iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో దారుణం.. కంట్లో నలుసు పడిందని వెళితే.. చివరకు ఏం జరిగిందంటే?

  • Published Nov 23, 2024 | 10:55 AM Updated Updated Nov 23, 2024 | 10:55 AM

కంట్లో నలుసు పడితే కన్ను అంతా ఎర్రబడి నొప్పిగా ఉంటుంది. ఈ బాధను భరించలేక ఓ చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్తే ఘోరం జరిగిపోయింది. నలుసును తొలగించేందుకు సర్జరీ చేయాలని చెప్పి వైద్యులు పాప ప్రాణం తీశారు.

కంట్లో నలుసు పడితే కన్ను అంతా ఎర్రబడి నొప్పిగా ఉంటుంది. ఈ బాధను భరించలేక ఓ చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్తే ఘోరం జరిగిపోయింది. నలుసును తొలగించేందుకు సర్జరీ చేయాలని చెప్పి వైద్యులు పాప ప్రాణం తీశారు.

హైదరాబాద్ లో దారుణం.. కంట్లో నలుసు పడిందని వెళితే.. చివరకు ఏం జరిగిందంటే?

వైద్యోనారాయణో హరి అన్నారు పెద్దలు. ప్రాణాలు పోసే వైద్యుడిని భగవంతుడితో సమానంగా చూస్తారు. తల్లిదండ్రులు జన్మనిస్తే వైద్యుడు పునర్జన్మ ఇస్తాడు. తాము నేర్చుకున్న వైద్యంతో రోగాలను నయం చేసి ఆరోగ్యం కుదుటపడేలా చేస్తారు వైద్యులు. డాక్టర్లపై రోగులకు అంత నమ్మకం ఉంటుంది. అలాంటిది కొందరు డాక్టర్లు మాత్రం వైద్యం చేసే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ప్రాణాలు కాపాడాల్సింది పోయి ప్రాణాలు తీస్తున్నారు. వైద్య వృత్తికే మాయని మచ్చ తెస్తున్నారు కొందరు డాక్టర్లు. జబ్బు చేస్తే ఆసుపత్రికి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్తితులు నెలకొన్నాయి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్లుగా వచ్చీరాని వైద్యం చేస్తూ ప్రాణాలు తీస్తున్నారు.

సర్జరీలు చేసేటపుడు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిపోయి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోగుల ప్రాణాల మీదికి తెస్తున్నారు. డబ్బుపై ఆశతో ఇష్టారీతిలో వైద్యం చేస్తూ రోగులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటుచేసుకుంది. వైద్యుడి నిర్లక్ష్యం 5ఏళ్ల పాప ప్రాణాలు తీసింది. కంటిలో నలుసు పడిందని ఆసుపత్రికి వెళితే ఘోరం జరిగిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నగరంలోని హబ్బిగూడకు చెందిన అన్వికకు కంట్లో నలుసు పడింది. అది ఎంతకు బయటికి రాకపోవడంతో ఆ చిన్నారి నొప్పితో బాధపడింది.

దీంతో పేరెంట్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. హైదరాబాద్ లోని ఆనంద్ ఐ ఇన్సిట్యూట్ హాస్పిటల్లో చేర్పించారు. బాలికను పరీక్షించిన అక్కడి వైద్యులు కంటిలో నలకను తీసేయాలంటే సర్జరీ చేయాలని సూచించారు. నలుసును తొలగించేందుకు సర్జరీకి ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే బాలికకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చారు. అయితే మత్తు ఇంజెక్షన్ డోస్ ఎక్కువవడంతో చిన్నారి స్పృహ కోల్పోయింది. ఆ కాసేపటికే హార్ట్ బీట్ కూడా ఆగిపోయింది. దీంతో ఆందోళన చెందిన వైద్యులు గుట్టు చప్పుడు కాకుండా తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండానే ఎల్బీనగర్ రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్ కు తరలించారు.

పాపను పరీక్షించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్ధారించారు. అల్లారు ముద్దుగా సాదుకుంటున్న కూతురు మరణించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పాప మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఈ క్రమంలో ఆనంద్ ఐ ఇన్సిట్యూట్ వద్ద హన్విక బంధువులు ఆందోళనకు దిగారు. తమ చిన్నారి మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆసుపత్రి ముందు చిన్నారి బంధువుల ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కంట్లో నలుసు పడిందని ఆసుపత్రికి వెళితే చిన్నారి ప్రాణాలు పోయిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.