Krishna Kowshik
జనతా గ్యారేజ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుంది. దేవర మూవీతో రాబోతున్నారు కొరటాల శివ- జూనియర్ ఎన్టీఆర్. తారక్ 30వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం ఆడియో హక్కులను టీ సిరీస్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే జనవరి 8న గ్లింప్స్ రాబోతుండగా..
జనతా గ్యారేజ్ కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుంది. దేవర మూవీతో రాబోతున్నారు కొరటాల శివ- జూనియర్ ఎన్టీఆర్. తారక్ 30వ సినిమాగా రాబోతున్న ఈ చిత్రం ఆడియో హక్కులను టీ సిరీస్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే జనవరి 8న గ్లింప్స్ రాబోతుండగా..
Krishna Kowshik
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నుండి రాబోతున్న చిత్రం దేవర. జనతా గ్యారేజ్‌తో హిట్టందించిన కొరటాల శివకు మరో ఛాన్స్ ఇచ్చాడు తారక్. 30వ చిత్రంగా రాబోతున్న ఈ మూవీలో అతిలోక సుందరి, దివంగత నటి జాన్వీ కపూర్ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. సైఫ్ అలీఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, టామ్ చాకో, మురళీ శర్మ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్ అంచనాలు పెంచేశాయి. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ కొరటాల శివ ఇప్పటికే ప్రకటించిన సంగతి విదితమే. ఏప్రిల్ 5న పాన్ ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నెల 8న గ్లింప్స్‌తో వస్తున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్.
అయితే ఇప్పుడో ఇంట్రస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తుంది. సాధారణంగా తెరపై ఎన్టీఆర్ కనిపిస్తుంటే.. పక్కన మరెవ్వరూ కనిపించరు. అతడి యాక్టింగ్, డ్యాన్సింగ్ చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తూ ఉంటుంది. చెప్పాలంటే.. అతడి స్క్రీన్ ప్రెజెన్స్.. 24 క్రాఫ్ట్ లను డామినేట్ చేస్తుంది. మూవీకి ఎంత విజువల్ వండర్స్ చేసినా.. తారక్ తెరపై కనిపిస్తే చాలు.. వాటిని కూడా తొక్కిపడేస్తుంటారు తన నటనతో. దేవర మూవీ కూడా ఆ లెవల్లో ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఇటీవల కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ.. గ్లింప్స్ వీర లెవల్లో ఉండబోతుందంటూ ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపాడు. 72 సెకన్లతో కూడిన గ్లింప్స్ ఈ నెల 8న రాబోతుంది. ఈ మూవీని హీరో నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. కొరటాల శివ మిత్రుడు మిక్కిలినేని సుధాకర్, కళ్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మాతలు.
అయితే యంగ్ టైగర్‌నే డామినేట్ చేయబోతున్నాడట అనిరుధ్. అవును మీరు వింటున్నది నిజమే. అనిరుధ్ అందించిన మ్యూజిక్ హైలెట్ గా నిలబోడుతుందట. విజువల్ వండర్స్‌కు, తారక్ యాక్టింగ్‌ను దాటేసే రేంజ్‌లో మ్యూజిక్‌తో మ్యాజిక్ చేయబోతున్నాడట. సంగీత దర్శకుడు అనిరుధ్ చేస్తున్న ట్వీట్స్ కూడా ఈ విషయాన్ని నిజం చేస్తున్నాయి. లియో, జవాన్ కన్నా సాలిడ్ సంగీతాన్ని అందించాడట. ఈ మ్యూజిక్ .. తారక్‌ను సైతం మరిపిస్తుందని తెలుస్తోంది. ఈ విషయంలోనే యంగ్ టైగర్ కాస్త వెనుకబడ్డాడట. సముద్ర తీరంలో జరిగే సన్నివేశాలకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్.. బ్యాంగ్ బ్యాంగేనట. వాయించి అవతల పడేసినట్లు సమాచారం. ఇది ఫ్యాన్స్ కు మామూలు శుభవార్త కాదూ..పండుగ లాంటిదే. ఇక గ్లింప్స్‌లోనే అతడి పనితనాన్ని ప్రదర్శింబోతున్నాడట అనిరుధ్. ఇక అరాచకమే.. ఏమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.