్రాలు ధరించి కనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ని కలవాలని మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ఎదురుగా ఉన్న రహదారిపై బైఠాయించింది. చాలా సేపటి వరకు హై డ్రామా నడిచిన తర్వాత మొత్తానికి ఆమెకు నచ్చజెప్పి అక్కడ నుంచి పంపించారు పోలీసులు. అక్కడ నుంచి తెలంగాణకు చేరుకుంది అఘోరీ. వరంగల్ చేరుకున్న అఘోరీ రంగసాయి పేట బెస్తం చెరువు సమీపంలోని శ్మశాన వాటికలోనే కూర్చింది. అక్కడ రాత్రి పూట పూజలు చేసి నిద్రించింది. ఐదు రోజులు తాను దీక్ష చేస్తున్నానని.. మగవారితో మాట్లాడనని చెప్పింది.ఈ క్రమంలోనే అఘోరి కేవలం మహిళలతోనే ఆమె మాట్లాడుతుంది.తాజాగా అఘోరి మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వరంగల్ నుంచి ఆమె మకాం మార్చినట్లు తెలుస్తుంది. వరంగల్ నుంచి గుజరాత్ కు బయలుదేరింది. వరంగల్ లో కారు రిపేర్ చేయించుకొని బయలుదేరి గుజరాత్ లోని పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటాని అఘోరి తెలిపింది. అక్కడ సోమనాథ్ తో పాటు మరికొన్ని ఆలయాలను దర్శించుకోనున్నట్లు పేర్కొంది.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş