పిల్లలకు మనమిచ్చే ఆస్తి చదువు. విద్యార్ధి ఫీజు ఎంతైనా సరే, మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. అందుకే ప్రతి విద్యార్థికి 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ కోసం మూడో విడత జగనన్న విద్యాదీవెన నిధులు విడుదల చేస్తున్నామని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. రూ.694 కోట్లను వారి తల్లుల ఖాతాల్లో జమ చేశారు. ఏప్రిల్-జూన్ 2022 త్రైమాసికానికి, 11.02 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారని సీఎం జగన్ అన్నారు. ప్రతి బిడ్డ […]
నిన్న బాపట్ల ఎంపి నందిగం సురేష్ వ్యక్తిగత కార్యక్రమం నిమిత్తం కృష్ణా జిల్లా నందిగామ వెళ్లారు. ఎంపి తన పనులు ముగించుకొని కారు ఎక్కుతున్న సమయంలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలు, తెలుగుదేశం పార్టీ నేతలు ఎంపి ని కలుసుకొని గులాబీ పూలు ఇచ్చి అమరావతికి మద్దతు తెలపాల్సిందిగా కోరారు. ఎంపి నవ్వుతూనే మాట్లాడుతూ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో వెనుకనుండి వచ్చిన కొందరు తెలుగుదేశం కార్యకర్తలు జై అమరావతి అంటూ నినాదాలు […]