iDreamPost
android-app
ios-app

Anirudh Ravichander: అనిరుధ్​కు ధైర్యంగా మారిన ‘దేవర’.. ఇది కచ్చితంగా కమ్​బ్యాకే!

  • Published Aug 13, 2024 | 10:16 PM Updated Updated Aug 13, 2024 | 10:16 PM

Devara: మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో ఒకటైన​ ‘దేవర’ నుంచి వస్తున్న ఒక్కో అప్​డేట్ అదిరిపోతోంది. టీజర్స్, సాంగ్స్​తో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

Devara: మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో ఒకటైన​ ‘దేవర’ నుంచి వస్తున్న ఒక్కో అప్​డేట్ అదిరిపోతోంది. టీజర్స్, సాంగ్స్​తో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

  • Published Aug 13, 2024 | 10:16 PMUpdated Aug 13, 2024 | 10:16 PM
Anirudh Ravichander: అనిరుధ్​కు ధైర్యంగా మారిన ‘దేవర’.. ఇది కచ్చితంగా కమ్​బ్యాకే!

స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్​కు తమిళంలో ఉన్నంత సక్సెస్ తెలుగులో లేదనేది తెలిసిందే. కోలీవుడ్​లో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్​ఫుల్ ఆల్బమ్స్ ఇచ్చి టాప్ రేంజ్​కు చేరుకున్నాడాయన. అతడు మ్యూజిక్ కంపోజ్ చేసిన పాటలు డబ్బింగ్ రూపంలో ఇక్కడ చార్ట్ బస్టర్స్​గా మారాయి. అయితే స్ట్రయిట్ తెలుగు మూవీస్​ మాత్రం అనిరుధ్​కు అచ్చిరాలేదు. ‘అజ్ఞాతవాసి’, ‘జెర్సీ’, ‘గ్యాంగ్ లీడర్’ లాంటి పలు టాలీవుడ్ ఫిల్మ్స్​కు వర్క్ చేశాడీ స్టార్ కంపోజర్. కానీ మ్యూజిక్ పరంగా ఆ చిత్రాల ద్వారా అంత అప్లాజ్ అందుకోలేకపోయాడు. తెలుగులో అనిరుధ్​కు పాజిటివ్ టాక్ లేదు. ఇటీవల ‘భారతీయుడు 2’తో కూడా నిరాశ పర్చాడు. కానీ ఇప్పుడు ‘దేవర’ అతడికి ధైర్యంగా మారింది.

ఇంతవరకు చేసిన తెలుగు ప్రాజెక్టులేవీ అనిరుధ్​కు ధైర్యం ఇవ్వలేకపోయాయి. మ్యూజిక్ పరంగానూ, సినిమాల రిజల్ట్ పరంగానూ టాలీవుడ్​లో అతడికి నిరాశే మిగిలింది. కానీ ఇప్పుడు అతడిలో ధైర్యం నూరిపోస్తోంది జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ. ఈ సినిమా మ్యూజిక్​తో తెలుగు నాట రచ్చ చేస్తున్నాడు అనిరుధ్. ‘దేవర’ నుంచి ఇటీవల వచ్చిన ‘చుట్టమల్లే’ పాట వారం లోపే 53 మిలియన్ వ్యూస్ దాటేసింది. అంతకుముందు వచ్చిన ‘ఫియర్ సాంగ్’ 47 మిలియన్లతో యూట్యూబ్​ను షేక్ చేసింది. ‘దేవర’ నుంచి వచ్చిన ప్రతి సాంగ్​కు ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ లభిస్తోంది.

‘దేవర’ నుంచి వచ్చిన పాటలతో పాటు టీజర్​లో బీజీఎం సౌండ్​కు కూడా ప్రేక్షకులు, అభిమానుల నుంచి మంచి అప్లాజ్ వచ్చింది. ఈ సినిమాతో అనిరుధ్​కు టాలీవుడ్ సపోర్ట్, ధైర్యాన్ని ఇస్తోంది. అందుకు ఇండస్ట్రీకి, ఆడియెన్స్​కు క్రెడిట్ ఇవ్వాల్సిందే. అలాగే అతడితో ఇంత బాగా వర్క్ చేయించుకున్న దర్శకుడు కొరటాల శివను కూడా మెచ్చుకోవాలి. తెలుగు నాట సక్సెస్ కాలేనా? అని అతడిలో ఉన్న భయాన్ని పోగొట్టింది. ‘దేవర’ నుంచి తదుపరి రాబోయే పాటలు కూడా ఇలాగే హిట్ అయితే అనిరుధ్​ టాలీవుడ్​లో ఫుల్ బిజీ అయిపోవడం ఖాయమని ఎక్స్​పర్ట్స్ అంటున్నారు. ఇక్కడి ఆడియెన్స్​ పల్స్​ను అతడు పట్టేసుకున్నాడని.. ఇదే రీతిలో ఔట్​పుట్​ను ఇస్తే ప్రేక్షకులు నెత్తిన పెట్టుకుంటారని చెబుతున్నారు. తెలుగు నాట అతడికి ఇది గ్రాండ్​ కమ్​బ్యాక్ అని అంటున్నారు. మరి.. ‘దేవర’ నుంచి ఇప్పటిదాకా వచ్చిన సాంగ్స్​ మీకెలా అనిపించాయి? అనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.