iDreamPost
android-app
ios-app

టీడీపీ సోషల్ మీడియా ముందస్తు ప్రణాళికతోనే నందిగం సురేష్ మీద దాడి చేశారా?

టీడీపీ సోషల్ మీడియా ముందస్తు ప్రణాళికతోనే నందిగం సురేష్ మీద దాడి చేశారా?

నిన్న బాపట్ల ఎంపి నందిగం సురేష్ వ్యక్తిగత కార్యక్రమం నిమిత్తం కృష్ణా జిల్లా నందిగామ వెళ్లారు. ఎంపి తన పనులు ముగించుకొని కారు ఎక్కుతున్న సమయంలో అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేతలు, తెలుగుదేశం పార్టీ నేతలు ఎంపి ని కలుసుకొని గులాబీ పూలు ఇచ్చి అమరావతికి మద్దతు తెలపాల్సిందిగా కోరారు. ఎంపి నవ్వుతూనే మాట్లాడుతూ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో వెనుకనుండి వచ్చిన కొందరు తెలుగుదేశం కార్యకర్తలు జై అమరావతి అంటూ నినాదాలు చేస్తూ ఒక్కసారిగా తీవ్ర దుర్భాషలాడుతూ ఎంపి పై దౌర్జన్యానికి దిగారు.

ఈ సమయంలో ఎంపి అక్కడనుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేయడంతో ఆయన కారుని అడ్డుకొని ఆయనపై దాడికి దిగారు. దాడిని అడ్డుకోబోయిన ఎంపి పియస్ఓ విజయ బాబు, పిఎ జగదీశ్ పై దాడికి పాల్పడినట్టు ఎంపి తరపు న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదుపై టిడిపి విద్యార్థి విభాగం టి.ఎన్.ఎస్.ఎఫ్ సోషల్ మీడియా ఇంచార్జ్ సజ్జా అజయ్ చౌదరి తో పాటు మరికొందరు తెలుగుదేశం కార్యకర్తలు ఎంపి పై ఉద్దేశ్యపూర్వకంగా దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి దిగినట్టు కేసు నమోదు చేసినట్టు నందిగామ పోలీస్ స్టేషన్ ఎస్.హెచ్.ఒ రవి కుమార్ తెలిపారు.

కాగా ఎంపి పై ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నందిగామకు చెందిన సజ్జా అజయ్ చౌదరి తెలుగుదేశం దేశం విద్యార్థి విభాగం టి.ఎన్.ఎస్.ఎఫ్ సోషల్ మీడియా ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఇతను నారా లోకేష్ బాబు కి అత్యంత సన్నిహితుడు. ఇతను చాలా కాలంగా పార్టీ కార్యక్రమాలతో పాటు అమరావతిలో జరుగుతున్న రాజధాని ఆందోళనలలో క్రీయాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల నాగార్జున యూనివర్సిటీ దగ్గర హైవే దిగ్బంధంతో పాటు మాజీ మంత్రి ఉమా మహేశ్వర రావు నిర్వహిస్తున్న రాజధాని దీక్షలలో చాలా చురుగ్గా పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో నిన్న ఎంపీ పై దాడి ఘటనలో ఇతని పాత్ర బయటపడడంతో రాజధాని ఉద్యమం మాటున అధికార పార్టీ నాయకులపై తెలుగుదేశం నాయకులు ప్రత్యక్షదాడులకు దిగుతున్నారు. ఇటీవల కాజా టోల్ ప్లాజా వద్ద మాచర్ల ఎమ్మెల్యే, ప్రభుత్వ చీప్ విప్ పిన్నెల్లి రామాకృష్ణా రెడ్డి పై దాడి జరిగిన నేపథ్యంలో ఈ క్రమంలో ఉద్దేశ్యపూర్వకంగానే వైసిపి నేతలను లక్ష్యంగా తీసుకొని తెలుగుదేశం నేతలు దాడులకు దిగుతున్నట్టుగా తెలుస్తుంది.

చంద్రబాబు హయాంలో రాజధానికి తన భూమిని ఇవ్వటానికి నిరాకరించిన సామాన్య దళిత రైతు నందిగం సురేష్ మీద బాబు ప్రభుత్వం దాష్టీకం చేసింది. అనేకసార్లు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పారు… ఒకసారికి మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఒక సీఐ నోటిలో తుపాకీ పెట్టి బెదిరించినట్లు సురేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు…

నాటి ప్రభుత్వం సురేష్ మీద చేసిన దాడులే అతన్ని జగన్ దృష్టిలో పడేలాగా చేశాయి..సామాన్య కూలి నుంచి లోక్ సభ సభ్యుడిగా ఎదిగిన సురేష్ మీద టీడీపీ రాజకీయ కక్షలో భాగంగానే ఇలాంటి దాడులలు పాల్పడుతున్నట్లు దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి.