iDreamPost
android-app
ios-app

మార్కులు వేయకపోతే.. చేతబడి చేయిస్తా.. టీచర్‌కు విద్యార్థి వార్నింగ్

పరీక్షలు అంటే ఏ విద్యార్థికైనా భయమే.. చదివినా, చదవకున్నా.. పరీక్షలు రాయాల్సిందే. బాగా చదివిన విద్యార్థి పరీక్షను బాగా రాస్తాడు. చదవని విద్యార్థి కాపీ కొట్టడమే లేక.. పాటలు, సినిమా కథలు రాస్తాడు. ఇంకొంత మంది రిక్వెస్టులు చేస్తారు. కానీ ఈ విద్యార్థి

పరీక్షలు అంటే ఏ విద్యార్థికైనా భయమే.. చదివినా, చదవకున్నా.. పరీక్షలు రాయాల్సిందే. బాగా చదివిన విద్యార్థి పరీక్షను బాగా రాస్తాడు. చదవని విద్యార్థి కాపీ కొట్టడమే లేక.. పాటలు, సినిమా కథలు రాస్తాడు. ఇంకొంత మంది రిక్వెస్టులు చేస్తారు. కానీ ఈ విద్యార్థి

మార్కులు వేయకపోతే.. చేతబడి చేయిస్తా.. టీచర్‌కు విద్యార్థి వార్నింగ్

‘విజ్ఞానంతోనే వికసించు జగత్తు.. పసి పిల్లల చదువే దానికి విత్తు’ అని అని ఓ కవి అన్నారు. అలాగే నేటి బాలలే రేపటి పౌరులు అని కూడా చెప్పారు పెద్దలు. విద్యా బుద్దులు నేర్చుకుని ఉన్నత పౌరులుగా ఎదగాల్సిన కొంత మంది విద్యార్థులు అతి తెలివి తేటలు ప్రదర్శిస్తున్నారు. పరీక్షలు వచ్చేంత వరకు పుస్తకాలు పట్టరు. రేపు పొద్దున్నఎగ్జామ్స్ అనగా..నైట్ తూతూ మంత్రంగా పేజీలు తిప్పుతుంటారు. ఎవరైనా చూపించపోతారా అన్న ధీమాలో కొందరు ఉంటారు. చీటీలు పెట్టి, కాపీ కొట్టి చీటింగ్ చేసేవాళ్లు కొందరు. అంతేనా పరీక్షల సమయంలో పేపర్ చివరిలో డబ్బులు పెట్టి.. సినిమా కథలు, పాటలు రాసి.. టీచర్లను పరీక్ష పాస్ చేయండని వేడుకున్న విద్యార్థులను కూడా చూశాం. కానీ ఇప్పుడో విద్యార్థి అయితే ఏకంగా బెదిరిస్తున్నాడు.

మార్కులు వేయకుంటే చేతబడి చేయిస్తా అంటూ హెచ్చరించాడు. ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే.. ఆంధ్రప్రదేశ్‌లో. ఇటీవలే ఏపీలో పదోతరగతి పరీక్షలు ముగిసిన సంగతి విదితమే. అయితే ఈ పేపర్లను మూల్యాంకనం చేస్తున్నారు ఉపాధ్యాయులు. అంతలో ఓ పేపర్ కరెక్షన్ చేస్తుండగా.. వింత అనుభవం ఎదురైంది ఓ ఉపాధ్యాయుడికి. అందులో రాసిన మేసేజ్ చూసి ఒక్కసారిగా ఖంగుతిన్నాడు టీచర్. ‘నాకు మార్కులు వేయకపోతే.. మా తాతతో చెప్పి చేతబడి చేయిస్తా’ అంటూ టీచర్‌ వార్నింగ్ ఇచ్చాడు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పదోతరగతి పత్రాలు కరెక్షన్ చేస్తున్న ఓ టీచర్ ఎదుర్కొన్న వింత వార్నింగ్ ఇది.

తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన పరీక్షలో రామాయణ ప్రాశస్త్యం గురించి వివరించండి అన్న ప్రశ్న వచ్చింది. బహుశా ఈ ప్రశ్నకు ఆ విద్యార్థికి ఆన్సర్ తెలిసి ఉండకపోవచ్చు. దీంతో అక్కడే ఓ సమాధానం రాశాడు. ‘మార్కులు వేయకపోతే తాతతో చేతబడి చేయిస్తా’ అని ఆన్సర్ రాయడంతో ఉపాధ్యాయుడు అవాక్కయ్యాడు. వెంటనే ఆ జవాబు పత్రాన్ని అక్కడే ఉన్న ఉన్నతాధికారులకు చూపించాడు. పోనీ అతడికి మార్కులు సరిగా రాలేదా అంటే.. ఈ సబ్జెక్టులో 70 మార్కులు రావడం గమనార్హం. ఈ విషయం ఆ నోట ఈ నోట చేరి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతేనా మరో ఆన్సర్ షీట్‌లో రామాయణంలో పాత్ర స్వభావం గురించిన ప్రశ్నకు.. ‘మంధర.. శివాజీ మహారాజును తీసుకుని దండకారణ్యానికి వెళ్లింది’ అని రాశాడట. మొత్తానికి అతడికి రామాయణానికి సంబంధించిన చాప్టర్ చదివినట్లు లేడు. దీంతో తాను పరీక్షల్లో ఫెయిల్ అవుతానన్న భయంతో ఇలా భయపెట్టినట్లు తెలుస్తోంది.