iDreamPost
android-app
ios-app

అనిరుధ్ చేతిలో 10 సినిమాలు.. ఇంకా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో..

  • Published Jan 30, 2024 | 2:27 PM Updated Updated Jan 30, 2024 | 2:27 PM

అతడి సంగీతానికి గూస్ బంప్స్ వస్తుంటాయి.. ‘ ఏమ్ వాయిస్తున్నాడ్రా’ అంటూ ఫ్యాన్స్ సంభోదిస్తుంటారు. అంతలా తన సంగీతంతో మ్యాజిక్ వరల్డ్ క్రియేట్ చేస్తాడు అనిరుధ్. ఇప్పుడు తీరిక లేకుండా వర్క్ చేస్తున్నాడు. అతడి ఖాతాల బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవేమిటంటే..?

అతడి సంగీతానికి గూస్ బంప్స్ వస్తుంటాయి.. ‘ ఏమ్ వాయిస్తున్నాడ్రా’ అంటూ ఫ్యాన్స్ సంభోదిస్తుంటారు. అంతలా తన సంగీతంతో మ్యాజిక్ వరల్డ్ క్రియేట్ చేస్తాడు అనిరుధ్. ఇప్పుడు తీరిక లేకుండా వర్క్ చేస్తున్నాడు. అతడి ఖాతాల బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అవేమిటంటే..?

  • Published Jan 30, 2024 | 2:27 PMUpdated Jan 30, 2024 | 2:27 PM
అనిరుధ్ చేతిలో 10 సినిమాలు.. ఇంకా ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో..

వైవిధ్యమైన సంగీతాన్ని అందిస్తూ వరుసపెట్టి ఆఫర్లను కొల్లగొడుతున్నాడు యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్. మ్యూజిక్, బీజీఎంతో ర్యాంప్ ఆడిస్తాడంతే. రజనీకాంత్ భార్య లతాకు స్వయంగా మేనల్లుడు అయినా.. తన మ్యూజిక్ టాలెంట్‌తో మూవీ ఛాన్సులు పొందుతున్నాడు. గత ఏడాది రిలీజైన జైలర్, లియోలో అతడి ఇచ్చిన బీజీఎంకు పూనకాలు వచ్చేశాయి ఫ్యాన్సుకి. అలాగే అనిరుధ్ మ్యూజిక్ ఇస్తున్నాడంటే.. ఆ మూవీ హిట్ అన్న టాక్ కూడా వస్తోంది. సంగీత వాయిద్యాలతో కొత్త కొత్త సౌండ్స్ క్రియేట్ చేస్తూ..సీన్‌ను బట్టి మ్యూజిక్ అందించడంలో దిట్టగా మారిపోయాడు. తొలి సినిమా త్రీ మూవీతోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. .

ఇందులో ‘వై దిస్ కొలవరీ డీ’ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసింది అందరికీ తెలిసిందే. కోలీవుడ్ మాత్రమే కాకుండా టాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టి సత్తా చాటుతున్నాడు.  పవన్ కళ్యాణ్ మూవీ అజ్ఞాతవాసి పాటలే హైలెట్. నాని జెర్సీ, గ్యాంగ్ లీడర్ సినిమాలకు బానీలు అందించాడు. గత ఏడాది రెండు సినిమాలు హిట్స్ తర్వాత..  ఈ మ్యూజిక్ డైరెక్టర్ కోసమే వెయిట్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. హీరోలు సైతం ఇతడినే ఫిక్స్ చేసుకుంటున్నారని టాక్. ప్రస్తుతం అతడి చేతి నుండా పనే. అతడి సినిమాల లైనప్ చూస్తే కళ్లు చెదరాల్సిందే. ఆయన ఖాతాలో సుమారు 10 సినిమాలు ఉన్నాయి. ఇందులో రెండు చిత్రాలు.. టూ పార్ట్స్ గా రాబోతున్నాయి. కమల్ హాసన్ ఇండియన్ పార్ట్ 2 అండ్ 3కి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఎప్పటి నుండో షూటింగ్ జరుపుకుంటున్న ఇండియన్ 2 ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక టాలీవుడ్ ప్రెజ్టిసియస్ ప్రాజెక్ట్ దేవరకు అతడే మ్యూజిక్ డైరెక్టర్. వీటితో పాటు అజిత్ విదా ముయార్చితో రజనీ కాంత్ అప్ కమింగ్ మూవీస్ వెట్టియాన్, తలైవర్ 171 చిత్రాలకు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫిక్స్ అయ్యాడు అనిరుధ్. విజయ్ దేవరకొండ 12వ చిత్రానికి కూడా అతడే బాణీలు సమకూర్చనున్నాడు. అలాగే ప్రదీప్ రంగనాథ్- కృతి శెట్టి జంటగా.. విఘ్నేష్ శివన్ తెరకెక్కిస్తోన్న మూవీ లవ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)కి మ్యూజిక్ అందిస్తున్నాడు. మ్యాజిక్ అనే మూవీ కూడా అతడి చేతిలో ఉంది. వరుస పెట్టి ఛాన్సులు కొట్టేస్తున్నాడు. మరీ వీటిల్లో ఏమూవీకి క్రేజీ మ్యూజిక్ అందిస్తాడో.. ఎన్ని సెన్సేషన్స్ క్రియేట్ చేయనున్నాడో వెయిట్ చేయాల్సిందే.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibombetciograndpashabet