iDreamPost
android-app
ios-app

ఆడపిల్లల్ని కన్నదని ఇంతటి శిక్ష? గుండెల్ని పిండేస్తున్న ఘటన!

మణికంఠ-కుసుమాంజలిది ప్రేమ వివాహం. కుసుమాంజలి కట్నం తేలేదన్న చిన్న చూపు అత్తింటి వారిది. ఈ విషయంపై కొడుక్కి ఎక్కేసి చెప్పడంతో భార్యపై విరుచుకుపడేవాడు. ఈ విషయం పెద్దల వద్దకు వెళ్లి రాజీ కుదిరింది. మళ్లీ హాయిగా సంసారం చేసుకుంటున్నారు. అంతలో కుసుమాంజలి రెండో సారి గర్భం దాల్చింది.

మణికంఠ-కుసుమాంజలిది ప్రేమ వివాహం. కుసుమాంజలి కట్నం తేలేదన్న చిన్న చూపు అత్తింటి వారిది. ఈ విషయంపై కొడుక్కి ఎక్కేసి చెప్పడంతో భార్యపై విరుచుకుపడేవాడు. ఈ విషయం పెద్దల వద్దకు వెళ్లి రాజీ కుదిరింది. మళ్లీ హాయిగా సంసారం చేసుకుంటున్నారు. అంతలో కుసుమాంజలి రెండో సారి గర్భం దాల్చింది.

ఆడపిల్లల్ని కన్నదని ఇంతటి శిక్ష? గుండెల్ని పిండేస్తున్న ఘటన!

ఆడ, మగ ఇద్దరు సమానం అనుకుంటున్న ఈ రోజుల్లో ఇంకా కొన్ని కుటుంబాల్లో వారసులు కావాలంటూ కోడలిపై ఒత్తిడి తీసుకు వస్తున్నారు అత్తింటి వారు. ఆడపిల్లల్ని కంటే ఆమెను నానా రకాలుగా హింసకు గురి చేస్తుంటారు. చదువుకున్న మూర్ఖులు సైతం ఇదే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. మొన్నటికి మొన్న పీహెచ్‌డీ చేసిన ఓ వ్యక్తి.. తొలుత ఇద్దరు ఆడపిల్లలు ఉండటంతో.. మూడో కాన్పులో కూడా పాపే అని నిర్దారించుకుని.. బలవంతంగా భార్యకు అబార్షన్ చేయించాడు. కానీ బిడ్డతో పాటు భార్య చనిపోయిన ఘటన సంచలనం కలిగింది. ఇప్పుడు కోడలికి ముగ్గురు ఆడబిడ్డలే కావడంతో ఆమెను ఇంట్లోకి రానివ్వడం లేదు. భర్త చనిపోయాడన్న పుట్టెడు దు:ఖంలో మునిగిపోయిన బాధితురాలికి అండగా నిలవాల్సిన అత్త.. ఆమెను కాదంది. దీంతో బాధితురాలు మౌన పోరాటానికి దిగింది.

తాను ఓ అమ్మకు కూతురని మరిచిపోయిన అత్త.. ఆడపిల్లల్ని కనిందని కోడల్ని ఇంట్లోని రానివ్వని ఘటన బాపట్ల చీరాల మండలంలో చోటుచేసుకుంది. చీరాల మండలం కొత్త పాలెంకు చెందిన మణికంఠ రెడ్డి, కుసుమాంజలి ప్రేమించి, పెళ్లి చేసుకున్నారు. 2021లో వీరికి వివాహం జరిగింది. వీరికో పాప పుట్టింది. అయితే ఈ పెళ్లి అత్తింటి వారికి ఇష్టం లేదు. కానీ కొడుకు మాట కాదనలేక ఒప్పుకున్నారు. అలాగే మణికంఠ తమ్ముడికి వివాహం జరగ్గా.. ఆమె కట్నం తీసుకువచ్చింది. నీ భార్య ఏ కట్నం తీసుకురాలేదని మణికంఠను అమ్మనాన్నలు నిలదీయడంతో.. ఈ విషయంపై భార్యపై విరుచుకుపడేవాడు. దీంతో మణి-కుసుమాంజలి మధ్య గొడవలు అయ్యాయి. ఈ పంచాయతీ పెద్దల వద్దకు వెళ్లడంతో రాజీ కుదిర్చారు. ఈ క్రమంలో కుసుమాంజలి గర్భం దాల్చింది.

అయితే 20 రోజుల క్రితం మణికంఠ పొలంలో పనిచేస్తూ ప్రమాదవ శాత్తూ ట్రాక్టర్ కింద పడి చనిపోయాడు. పుట్టెడు దు:ఖంలో మునిగిపోయిన కుసుమాంజలికి అత్తామామల నుండి సూటీపోటీ మాటలు మొదలయ్యాయి. అంతలో ఆమె ఇద్దరు కవల ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. ముగ్గురూ ఆడ పిల్లలు కూడా కావడంతో అత్తింటి వారు ఆమెను ఇంట్లోకి రానివ్వడం లేదు. దీంతో ఆమె అత్తింటి ముందు నిరసనకు దిగింది. చంటి బిడ్డలతో కలిసి.. అత్తింటి ముందు బైఠాయించింది. ఓ వైపు భర్తను కోల్పోయి ఉంటే.. మరో వైపు అత్తమామలు తనను ఇంట్లోని రానివ్వడం లేదని, తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. బంధువులు కూడా ఇలా చేయడం సమంజసం కాదని మణికంఠ తల్లిదండ్రులకు హితవు కోరుతున్నారు. అయినా కోడలిని యాక్సెప్ట్ చేసేందుకు ఆమె అత్తామామలు సిద్ధంగా లేరు.