Arjun Suravaram
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమం, అభివృద్ది అనే రెండు పగ్గాలను సమానంగా పట్టుకుని ముందుకు సాగారు. విద్యా, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇక సీఎం జగన్ పాలనపై ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ ట్విట్లు చేస్తుంటారు. తాజాగా మరో ట్వీట్ చేస్తూ సీఎం జగన్ కి ధన్యవాదాలు తెలిపారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమం, అభివృద్ది అనే రెండు పగ్గాలను సమానంగా పట్టుకుని ముందుకు సాగారు. విద్యా, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. ఇక సీఎం జగన్ పాలనపై ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ ట్విట్లు చేస్తుంటారు. తాజాగా మరో ట్వీట్ చేస్తూ సీఎం జగన్ కి ధన్యవాదాలు తెలిపారు.
Arjun Suravaram
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమం, అభివృద్ది అనే రెండు పగ్గాలను సమానంగా పట్టుకుని ముందుకు సాగారు. విద్యా, వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. నాడు నేడుతో పాఠశాల రూపు రేఖలే మార్చారు. అలానే రాష్ట్రంలోనే ఏ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేశారు. సీఎం జగన్ ఎంత మంచి చేసినా ప్రతిపక్షాలు మాత్రం ఏదో విధంగా ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇదే సమయంలో పక్కరాష్ట్రాలు సైతం సీఎం జగన్ పరిపాలన పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాయి. అలానే ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ ఏపీ అభివృద్ధిపై తరచూ ఫోటోలు విడుదల చేస్తూ..తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తుంటారు. తాజాగా ఏపీ అభివృద్ధికి సంబంధించి మరోసారి ఫోటోలు విడుదల చేశారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన అనేక సినిమాలకు కథను అందించారు. తనదైన రచనతో అనేక హిట్ మూవీలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇటీవలే ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అనే సినిమా వచ్చింది. ఆ సినిమాకు కోన వెంకట్ సహ నిర్మాతగా ఉన్నారు. ఇది ఇలా ఉంటే.. ఆయన ఏపీ రాజకీయలపై, ముఖ్యంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన పై తరచూ సోషల్ మీడియాలో ట్విట్లు చేస్తుంటారు. గతంలో బాపట్ల జిల్లాలో ఉన్న తన సొంత ఊర్లోని పాఠశాల అభివృద్ధిపై సోషల్ మీడియాలో ట్వీట్లు చేశారు. అలానే వైద్య రంగంలో సీఎం జగన్ అందిస్తున్న సేవలపై కూడా కోన వెంకట్ అభినందనలు తెలిపారు.
అలా ఏపీ ప్రభుత్వం గురించి, వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గురించి ఎప్పుడూ ట్వీట్లు చేస్తూ ఉండే రచయిత కోన వెంకట్.. తాజాగా మరో ట్వీట్ వదిలారు. బాపట్లలోని రోడ్ల గురించి వివరించేలా ఫోటోలను షేర్ చేశారు. పోస్టులో బాపట్లలో సీఎం జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి గురించి ప్రస్తావించారు. బాపట్లను చూస్తుంటే నమ్మలేకపోతున్నానన్న కోన వెంకట్ అన్నారు. అంతేకాక హైదరాబాద్ లోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తరహాలో బాపట్ల రోడ్లు ఉన్నాయని పోస్టులో పేర్కొన్నారు.
ఇంకా ఆయన తన పోస్టులో అనేక విషయాలను ప్రస్తావించారు. తాను ఏమి హైదరాబాద్ లోని రింగ్ రోడ్డుపై లేనని, అలాగనే బంజారాహిల్స్ , జూబ్లీహిల్స్ రోడ్ల మీద నిల్చుకుని లేనని పేర్కొన్నారు. తాను..తన సొంతురూ అయినా బాపట్ల రోడ్డు మీద ఉన్నాని తెలిపారు. తన ఊరు కాస్మోపాలిటిన్ నగరాలకు ఏ మాత్రం తక్కువ కాదని చెప్పేందుకు గర్వపడుతున్నా చెప్పుకొచ్చారు ఏపీలో జరిగిన అద్భుత ప్రగతికి ఇదే నిదర్శనమని అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిపరంగా, సుసంపన్నంగా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ చేస్తున్న కృషికి తాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ కోన వెంకట్ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
I’m not on ORR (Outer Ring Road) of Hyderabad…
I’m not standing on Banjarahills or Jubleehills Roads!!
Yessssss.. I’m on the Roads of my Hometown BAPATLA 👌
I’m proud to say that our Towns and Cities are no less than any Cosmopolitan City!!
This is definitely a phenomenal… pic.twitter.com/520f5l1hVz— KONA VENKAT (@konavenkat99) May 3, 2024