నిన్న విడుదలైన విజయ్ బీస్ట్ ట్రైలర్ సంచలనాలు రేపుతోంది. కేవలం తమిళ వెర్షన్ మాత్రమే వదిలారు కానీ వీడియోలో కంటెంట్ ఈజీగా అర్థమయ్యేలా ఉండటంతో మనవాళ్ళు కూడా సబ్ టైటిల్స్ సహాయంతో చూసేస్తున్నారు. రిలీజ్ కు కేవలం 10 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో యూనిట్ ప్రమోషన్ వేగం పెంచింది.ఒకపక్క ఆర్ఆర్ఆర్ సునామి కొనసాగుతూ ఉండటం కొంత టెన్షన్ పెడుతున్నప్పటికీ అప్పటికి ఇరవై రోజులు అవుతుంది కాబట్టి జనం దీని వైపు వస్తారనే నమ్మకంతో టీమ్ ఉంది. […]
కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ రవిచందర్ కు తెలుగులో ఆఫర్లు వచ్చాయి కానీ ఎందుకో ఇక్కడ అంత బలమైన ముద్ర వేయలేకపోయాడు. ముఖ్యంగా అతను సంగీతం అందించిన సినిమాలు ఏవీ బ్లాక్ బస్టర్స్ కాకపోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. జెర్సీకి పేరు వచ్చినా ఆ క్రెడిట్ నాని పెర్ఫార్మన్స్ కింద నలిగిపోయింది. గ్యాంగ్ లీడర్ రెండు పాటలు హిట్ అయినా మూవీ రిజల్ట్ దెబ్బ కొట్టింది. ఇక పవర్ స్టార్ అభిమానులు పీడకలగా చెప్పుకునే అజ్ఞాతవాసి గురించి […]
తమిళనాడులో థియేటర్లు తెరిచాక ఓ మోస్తరు అంచనాలతో విడుదలైన శివ కార్తికేయన్ డాక్టర్ భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఇప్పటిదాకా 12 రోజుల్లోనే 80 కోట్ల గ్రాస్ ను అందుకోవడం ట్రేడ్ ని సైతం విస్మయపరిచింది. తెలుగులో కేవలం 1 కోటికి పైన కొంత మొత్తానికి బిజినెస్ చేసుకున్న వరుణ్ డాక్టర్ ఆల్రెడీ 2 కోట్ల మార్క్ ని దాటేసి డబుల్ ప్రాఫిట్స్ ఇచ్చేసింది. మొన్న దసరాకి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, పెళ్లి సందడి, మహా సముద్రంలతో పోటీ […]
నిన్న బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన కొండపొలం, ఆరడుగుల బులెట్ తర్వాత ఈ రోజు శివ కార్తికేయన్ తమిళ డబ్బింగ్ సినిమా వరుణ్ డాక్టర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒరిజినల్ టైటిల్ లో వరుణ్ లేకపోయినా ఇక్కడేదో రిజిస్ట్రేషన్ సమస్య వల్ల హీరో పేరు జోడించినట్టు ఉన్నారు. నయనతార కోకో కోకిలతో తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ దీనికి దర్శకుడు కావడంతో ప్రేక్షకుల్లో దీని మీద ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ ఆసక్తికరంగా […]
టాలీవుడ్ లో సంగీత దర్శకుల కొరత విపరీతంగా ఉంది. ఉన్న ఒక్క తమన్ డిమాండ్ మాములుగా లేదు. అల వైకుంఠపురములో తర్వాత మీడియం రేంజ్ సినిమాలకు తెచ్చుకోవడం చాలా కష్టంగా మారింది. ఇక దేవిశ్రీ ప్రసాద్ ఫామ్ కలవరపెడుతోంది. ఒక్క సుకుమార్ క్యాంప్ కు తప్ప తన స్థాయి అవుట్ పుట్ బయటివాళ్లకు ఇచ్చి చాలా కాలమయ్యింది. ఇక అనూప్ రూబెన్స్ మెరుపులు అడపా దడపా ఉంటున్నాయే తప్ప మనం లాంటి బెస్ట్ ఆల్బమ్ రావడం లేదు. […]