Krishna Kowshik
సముద్ర తీర ప్రాంతాల్లో ఎంజాయ్ చేసేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఆంధ్ర వాసులకు సముద్ర తీర ప్రాంతాలతో బాగా కనెక్టివిటీ ఉంటుంది. అందువల్ల వీకెండ్ అలాగే ఏదైనా స్పెషల్ అకేషన్ సమయాల్లో బీచ్‌లకు వెళుతుంటారు. అలాంటి వారికి బ్యాడ్ న్యూస్.
సముద్ర తీర ప్రాంతాల్లో ఎంజాయ్ చేసేందుకు ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఆంధ్ర వాసులకు సముద్ర తీర ప్రాంతాలతో బాగా కనెక్టివిటీ ఉంటుంది. అందువల్ల వీకెండ్ అలాగే ఏదైనా స్పెషల్ అకేషన్ సమయాల్లో బీచ్‌లకు వెళుతుంటారు. అలాంటి వారికి బ్యాడ్ న్యూస్.
Krishna Kowshik
సముద్ర తీరాలంటే ఎవరికీ ఇష్టం ఉండదు చెప్పండి. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ల వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడే సుందరమైన ప్రాంతం. ఫ్యామిలీతో ఎక్కడైనా వెళ్లాలంటే చాలా మందికి ఫస్ట్ ఛాయిస్ బీచ్‌లు మాత్రమే. ముఖ్యంగా ఆంధ్రవాసులకు. ఆనందానికి, ఆహ్లాదానికి, వినోదానికి, ఆటవిడుపుకు అక్కడికి వెళుతుంటారు. సముద్రంలో స్నానాలు చేసి ఎంజాయ్ చేస్తుంటారు. ఎక్కువగా స్నేహితులు బీచ్‌లోకి వెళ్లి చిల్ అవతుంటారు. కానీ ఇటీవల సముద్ర తీర ప్రాంతాలు భయపెడుతున్నాయి. ఇటీవల వరుసగా ప్రమాదాలు జరిగి.. పలువుర్ని పెట్టనబెట్టుకున్నాయి. ఈ ప్రమాదాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. పలు బీచ్ లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
వీకెండ్ వచ్చింది బీచ్‌కు వెళదామనుకుంటున్నారా.. అయితే బ్యాడ్ న్యూస్. బాపట్ల జిల్లాలోని రెండు బీచ్‌లను తాత్కాలికంగా మూసివేస్తూ అధికారులు ఉత్తర్త్వులు జారీ చేశారు. వేటపాలం, చీరాల బీచ్‌లను క్లోజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. గత వారం రోజుల వ్యవధిలో ఈ రెండు బీచ్‌లలో స్నానాలకు వెళ్లి ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే బాపట్ల జిల్లాలోని ఈ రెండు బీచ్‌లను బాపట్ల పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. ఈ సముద్ర తీర ప్రాంతాల్లోకి అడుగు పెట్టకుండా నిషేధం విధించారు. కాగా, బాపట్ల పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత వారం రోజుల వ్యవధిలో ఆరుగురు చనిపోగా.. 14 మందిని బీచ్‌లలో ఉన్న సెక్యూరిటీ కాపాడారని చెప్పారు. వర్షాకాలం కావడంతో సముద్రంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయని.. అందుకే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. బీచ్ చూడ్డానికి వచ్చేవారు మోకాళ్లలోతు వరకే వెళ్తున్నప్పటికీ.. వాతావరణ పరిస్థితులు, సముద్రపు ఆటుపోట్ల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.
స్నానాలకు దిగిన కొంత మంది గల్లంతు అయ్యి.. ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. అయితే ఎల్లప్పుడూ పోలీసులు గస్తీ కాస్తూ ఉండటం ఆసాధ్యం కావటంతో తాత్కాలికంగా బీచ్‌లను మూసివేసినట్లు చెప్పారు. బాపట్ల జిల్లాలో సుమారు 76 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉండగా.. వారాంతాల్లో భారీగా సందర్శకులు వస్తుంటారు. వేటపాలం మండలంలోని రామాపురం బీచ్‌లో ఈ ఆదివారం ఇద్దరు యువకులు మరణించారు. మంగళగిరికి చెందిన 12 మంది యువకులు ఆదివారం రామాపురం బీచ్‌కు వెళ్లారు. బీచ్‌లో స్నానం చేస్తుండగా అలల ఉధృతికి నలగురు గల్లంతయ్యారు. బాల సాయి(26), బాల నాగేశ్వర రావు(27) అనే యువకులు నీటిలో కొట్టుకుపోయారు. ఈ నేపథ్యంలోనే సముద్ర తీర ప్రాంతాల్లో ఎంట్రీని నిషేధిస్తూ.. బారికేడ్లు ఏర్పాటు చేశారు. హెచ్చరికలు జారీ చేశారు. సైన్ బోర్డులు కూడా ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.