iDreamPost
android-app
ios-app

బ్రేకింగ్: YCP ఎంపీ నందిగం సురేష్ కి తృటిలో తప్పిన ప్రమాదం.. ఏం జరిగిందంటే

  • Published Jan 03, 2024 | 8:56 AM Updated Updated Jan 03, 2024 | 9:08 AM

Nandigam Suresh: బాపట్ల వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ కి తృటిలో ప్రమాదం తప్పింది. గుర్తు తెలియని ఆగంతకులు సురేష్ కారును ఢీకొట్టే ప్రయత్నం చేశారు. ఆ వివరాలు..

Nandigam Suresh: బాపట్ల వైసీపీ ఎంపీ నందిగాం సురేష్ కి తృటిలో ప్రమాదం తప్పింది. గుర్తు తెలియని ఆగంతకులు సురేష్ కారును ఢీకొట్టే ప్రయత్నం చేశారు. ఆ వివరాలు..

  • Published Jan 03, 2024 | 8:56 AMUpdated Jan 03, 2024 | 9:08 AM
బ్రేకింగ్: YCP ఎంపీ నందిగం సురేష్ కి తృటిలో తప్పిన ప్రమాదం.. ఏం జరిగిందంటే

ఆంధ్రప్రదేశ్, అధికార పార్టీ వైసీపీ బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ కు తృటిలో ప్రమాదం తెలిపింది. గుర్తు తెలియని వ్యక్తులు కొందరు.. ఎంపీ కారును మరో కారుతో ఢీకొట్టేందుకు ప్రయత్నించారు. మంగళవారం నాడు ఈ ఘటన వెలుగు చూసింది. అమరావతి కరకట్ట వెంబడి ఉన్న ఇస్కాన్‌ టెంపుల్‌ సమీపంలోని బీబీ1 మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగంతకులు.. ఎంపీ కారును ఢీకొట్టేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత కారులో ఉన్న ఆగంతుకులు.. మంత్రి వైపు బొటనవేలు, చిటికెనవేలు చూపిస్తూ, చూపుడు వేలుతో వార్నింగ్‌ ఇచ్చారు. ఆ తర్వాత వారు ప్రకాశం బ్యారేజ్‌ వైపు పరారయ్యేందుకు ప్రయత్నించారు.

ఎంపీ సురేష్‌ పీఎస్‌వో బషీర్‌ తెలిపిన వివరాల మేరకు.. సురేష్‌ కాన్వాయ్‌ కరకట్ట మీదుగా వెళుతున్న సమయంలో ఇస్కాన్‌ టెంపుల్‌ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఏపీ16 జెఎఫ్‌ 0828 నంబరు ఉన్న కారులో వచ్చిన వారు.. కావాలనే ఎంపీ వాహనాన్ని ఢీకొట్టేందుకు ప్రయత్నం చేశారు. ఇస్కాన్‌ టెంపుల్‌ సమీపంలో ఆపి ఉన్న కారు ఒక్కసారిగా రోడ్డు మీదుగా వచ్చి ఎస్కార్ట్‌ వాహనాన్ని, సురేష్‌ కారును ఢీకొట్టేందుకు ప్రయత్నించింది అని చెప్పుకొచ్చారు బషీర్.

Nandigam Suresh missed an accident

ఎదురుగా వస్తోన్న కారును గమనించిన ఎంపీ కారు డ్రైవర్‌ అప్రమత్తమై వాహనాన్ని కంట్రోల్‌ చేశారు. లేకపోతే కారు కరకట్ట మీద నుంచి 30 అడుగుల లోతులో ఉన్న పంట పొలాల్లోకి దూసుకుపోయేది అని తెలిపారు బషీర్. ఎంపీ కారును ఢీకొట్టెందుకు ప్రయత్నించడమే కాక.. ఆ తర్వాత కారులో డ్రైవర్‌ వెనుక కూర్చున్న వ్యక్తి కారు అద్దాలు కిందికి దించి చూపుడువేలుతో వార్నింగ్‌ ఇస్తూ, టీడీపీ సింబల్‌ అయిన విక్టరీ సింబల్‌ చూపిస్తూ నాలుక మడత పెట్టి వార్నింగ్‌ ఇస్తున్నట్లు సైగలు చేశారని చెప్పుకొచ్చారు. ఆగంతకులు ఉన్న కారులోంచి ఓ వ్యక్తి కిందకు దిగి వేళ్లు చూపిస్తూ ఎంపీ అయితే ఏమిటి.. త్వరలోనే మీ సంగతి చూస్తానంటూ వార్నింగ్‌ ఇచ్చాడని చెప్పుకొచ్చారు.

ఆగంతకుల కారుకు అడ్డుగా నిలిచిన బషీర్‌ను ఢీ కొట్టేందుకు ప్రయత్నించారు. ఎంపీ సురేష్‌ సీటులో కూర్చున్న వ్యక్తిని ఉద్దేశించి.. మీరు ఎవరు.. ఎందుకు ఇలా చేస్తున్నారు అని ప్రశ్నించగా.. నీకు చెప్పేది ఏంట్రా అంటూ కారు ఎక్కుతూ మరోసారి చేతివేళ్లు ఊపుతూ నీ సంగతి తేలుస్తామంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు ఆగంతకులు. ఆ కారులో డ్రైవర్‌తో పాటు మరో ముగ్గురు ఉన్నారు. ఈ ఘటనపై తుళ్ళూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి కారు నంబరు ఆధారంగా వారిని పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారని సురేష్ పీఎస్వో బషీర్‌ తెలిపారు.