Vinay Kola
Spa Center: హైదరాబాద్ లోని స్పా సెంటర్స్ వ్యభిచారానికి నిలయంగా మారాయి. తాజాగా మరొకటి బయట పడింది.
Spa Center: హైదరాబాద్ లోని స్పా సెంటర్స్ వ్యభిచారానికి నిలయంగా మారాయి. తాజాగా మరొకటి బయట పడింది.
Vinay Kola
ఒకప్పుడు వ్యభిచారం కోసం ప్రత్యేక ఏరియాలు ఉండేవి. ఇప్పుడు కూడా బ్రోతల్ ఏరియాలు ఉన్నాయనుకోండి. కానీ వాటినే మించుపోతున్నాయి కొన్ని. వాటిలో స్పా సెంటర్స్ ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఈమధ్య కాలంలో ఎక్కడ చూసినా స్పా సెంటర్లు వివాదస్పదం అవుతున్నాయి. స్పా సెంటర్ల పేరుతో వ్యభిచారం నడుపుతున్న వారి సంఖ్య చాలా ఎక్కువ అవుతుంది. ఇవి రోజు రోజుకి పెరిగి పోవడంతో స్పా సెంటర్ చరిత్రను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈజీ మనీతో పాటు, కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా స్పా సెంటర్‌ను నడుపుతున్నారని పోలీసుల విచారణలో విషయాలు తెలుస్తున్నాయి. వేర్వేరు ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొస్తున్నారు. స్పా సెంటర్ ద్వారా వ్యభిచారం నిర్వహిస్తున్నారు చాలా మంది దుండగులు. మహిళలని అక్రమంగా రవాణా చేస్తున్నారు. ఇప్పటికీ ఎన్నో సార్లు వెలుగులోకి వచ్చిన ఈ స్పా బాగోతం తాజాగా మరోసారి వెలుగులోకి వచ్చి హాల్ చల్ చేస్తుంది. ఇంతకీ ఈసారి ఏమైంది? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రాను రాను హైదరాబాద్ మహా నగరం వ్యభిచారానికి అడ్డాగా మారిపోతుందనే చెప్పాలి. ఇప్పటికే ఎన్నో అక్రమ వ్యభిచార కేసులు వెలుగులోకి వచ్చాయి. ఇక తాజాగా చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో సారి ఈ ఘటన జరిగింది. అక్కడ స్పా సెంటర్ పై హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడి చేశారు. న్యూ డ్రీమ్ స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పోలీసులు వెంటనే స్పా సెంటర్ పై దాడి చేసి, మొత్తం నలుగురు యువతులు, ఒక విటుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పట్టుబడ్డ వారి నుంచి డబ్బుని, 6 మొబైల్ ఫోన్స్ ని స్వాధీనం చేసుకున్నారు. ఇంకా అంతే కాదండోయ్ కండోమ్ ప్యాకెట్లని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఏకంగా నలభై కండోమ్ లు బయట పడినట్లు తెలిసింది.
ఇక ఈ కేసును హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు.. చందానగర్ పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు.ఇక చందా నగర్ పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆ యువతులు ఎవరు? ఎప్పటి నుంచి స్పా సెంటర్లో పని చేస్తున్నారనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదీ సంగతి. ఇలా స్పా సెంటర్లు వ్యభిచారానికి అడ్డాగా నిలుస్తున్నాయి. ఈమధ్య కాలంలో హైదరాబాద్ లో చాలా బయట పడుతున్నాయి. ఈ విధంగా స్పాపేరుతో వ్యభిచార బాగోతాలు చాలా ఎక్కువ అవుతున్నాయి. మహిళల అక్రమ రవాణాలు ఎక్కువ అవుతున్నాయి. ఇక ఈ విషయం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.