iDreamPost
android-app
ios-app

దారుణం: పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పటించారు!

దారుణం: పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పటించారు!

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో దారుణాలు, ఘోరాలు చోటు చేసుకుంటున్నాయి. ఆడ వారి నుంచి పసి పిల్లల వరకు.. అందరిపై ఏదో ఒక ప్రాంతంలో దాడులు జరుగుతున్నాయి. ఇప్పటికి ఇలాంటి ఘటనలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా పదో తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పటించారు. దీంతో తీవ్రంగా గాయపడిన బాధితుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘోరం బాపట్ల జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజోలు పంచాయతీ పరిధి ఉప్పలవారిపాలెంకి చెందిన ఉప్పల అమర్నాథ్‌ అనే విద్యార్థి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. రోజూ ఉదయం రాజోలులో ట్యూషన్‌కి వెళ్తుండే వాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం కూడా ట్యూషన్ కి బయలు దేరాడు. మార్గంమధ్యలో రెడ్లపాలెం వద్ద అమర్నాథ్‌ స్నేహితుడు వెంకటేశ్వరరెడ్డి.. మరి కొందరితో కలిసి ఆ విద్యార్థిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. మంటల అంటుకోవడంతో విద్యార్థి పెద్ద పెట్టున కేకలు వేశాడు.

దీంతో అతడి హాహాకారాలు గమనించిన స్థానికులు వెంటనే మంటలు ఆర్పారు. అనంతరం బాధితుడిని గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అమర్నాథ్ మృతి చెందాడు. తనపై వెంకటేశ్వర్‌రెడ్డి, మరికొందరు పెట్రోల్‌ పోసి నిప్పంటించారని మృతికి ముందు పోలీసులకు విద్యార్థి వాంగ్మూలం ఇచ్చాడు. ఈ ఘటనపై చెరుకుపల్లి ఎస్సై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom