iDreamPost

లడక్‌ ప్రమాదంలో APకి చెందిన ఇద్దరు జవాన్లు మృతి!

Army Jawans:ఇటీవల సైనిక విన్యాసాల్లో కొన్ని అపశృతులు జరుగుతున్న విషయం తెలిసిదే. ఈ క్రమంలోనే తూర్పు లద్దాఖ్‌లోని ఎల్ఏసీ సమీపంలో భారతీయ సైనికులకు ప్రమాదం జరిగింది.

Army Jawans:ఇటీవల సైనిక విన్యాసాల్లో కొన్ని అపశృతులు జరుగుతున్న విషయం తెలిసిదే. ఈ క్రమంలోనే తూర్పు లద్దాఖ్‌లోని ఎల్ఏసీ సమీపంలో భారతీయ సైనికులకు ప్రమాదం జరిగింది.

లడక్‌ ప్రమాదంలో APకి చెందిన ఇద్దరు జవాన్లు మృతి!

లద్దాఖ్‌ లోని దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో భారతీయ సైనికులకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇక్కడ సైనిక విన్యాసాలు చేస్తున్న సమయంలో టీ-72 యుద్ద ట్యాంక్‌లతో నది దాటుతున్న సమయంలో అనుకోకుండా వరద రావడంతో ప్రమాదం చోటు చేసుకుంది. లేహ్ నగరం నుంచి 148 కిలో మీటర్ల దూరంలోని మందిర్ మోత అనే ప్రాంతంలో నదిని దాటుతుండగా ఈ విషాద ఘటన శనివారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు జవాన్లు మృతి చెందగా వారిలో ఏపీకి చెందిన ఇద్దరు జవాన్లు ఉండటంతో ఆ గ్రామాల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వివరాల్లో వెళితే..

లద్దాఖ్‌ లో శనివారం ఉదయం జరిగిన ప్రమాదంలో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఇద్దరు జవాన్లు మృతి చెందారు. కృష్ణ జిల్లా పెడన మండలం చేవేండ్ర గ్రామానికి చెందిన జవాన్ సాదరబోయిన నాగరాజు (32) వీరమరణం పొందారు. నాగరాజు ఏనిమిదేళ్ల క్రితం ఆర్మీలో చేరారు. 2019 లో మంగదేవితో నాగరాజు వివాహం జరిగింది. ప్రస్తుంత మంగాదేవి ఉరివి సచివాలయంలో మహిళా పోలీస్ గా విధులు నిర్వహిస్తుంది. ఈ జంటకు ఏడాది వయసు ఉన్న పాప హన్సిక ఉంది. నేడు (జులై 1) మధ్యహ్నం గన్నవరం విమానాశ్రయానికి నాగరాజు మృతదేహం చేరుతుందని.. అక్కడ నుంచి చెవేండ్రకు తరలించి.. అంత్యక్రియలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు. నాగరాజు సోదరుడు శివయ్య కూడా సైనికుడిగా సేవలందిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్ కు చెందిన సుభాష్ ఖాన్ (40) సైతం ఈ ప్రమాదంలో వీర మరణం పొందారు. 17 ఏళ్ల క్రితం ఇయన సైనికుడిగా చేరి అంచెలంచెలుగా హవల్దార్ స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఆయన ఈఎంఈ మెకానికల్ విభాగంలో పనిచేస్తున్నారు. రెండేళ్లలో ఆయన ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా.. అంతలోనే ఈ దారుణ ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. సుభాష్ ఖాన్ కి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. లద్దాఖ్ ఘటనలో మృతి చెందిన సైనికులకు సైనిక, పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరగనున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి