iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ లో దారుణం.. చెల్లిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని..

  • Published Nov 28, 2024 | 11:02 AM Updated Updated Nov 28, 2024 | 11:02 AM

చెల్లిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని అన్న షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తన గ్యాంగ్ తో కలిసి ఆ యువకుడిపై దాడికి పాల్పడ్డాడు. చివరకు ఏం జరిగిందంటే?

చెల్లిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని అన్న షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. తన గ్యాంగ్ తో కలిసి ఆ యువకుడిపై దాడికి పాల్పడ్డాడు. చివరకు ఏం జరిగిందంటే?

  • Published Nov 28, 2024 | 11:02 AMUpdated Nov 28, 2024 | 11:02 AM
హైదరాబాద్ లో దారుణం.. చెల్లిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని..

చదువుకోవాల్సిన వయసులో యువతీ యువకులు ప్రేమాదోమా అంటూ ఫ్యూచర్ ను పాడు చేసుకుంటున్నారు. యువతకు జీవితం అంటే సరదా అయిపోయింది. పిల్లల కారణంగా తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రేమ పేరుతో మోసపోయి పేరెంట్స్ కు తలవంపులు తీసుకు వస్తున్నారు. ప్రేమ కారణంగా జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. ప్రేమను గెలిపించుకునేందుకు దారుణాలకు ఒడిగడుతున్నారు. ప్రేమించిన వారు దక్కకపోవడంతో కక్షలు పెంచుకుని దాడులకు పాల్పడుతున్నారు. ప్రేమ కోసం ప్రాణాలు తీసుకోవడానికైనా, తీయడానికైనా సిద్ధపడుతున్నారు. ఈ క్రమంలో ప్రేమ పేరుతో తన చెల్లిని వేధిస్తున్నాడని ఓ అన్న ఆ యువకుడిపై దాడికి పాల్పడ్డాడు.

యువతి అన్న తన గ్యాంగ్ తో కలిసి విచక్షణా రహితంగా దాడి చేయడంతో ఆ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. చెల్లిపై ఉన్న ప్రేమ యువకుడి హత్యకు దారితీసింది. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కూకట్ పల్లికి చెందిన పవన్ కు ఓ సోదరి ఉంది. ఆ యువతిని వెంకట రమణ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించేవాడు. రోజు రోజుకు అతడి వేధింపులు ఎక్కువై పోయాయి. ఇక అతడి వేధింపులు తట్టుకోలేక ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు చెప్పింది. ఇంట్లో తెలియడంతో ఆ యువతి పేరెంట్స్ వెంకటరమణను హెచ్చరించారు. మా అమ్మాయి వెంటపడొద్దని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఆ యువకుడు మాత్రం తన బుద్దిని మార్చుకోలేదు.

మళ్లీ యువతిని వేధించడం ప్రారంభించాడు. మరోసారి ఆ యువతి తన అన్నకు ఈ విషయాన్ని తెలిపింది. వేధింపులు గురిచేస్తున్న వెంటకటరమణకు తగిన బుద్ది చెప్పాలని యువతి అన్న పవన్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో వెంకటరమణ రోజుమాదిరిగానే కూకట్ పల్లికి వచ్చాడు. ఆ సమయంలో యువతి అన్న పవన్ తో పాటు మరికొందరు అక్కడికి చేరుకున్నారు. చెల్లిని ప్రేమ పేరుతో వేధిస్తుండడంతో పవన్ రగిలిపోయాడు. వెంకటరమణపై పవన్ అతనితో పాటు వచ్చిన వారు దాడికి పాల్పడ్డారు. చపాతి కర్రతో తలపై కొడుతూ బీభత్సం సృషించారు.

వెంకటరమణను చితక్కొట్టడంతో తలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దాడిని ఆపేందుకు ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. దాడిలో గాయాలపాలైన వెంకటరమణను సమీప ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆరోగ్యం విషమించడంతో వెంకటరమణ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. చెల్లిని ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని దాడి చేశారా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. మరి చెల్లిని వేధిస్తున్నాడని యువకుడిపై దాడి చేసి హత్య చేసిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş