iDreamPost
android-app
ios-app

Crime: సరోగసి పేరుతో లైంగిక వేధింపులు.. ఇంట్లో బంధించి..

  • Published Nov 28, 2024 | 11:41 AM Updated Updated Nov 28, 2024 | 11:41 AM

Crime: సరోగసి ద్వారా ఆర్ధిక పరిస్థితులు తగ్గించుకోవడానికి హైదరాబాద్ వచ్చింది అశ్విని సింగ్.. కానీ మోసానికి గురయ్యింది.

Crime: సరోగసి ద్వారా ఆర్ధిక పరిస్థితులు తగ్గించుకోవడానికి హైదరాబాద్ వచ్చింది అశ్విని సింగ్.. కానీ మోసానికి గురయ్యింది.

  • Published Nov 28, 2024 | 11:41 AMUpdated Nov 28, 2024 | 11:41 AM
Crime: సరోగసి పేరుతో లైంగిక వేధింపులు.. ఇంట్లో బంధించి..

గర్భాన్ని అద్దెకు ఇచ్చి పాపం పేదరికం నుంచి విముక్తి పొందాలనుకుంది ఆ మహిళ. ఎక్కడో ఒడిశా నుంచి పొట్ట చేతపట్టుకుని హైదరాబాద్‌కు వచ్చింది. తీరా ఇక్కడకు వచ్చాక.. ఆమెను తీసుకువచ్చిన వ్యక్తి ఆమెపై లైంగిక వేధింపులకు దిగాడు. అతడి బారి నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నంలో తొమ్మిదో అంతస్తు నుంచి కింద పడి చనిపోయిందా మహిళ. తన నాలుగేళ్ల కుమారుణ్ని, భర్తను తీవ్ర విషాదంలో ముంచేసింది. రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌ సర్కిల్లో జరిగిందీ విషాదం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయదుర్గంలోని మైహోం భూజలో ఉండే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నిత్యం రాజేష్ బాబు (54) దంపతులకు పిల్లలు లేదు. దీంతో వారు సరోగసీ (అద్దె గర్భం) ద్వారా పిల్లల్ని పొందాలని భావించి.. సందీప్‌ అనే మధ్యవర్తి ద్వారా ఒడిశాకు చెందిన సంజయ్‌ సింగ్‌, అశ్విత సింగ్ (25) దంపతులను కలిశారు. వారితో రూ.10 లక్షలకు అగ్రీమెంట్ కుదుర్చుకున్నారు. అగ్రీమెంట్ ప్రకారం వారిద్దరూ తమ నాలుగేళ్ల కుమారుడితో కలిసి అక్టోబరు 24న హైదరాబాద్‌కు వచ్చారు. అయితే అప్పటినుంచి అశ్వితను 9వ అంతస్తులోని తమ ఇంట్లోనే బంధించాడు రాజేష్‌.. ఆమె భర్త సంజయ్‌సింగ్‌కు మాత్రం విషయం తెలీకుండా అదే అపార్ట్‌మెంట్‌లో ఏడో అంతస్తులో షెల్టర్ ఇచ్చాడు.

సరోగసీ విధానం ద్వారా బిడ్డను కనేందుకు అవసరమైన ప్రాసెస్ జరుగుతుందని సంజయ్ కి చెప్పాడు. ఒకవైపు ఆ ప్రాసెస్ కొనసాగుతుండగా.. గత పదిహేనురోజుల నుంచి రాజేష్‌ బాబు అశ్వితపై లైంగిక దాడి చేస్తూ వచ్చాడు. సరోగసీ విధానంలో బిడ్డను కనిస్తాను తప్ప.. లైంగికంగా కలిసేందుకు ఒప్పుకొనేది లేదని రాజేష్ కి తేల్చిచెప్పిన అశ్విత, అతడి అకృత్యాల గురించి భర్తకు చెప్పింది. తిరిగి ఒడిశాకు వెళ్లిపోదామని రెండు, మూడుసార్లు చెప్పింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇంత దారుణం జరిగినందుకు తన భర్తకు ఏమాత్రం కోపం రాలేదు. పైగా ఒప్పందం ప్రకారం బిడ్డను కనిస్తే, ఆర్థిక కష్టాలు తొలగిపోతాయని సంజయ్‌ సింగ్‌ తన భార్యకు నచ్చజెప్పాడు. కానీ.. రాజేష్ లైంగిక వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. దీంతో అక్కడి నుంచి ఎలాగైన తప్పించుకుని స్వగ్రామం వెళ్దామనుకుంది అశ్విత.

రాజేష్ ఫ్లాట్‌ బాల్కనీ నుంచి చీరను కట్టి, రెండు అంతస్తుల మేర కిందకు జారితే.. అక్కడ ఉండే ర్యాంపు ద్వారా భర్త ఉండే ఫ్లాట్‌లోకి చేరుకోవచ్చని అనుకుంది. దీంతో మంగళవారం రాత్రి రెండు గంటలకు (తెల్లవారితే బుధవారం).. రెండు చీరలను కట్టి 9వ అంతస్తు బాల్కనీలోంచి కిందకు వేలాడదీసింది. ఆ చీరలను పట్టుకుని నెమ్మదిగా కిందికి దిగుతుండగా ఆమె చేతులు పట్టు జారి అంత ఎత్తు నుంచి కిందపడిపోయింది. తీవ్ర గాయాలతో పాపం స్పాట్ లోనే చనిపోయింది. దీంతో సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు అశ్విత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమె భర్త ఫిర్యాదు మేరకు రాజేష్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎంత దారుణం.. సరోగసి ద్వారా తన ఆర్ధిక సమస్యలకు తీర్చుకోడానికి వచ్చి ప్రాణాలే కోల్పోయింది అశ్విత.

Jojobet GirişJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabet