iDreamPost
android-app
ios-app

పెళ్లి కావటం లేదని యువకుడి వినూత్న ప్రయత్నం..

  • Published Oct 11, 2023 | 10:22 PM Updated Updated Oct 11, 2023 | 10:22 PM
  • Published Oct 11, 2023 | 10:22 PMUpdated Oct 11, 2023 | 10:22 PM
పెళ్లి కావటం లేదని యువకుడి వినూత్న ప్రయత్నం..

దేశ వ్యాప్తంగా ఉన్న యువకులను పట్టి పీడిస్తున్న సమస్యల్లో పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి దొరక్కపోవటం ప్రధానంగా మారింది. 30 ఏళ్లు దాటుతున్నా పెళ్లికి పిల్ల దొరక్క నానా ఇబ్బందులు పడుతున్న వారు కొందరైతే.. పెళ్లి కావటం లేదన్న బాధలో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు మరికొందరు. అయితే, చాలా అరుదుగా మాత్రమే పెళ్లి కోసం వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ కూడా చాలా అరుదైనదే.

ఓ యువకుడు పెళ్లి చేసుకోవటానికి.. పిల్లను వెతకటం కోసం ఏకంగా ఓ బ్యానర్‌ను డిజైన్‌ చేశాడు. దాన్ని సైకిల్‌కు తగిలించుకుని ఊరూరు తిరుగుతున్నాడు. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా చీరాలకు చెందిన అయ్యప్ప కుమార్‌ ఈ కొత్త ప్రయత్నా‍నికి తెరతీశాడు. ఇంతకీ ఆ బ్యానర్‌లో  ఏముందంటే.. ‘‘ నేనంటే ఇష్టం ఉన్న అమ్మాయిలు ఎవరైనా తన పేరు, మొబైల్‌ నెంబర్‌ ఇక్కడ నమోదు చేయండి. తమకు వీలు చిక్కిన రోజున నన్ను కలవగలరు. కుల పట్టింపు లేదు.

నమ్మకం లేని వారు దయచేసి మీ వివరాలు నాకు ఇవ్వవద్దు. నేను తప్పుగా అర్థం చేసుకోను. నేను పెళ్లి చేసుకోవటానికి ఓ అమ్మాయి కావాలి. ఇది వ్యాపారం కాదు. గమనిక: మనస్పూర్తిగా ఇష్టం ఉన్నవారు మాత్రమే తన పేరును, మొబైల్‌ నెంబర్‌ను ఇష్టం లేని వారు దూరంగా ఉండండి’’ అని ఉంది. ప్రస్తుతం ఈ యువకుడి వినూత్న ప్రయత్నం సోషల్‌ మీడియా వ్యాప్తంగా చాలా వైరల్‌ అయింది. అతడు చేస్తున్న ఈ పనిపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు. మరి, అయ్యప్ప కుమార్‌ పెళ్లి కోసం బ్యానర్‌ ముద్రించి, సైకిల్‌కు తగిలించి ఊరూరు తిరగటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet