iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. పోలీసులకు చిక్కిన సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ

  • Published Nov 14, 2024 | 11:45 AM Updated Updated Nov 14, 2024 | 11:45 AM

Siddipet Traffic ACP Suman Kumar: హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన పోలీసులకు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ చిక్కారు. తాను మద్యం తాగలేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Siddipet Traffic ACP Suman Kumar: హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టిన పోలీసులకు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ చిక్కారు. తాను మద్యం తాగలేదంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

హైదరాబాద్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. పోలీసులకు చిక్కిన సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ

శాంతిభద్రతలను కాపాడటంలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తారు. దొంగలను, దోపిడీదారుల పట్ల ఉక్కుపాదం మోపుతూ నేరాలను అదుపు చేస్తుంటారు. అసాంఘిక శక్తులను కట్టడి చేస్తుంటారు. పోలీస్ వ్యవస్థ లేని సొసైటీని ఊహించుకోలేము. ప్రజల ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డు వేయడానికి వెనకాడరు పోలీసులు. అందుకే పోలీసులంటే సమాజంలో ఎనలేని గౌరవం ఉంటుంది. అయితే కొందరు పోలీసులు తమ ప్రవర్తనతో పోలీస్ శాఖకు మచ్చ తెస్తుంటారు. తాజాగా ఓ ఏసీపీ బాధ్యతను మరిచి మద్యం తాగి వాహనం నడుపుతూ అడ్డంగా బుక్కయ్యాడు. మద్యం తాగి వాహనాలు నడపకూడదు అని చెప్పాల్సిన పోలీస్ అధికారి దారి తప్పి వ్యవహరించాడు.

బాధ్యాతాయుతమైన వృత్తిలో ఉండి మద్యం తాగి పోలీసులకు చిక్కాడు. మద్యం తాగి వాహనం నడపడం కారణంగా రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మద్యం వల్ల ఆరోగ్యం పాడవడమే కాకుండా ప్రమాదాలకు కారణమవుతున్నది. మద్యం తాగి బండి నడుపుతూ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టి బారీగా జరిమానాలు విదిస్తున్నప్పటికీ వాహనదారుల్లో మార్పు మాత్రం రావడం లేదు. కాగా బుధవారం రాత్రి హైదరాబాద్ లో ఏసీపీ మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఏసీపీ అడ్డంగా బుక్కవడంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

హైదరాబాద్ లోని మధురానగర్‌లో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ సివిల్ డ్రెస్సులో ఉండి పోలీసులకు చిక్కారు. బ్రీత్ ఎనలైజర్‌ టెస్టు చేయగ అందుకు అతడు సహకరించలేదు. అంతేకాకుండా తాను డిపార్ట్ మెంట్ అంటూ పోలీసులపై చిందులు తొక్కాడు. ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. తాను మద్యం తాగలేదని బుకాయించాడు. ఎంతకీ ఏసీపీ సుమన్ కుమార్ బ్రీత్ ఎనలైజర్‌ ముందు ఊదకపోవడంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు అక్కడికి చేరుకుని ఏసీపీ సుమన్ కుమార్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఏసీపీ మద్యం తాగినట్లుగా తేలడంతో అతనిపై చర్యలకు సిద్దమయినట్లు తెలిపారు. చట్టం ముందు అందరూ సమానమే.. రూల్స్ అందరికీ వర్తిస్తాయని పోలీసులు నిరూపించారు. సామాన్యులు, పోలీసులు, లీడర్లు ఇలా ఎవ్వరైనా తప్పు చేస్తే చట్టానికి తలవంచాల్సిందే. మరి డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ఏసీపీ తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.