iDreamPost
android-app
ios-app

దేవర దావూదీ సాంగ్ వచ్చేసింది.. ఫ్యాన్స్ కి ఇది ఫుల్ మీల్సే!

  • Published Sep 04, 2024 | 5:23 PM Updated Updated Sep 04, 2024 | 5:31 PM

Devara Davoodi Song Released: దేవర పార్ట్ 1 నుంచి కొత్త సాంగ్ వచ్చేసింది. దావూదీ అనే వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ చూస్తే ఫ్యాన్స్ కి పూనకాలు అనే చెప్పాలి.

Devara Davoodi Song Released: దేవర పార్ట్ 1 నుంచి కొత్త సాంగ్ వచ్చేసింది. దావూదీ అనే వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ చూస్తే ఫ్యాన్స్ కి పూనకాలు అనే చెప్పాలి.

  • Published Sep 04, 2024 | 5:23 PMUpdated Sep 04, 2024 | 5:31 PM
దేవర దావూదీ సాంగ్ వచ్చేసింది.. ఫ్యాన్స్ కి ఇది ఫుల్ మీల్సే!

దేవర.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీకి ఉన్న బజ్ నెక్ట్స్ లెవల్ అని చెప్పాల్సిందే. ఆ బజ్ ని రెట్టింపు చేస్తూ కొరటాల శివ వరుస అప్ డేట్స్ తో అల్లాడించేస్తున్నాడు. ఇప్పటికే దేవర పార్ట్ 1 నుంచి చాలానే అప్ డేట్స్ వచ్చాయి. ముఖ్యంగా సాంగ్స్ విషయంలో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ గ్యాప్ లేకుండా.. వరుసగా సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే రెండు సాంగ్స్ ని విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా మూడో సాంగ్ ని కూడా తీసుకొచ్చారు. దావూదీ సాంగ్ ని బుధవారం సాయంత్రం 5.04 గంటలకు విడుదల చేశారు. మరి.. సాంగ్ ఎలా ఉంది? ఎన్టీఆర్- జాన్వీ మెప్పించారా?

దేవరకు బిగ్గెస్ట్ అసెట్ తారక్- జాన్వీ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ముందు నుంచి ఈ ప్రాజెక్ట్ లో వీళ్ల పెయిర్ కి చాలామంచి మార్కులు పడుతున్నాయి. పైగా వీడియో సాంగ్స్ వచ్చిన తర్వాత ఆ మార్కులు మరింత పెరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా దావూదీ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో వింటేజ్ తారక్ ని చూస్తున్న భావన కలుగుతుంది. ఎంతో ఎనర్జిటిక్ గా ఛార్మింగ్ గా కనిపిస్తున్నాడు. జాన్వీ కపూర్ కూడా తారక్ కు గట్టి పోటీ ఇస్తూ కనిపించింది. ముఖ్యంగా డ్యాన్స్ అయితే ఎన్టీఆర్ నెక్ట్స్ లెవల్లో ఇరగదీశాడు. జాన్వీ కపూర్ తన అందంతో ఫ్యాన్స్ ని కట్టిపడేస్తోంది.

ఈ సాంగ్ లో లిరిక్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. “కొరమీనా నిన్ను కోసుకుంటా ఇయ్యాలా.. పొయిమీన మరిగిందె మస్సాలా” అని వినగానే ప్రతి ఒక్కరి మనసులో ఏదో తెలియని ఆనందం వచ్చేస్తోంది. ఈ సాంగ్ లో ఎన్టీఆర్- జాన్వీ కపూర్ రెచ్చిపోయారు అనే చెప్పాలి. ఇద్దరూ కలిసి పోటా పోటీగా ఈ దావూదీ సాంగ్ లో ఇరగదీశారు. ఈ సాంగ్ పక్కా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్. అలాగే ఇంక రీల్స్ లో కూడా ఈ సాంగ్ ధూం ధాం చేస్తుంది. దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న విడుదల కానుంది. మరి.. సాంగ్ మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbenjaminsbet girişgrandpashabet