iDreamPost
android-app
ios-app

Allu Arjun-Nelson Dilipkumar: రజినీకాంత్ డైరెక్టర్ తో అల్లు అర్జున్! మైండ్ బ్లోయింగ్ కాంబో..

  • Published Jul 15, 2024 | 6:50 PM Updated Updated Jul 15, 2024 | 6:50 PM

Allu Arjun-Nelson Dilipkumar: సూపర్ స్టార్ రజినీకాంత్ కు 'జైలర్' లాంటి 600 కోట్ల సినిమా ఇచ్చిన డైరెక్టర్ ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Allu Arjun-Nelson Dilipkumar: సూపర్ స్టార్ రజినీకాంత్ కు 'జైలర్' లాంటి 600 కోట్ల సినిమా ఇచ్చిన డైరెక్టర్ ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  • Published Jul 15, 2024 | 6:50 PMUpdated Jul 15, 2024 | 6:50 PM
Allu Arjun-Nelson Dilipkumar: రజినీకాంత్ డైరెక్టర్ తో అల్లు అర్జున్! మైండ్ బ్లోయింగ్ కాంబో..

ఇండస్ట్రీలో కాంబినేషన్లకు ప్రత్యేక క్రేజ్ ఉంటుందన్న విషయం మనందరికి తెలిసిందే. హిట్ ఇచ్చిన దర్శకుడితో.. ఓ స్టార్ హీరో పనిచేస్తున్నాడు అంటే.. ఆ మూవీపై ఓ రేంజ్ లో బజ్ క్రియేట్ అవుతుంది. అలాంటి క్రేజీ కాంబోనే ఒకటి సెట్ అయినట్లు తెలుస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ కు ‘జైలర్’ లాంటి 600 కోట్ల సినిమా ఇచ్చిన డైరెక్టర్ ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

అల్లు అర్జున్.. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత పలు ప్రాజెక్ట్ లు లైన్లో ఎన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఓ మూవీ చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. ఇక కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో చేస్తున్న మూవీ ఆగిపోయినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ క్రేజీ న్యూస్ టాలీవుడ్ ను షేక్ చేస్తోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ కు ‘జైలర్’ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో చేయబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

సూపర్ స్టార్ తో జైలర్ హిట్ కొట్టిన తర్వాత నెల్సన్ హైదరాబాద్ కు వచ్చి అల్లు అర్జున్ ను కలిశాడట. ఆ సమయంలో బన్నీకి ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాగా.. దానికి అతడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్ లో సాగుతుందట. అన్నీ కుదిరితే పుష్ప 2 తర్వాత బన్నీ చేయబోయే చిత్రం ఇదే అని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక ఈ మూవీని సన్ పిక్చర్స్ నిర్మించనున్నట్లు సమాచారం. మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ పనిచేయనున్నాడు. జైలర్ 2 ముగించుకున్న తర్వాత నెల్సన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ క్రేజీ కాంబోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom